
రామప్ప శిల్పకళాసంపద అద్భుతం
● ఆలయాన్ని సందర్శించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్‌రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.