
నిర్మల్
న్యూస్‌రీల్
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట పూర్తిగా తగ్గిపోయిన దిగుబడి పెట్టుబడి కూడా రాని పరిస్థితి
భీం ఆశయం నెరవేరేదెన్నడో!
ఆదివాసీలకు హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన గిరిజనుల ముద్దుబిడ్డ కుమురంభీం. ఆయన ఆశయం మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు.
నిండా మునిగిన
భైంసా: భారీ వర్షాలు జిల్లాలో సోయా రైతును నిండా ముంచాయి. భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టాలు చవిచూశారు. దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో వర్షాలు అనుకూలంగా ఉంటాయని భావించారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలు పంటను దెబ్బతీశాయి. ముధోల్ నియోజకవర్గంలో 80 శాతం మంది రైతులు సోయా సాగు చేశారు. తమకు పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో మొత్తం 1.05 లక్షల ఎకరాల్లో సోయా సాగు చేశారు. విత్తనాలు వేసినప్పటి నుంచి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. గతంలో నీటి తడి ఇవ్వాల్సి వచ్చేది. ఈసారి అలాంటి అవసరం లేదు. ఫలితంగా పంట బాగా పెరిగింది. రైతులు సంతోషించారు. పూత దశలో మరోసారి వర్షం కురవడంతో దిగుబడి పెరుగుతుందని ఆశపడ్డారు. అయితే, అధిక వానలు పంటను దెబ్బతీశాయి. తేమకు ఆకులు, పూత రాలిపోయేలా చేశాయి. ఇప్పుడు కోత సమయంలో దిగుబడి బాగా తగ్గింది.
ఎకరాకు రూ.23 వేల పెట్టుబడి..
ఒక్కో ఎకరానికి విత్తనాల నుంచి కోత వరకు రూ.23 వేలు ఖర్చయింది. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 4 వేల నుంచి రూ.4,600 వరకు ధర ఉంది. భైంసాలోని గాంధీగంజ్‌లో సోయా విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ ఏడు క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. అయినప్పటికీ, తక్కువ దిగుబడి కారణంగా పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు.
ముధోల్ మండలం ముద్గల్‌లో సోయాపంట
కష్టం వృథా..
మా కుటుంబమంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తాం. ఏటా సోయా పంటవేస్తాం. ఈయేడు కూడా సోయాపంట సాగుచేశాం. ఎకరానికి రూ.23 వేలు ఖర్చుఅయింది. ప్రస్తుతం పంట కోశాను. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రూ.15 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు.
– మహమూద్, రైతు
కోతలు ప్రారంభం
జిల్లాలో సోయాపంట కోతలు ప్రారంభమయ్యాయి. భారీ వర్షాలతో పంటకు తెగుళ్లు సోకాయి. ఈయేడు సోయాపంట కొంత దెబ్బతింది. పూర్తిస్థాయిలో పంటకోస్తే దిగుబడి తెలుస్తుంది. భారీ వర్షాలు కురిసిన వెంటనే కొంత మంది రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ఏఈఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు ఇచ్చారు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సోయా సాగు విస్తీర్ణం : 1.05 లక్షల ఎకరాలు
రైతులు 72,300
మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,328
కోతలు షురూ..
నాలుగు రోజులుగా జిల్లాలో సోయా కోతలు మొదలయ్యాయి. హార్వెస్టర్ల సాయంతో పంటను కోస్తున్నారు. ఎకరానికి కేవలం రూ.2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. కాయల దశలో గింజలు పూర్తిగా నిండలేదు. విత్తన కంపెనీలతో చర్చించి, పరిస్థితిని వివరించి నష్టాన్ని భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు. సాధారణంగా సోయా పంటకు రెండు సార్లు మందులు పిచికారీ చేసేవారు. విత్తనాలు వేసిన తర్వాత గడ్డి మందు ఒకసారి, పూత, కాయల దశలో తెగుళ్ల నివారణకు మరోసారి. అయితే ఈ ఏడు 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాల్సి వచ్చింది.

నిర్మల్