
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం;తిథి: బ.ద్వాదశి రా.11.14 వరకు,తదుపరి త్రయోదశి;నక్షత్రం: భరణి ప.3.58 వరకు,తదుపరి కృత్తిక;వర్జ్యం: రా.3.09 నుండి 4.39 వరకు దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు అమృత ఘడియలు: ఉ.11.22 నుండి 12.51 వరకు
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
వృషభం.... రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
మిథునం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం.... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం.
సింహం.... సన్నిహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు. ముఖ్య పనులు ముందుకు సాగవు. మీ ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కన్య.... రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి.
తుల..... కొత్త వ్యక్తుల పరిచయం. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా ముందుకు సాగుతాయి.
వృశ్చికం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు అంచనాలు మేరకు కొనసాగుతాయి.
ధనుస్సు.... ఉద్యోగయత్నాలు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.
మకరం.. పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కుంభం... మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మీనం.... కుటుంబసభ్యులతో విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కొన్ని పనులు నిదానిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.