ట్రెండింగ్‌: స‌డ‌క్ 2కు డిస్‌లైకుల వ‌ర్షం

Sadak 2 Trailer Gets 2.3 Million Dislikes - Sakshi

ఏ సినిమా అయినా ఎక్కువ వ్యూస్ వ‌స్తూ, అధిక లైకులు తెచ్చుకుంటుంటే గొప్ప‌గా చెప్పుకుంటాం. ఇక్క‌డ కూడా ఓ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తోంది. కానీ దీని క‌థ, స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్‌.. పూర్తిగా వేరు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభ‌ట్ న‌టించిన తాజా చిత్రం 'స‌డ‌క్ 2'. ఆమె తండ్రి‌ మ‌హేశ్ భ‌ట్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొద్ది గంట‌ల క్రితం ఈ సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య అంద‌రినీ షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. అత‌ని మ‌ర‌ణంతో బాలీవుడ్‌లో నెపోటిజ‌మ్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రాజుకున్నాయి. (అలియా సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది)

బ‌య‌ట నుంచి వ‌చ్చిన సుశాంత్‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా, స‌హ‌న‌టుడిగా క‌నీస గౌర‌వం ఇవ్వ‌కుండా బాలీవుడ్ సెల‌బ్రిటీలు మాన‌సిక క్షోభ‌కు గురి చేశార‌న్న అభిప్రాయం అభిమానుల్లో బ‌లంగా నాటుకుపోయింది. దానికి ప‌రిణామంగా స్టార్ కిడ్స్‌పై ఆగ్ర‌హావేశాలు, వారిని అన్‌ఫాలో చేయ‌డం, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను విమ‌ర్శించ‌డంలాంటివి చూస్తూనే ఉన్నాం. ఓ పాత వీడియోలో సుశాంత్ ఎవ‌రో తెలీద‌న్న అలియాను కూడా నెటిజ‌న్లు ఏకిపారేశారు. అలాగే సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తితో స‌న్నిహితంగా ఉన్న ఆమె తండ్రి మ‌హేశ్ భ‌ట్‌పై కూడా తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తుండ‌టంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోలేమంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో "డిస్‌లైక్ క్యాంపెయిన్" చేప‌డుతూ వారి ప్ర‌తాపాన్ని చూపిస్తూన్నారు. (సుశాంత్‌ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్‌)

ఫ‌లితంగా యూట్యూబ్‌లో "స‌డ‌క్ 2 ట్రైల‌ర్‌కు 2.4 మిలియ‌న్ల డిస్‌లైకులు వ‌చ్చిప‌డ్డాయి. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. చూస్తుంటే ప్ర‌పంచంలోనే అత్య‌ధిక డిస్‌లైకులు తెచ్చుకున్న ట్రైల‌ర్‌గా స‌డ‌క్ 2 నిలిచే అవ‌కాశం ఉంది. దీనికి లైకులు మాత్రం ల‌క్షా 41 వేలుగా ఉంది. ట్రైల‌ర్ కింద ఈ సినిమాను విమ‌ర్శిస్తూ "జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుద‌ల అవుతుండ‌టంతో  #UninstallHotstar సైతం సోమ‌వారం ట్విట‌ర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక‌ ఈ సినిమా ఆస్టు 28న హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. కాగా సుశాంత్ ఫ్యామిలీ రూపొందించిన నెపోమీట‌ర్ కూడా ఈ చిత్రాన్ని 98 శాతం సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌వారితో తెర‌కెక్కించార‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. (సుశాంత్‌ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా)

సోష‌ల్ మీడియాలో స‌డ‌క్ 2 ట్రైల‌ర్‌పై ఏమంటున్నారంటే.. ఈ స‌మ‌యం కోసం క‌దా ఇన్నాళ్లు మేము వేచి చూస్తుంది అంటూ మీమ్స్‌రాయుళ్లు చెల‌రేగిపోతున్నారు. 'ఎంత‌గా ఎదురు చూశానో డిస్‌లైక్ కొట్ట‌డానికి అంటూ ఓ మీమ్ చాలామంది ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. మ‌రి ఈ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top