
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం
నెహ్రూ నగర్: స్వచ్ఛ ఆంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం సోమవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. మొత్తం 17 కేటగిరీలలో అవార్డులను ఇచ్చామన్నారు. పరిశుభ్రమైన, హరితమయమైన గుంటూరు జిల్లాను ఆవిష్కృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతిబసు, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.