
నిలకడగా కడెం నీటిమట్టం
కడెం: కడెం ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695.500 అడుగులు ఉంది. ఆదివారం ప్రాజెక్టును చూసేందుకు సూదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. ప్రాజెక్టులో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఉల్లాసంగా గడిపారు.
కరాటే గ్రేడింగ్ పరీక్షలో ప్రతిభ
నిర్మల్‌ఖిల్లా: కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొట్టమొదటి మహిళా శిక్షకురాలు, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కిన్నెర్ల మృణాళిని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆ ఫ్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ రాపోలు సుదర్శన్ నేషనల్ బ్లాక్ బెల్ట్(4వ డాన్) తీసుకున్నారు. కార్యక్రమంలో జ పాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తె లంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తేజేందర్ సింగ్‌భా టియా, జిల్లా అధ్యక్షుడు కొండాజి శ్రీకాంత్, అ మ్ముల భూషణ్, చందుల స్వామి, శ్రీరాముల సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బోటింగ్ చేస్తున్న పర్యాటకులు

నిలకడగా కడెం నీటిమట్టం

నిలకడగా కడెం నీటిమట్టం