
గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఏటీబీ ప్రారంభం
లక్ష్మీపురం (గుంటూరువెస్ట్) : ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఎనీ టైమ్ బ్యాగ్ (ఏటీబీ)యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాన్ని రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ఠ సేన్ శనివారం ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా పది రూపాయలకే క్లాత్ బ్యాగ్‌ను సులభంగా పొందవచ్చని తెలిపారు. ప్లాస్టిక్‌ను తగ్గించి క్లాత్ బ్యాగ్‌ను వినియోగించే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
చందోలు(కర్లపాలెం): చందోలులో ప్రసిద్ధి గాంచిన బగళాముఖి అమ్మవారిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారికి పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం జస్టిస్ శ్రవణ్‌కుమార్‌కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ అమ్మవారి ఆలయ విశేషాలను న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి వెంట బాపట్ల రెండవ అడిషనల్ జడ్జి పి.రాజశేఖర్, పీవీపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఎం.వశివకుమార్, సిబ్బంది ఉన్నారు.

గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఏటీబీ ప్రారంభం