
మార్కొనహళ్లి డ్యాంలో మృత్యు కేక
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మార్కొనహళ్ళిలో సెఫోన్ వద్దనున్న జలాశయాన్ని చూడడానికి వెళ్లిన రెండు కుటుంబాలకు చెందిన 6 మంది నీటిలో పడి మునిగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
ఈత కొడుతూ ఉండగా..
● ఈ విషాదకర సంఘటన కుణిగల్ తాలూకాలోని మార్కొనహళ్ళి డ్యాంలో మంగళవారం జరిగింది.
● తుమకూరులోని బీటిపాళ్య నుంచి మాగడిపాళ్యలోని బంధువుల ఇంటికి ఓ కుటుంబం వెళ్లింది.
● దగ్గరిలోని శింషా నదిపైనున్న జలాశయం వర్షాలకు కళకళాడుతూ ఉండడంతో చూడాలని అతిథులు, స్థానిక కుటుంబీకులు వెళ్లారు.
● ఏడుమంది జలాశయం తీరంలో ఈతకొడుతూ ఉండగా, లోతైన చోట 7 మంది మునిగిపోయారు. వారిలో ఒకరు మాత్రం ఎలాగో బయటకు వచ్చారు.
● స్థానికులకు తెలిసి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి గాలించి సాజియా (32), అర్బిన్ (30) అనే ఇద్దరు మహిళల శవాలను బయటకు తీసుకొచ్చారు.
● తబసుమ్ (45), షబాన (44), మీప్రా (4), మహిబా (1) జలాశయంలో గల్లంతయ్యారు.
● ప్రాణాలతో బయటపడిన నవాబ్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.
● బంధువుల రోదనలతో డ్యాం వద్ద విషాదం అలముకొంది, రాత్రివరకూ గాలించినా మిగతా నలుగురి జాడ లేదు.
రెండు కుటుంబాలకు చెందిన
6 మంది గల్లంతు
ఇద్దరు మహిళల మృతదేహాల వెలికితీత
తుమకూరు జిల్లాలో ఘోర విషాదం

మార్కొనహళ్లి డ్యాంలో మృత్యు కేక