
7న అండర్–19 క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ, రెజ్లింగ్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అలాగే, ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఖో–ఖో బాలబాలికల జట్ల ఎంపిక కల్లూరు మినీ స్టేడియంలో 11వ తేదీన జరుగుతుందని మూసీ కలీం తెలిపారు.
అమ్మవారికి రూ.2.50లక్షల ఆభరణాలు
వైరా: వైరా హనుమాన్‌బజార్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు – తైవశ్రీ దంపతులు రూ 2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివకృష్ణ సత్కరించారు. అర్చకుడు రాజశేఖర్‌తో పాటు రాము, బాలయ్య, ఆంజనేయులు, ఏడుకొండలు పాల్గొన్నారు.