నామినేషన్‌ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం

Oct 6 2025 2:26 AM | Updated on Oct 6 2025 2:26 AM

నామినేషన్‌ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం

నామినేషన్‌ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం

రఘునాథపల్లి: సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు ప్రతిపక్షాల అభ్యర్థులు భ యపడే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నందున ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ధికి ఆ స్కారం ఉండదన్నారు. గెలిచే వారికి పార్టీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తామన్నారు. వెన్నుపోటుదా రులను ఉపేక్షించేది లేదని, పాత, కొత్త అన్న తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. బీసీలకు రిజ ర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ అడ్డుపడుతుందని, ఆ పార్టీతో ఒరిగేదేం లేదన్నారు. బాకీ కార్డు పేరిట బీఆర్‌ఎస్‌ దుష్పచారం చేస్తుందని, కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ల అవినీతి చిట్టాతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. పదేళ్లుగా పాలించిన వారి అవినీతిని వివరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎంపీ పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అ ధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు శివరాజ్‌యాదవ్‌, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు జగదీష్‌చందర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, అజయ్‌, జిల్లా నాయకులు జయరాములు, లింగాజీ, శివకుమార్‌, శిరీష్‌ రెడ్డి, సురేష్‌, సంపత్‌, అయిలయ్య, నరేందర్‌, భాస్కర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు, పదవులు

వరంగల్‌ ఎంపీ కావ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement