
సద్దుల సంబరం
రాయికల్/మెట్‌పల్లి/కోరుట్లరూరల్: సద్దుల బతుకమ్మను శనివారం సంబరంగా జరుపుకొన్నారు. వివిధ రకాల పూలు
సేకరించి.. బతుకమ్మగా తయారుచేసి.. గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుకుని నిమజ్జనం చేశారు. రాయికల్ మండలం ఆలూరు, మైతాపూర్, మూటపల్లి, రామాజీపేటలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆడుకున్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లో ఆటపాటలతో అలరించారు. చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్, సంగెం, చిన్నమెట్‌పల్లి, జోగిన్‌పెల్లి, పైడిమడుగులో మహిళలు బతుకమ్మ ఆడారు. మెట్‌పల్లిలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సతీమణి పాల్గొని మహిళలను ఉత్తేజ పరిచారు. ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మోహన్, సీఐ అనిల్‌కుమార్ పరిశీలించారు