మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శారీరక దారుఢ్యంతో పాటుగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వాడో–ఆర్‌వైయూ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ జేఎం దాస్ చెప్పారు. స్థానిక సీతారామపురంలోని ఐకాన్ స్కూల్ ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల ప్రారంభ సందర్భంగా జేఎం దాస్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలో శిక్షణ తీసుకోవడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి చదువులో కూడా రాణిస్తారన్నారు. ఐకాన్ స్కూల్ డైరెక్టర్ పార్థసారఽథి మాట్లాడుతూ కరాటే పోటీలకు తమ పాఠశాల ఆవరణ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై పలు అంశాల్లో ప్రతిభ చూపారు. ఆదిల్ పాషా బ్లాక్ బెల్ట్ సాధించగా.. 22 మంది ఎల్లో బెల్ట్, 10మంది ఆరెంజ్ బెల్ట్, 12 మంది గ్రీన్ బెల్ట్,10మంది పర్పుల్ బెల్ట్, 25 మంది బ్రౌన్‌బెల్ట్ సాధించారు. వీరికి జేఎం దాస్, పార్థసారథి సర్టిఫికెట్లను అందజేశారు.
మహిళలు ఫిట్‌నెస్‌పై
దృష్టి పెట్టాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని, అప్పుడే ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందని రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి అన్నారు. మొగల్రాజపురంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన హర్ హెల్త్ ఉమెన్ సెంటర్‌ను ఆదివారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ ఇలాంటి సెంటర్ వల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెంటర్ సీనియర్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఆర్. అర్చన మాట్లాడుతూ ఇక్కడ గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసులు, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ ఎం. త్రిపురసుందరీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ నూతన
కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీని వాసరావు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. అనిత వ్యవహరించారు. కృష్ణా జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా వి. సాంబశివరావు, కార్యదర్శులుగా పి. శివాజీ, గణేష్, సీహెచ్ నాగప్రసాద్, వై. శ్రీనివాసరావు, ఎన్. శివలక్ష్మి, వైవీ కృష్ణకాంత్, ఉపాధ్యక్షులుగా పి. సత్యనారాయణ, జేకే కిరణ్ కుమార్, డి. సాంబశివరావు, నాగరాజు, కల్యాణి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఏ. రాంగోపాల్, జి. వెంకటేశ్వరరావు, సీహెచ్ నారాయణ మూర్తి, ఎస్. పద్మావతి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. రామారావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, జిల్లా పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, టి. కోటేశ్వరరావు పాల్గొన్నారు.
బయ్యవరం(క్రోసూరు): మండలంలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆరు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు, ఆదివారం నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు పోటీలో నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎడ్లపోటీలు తిలకించేందుకు హాజరయ్యారు.
ఉత్సాహంగా కరాటే పోటీలు
ఉత్సాహంగా కరాటే పోటీలు
ఉత్సాహంగా కరాటే పోటీలు