
నాగోబా ఆలయంలో పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఐఎఫ్‌ఎస్,ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జి.త్రినాథ్‌కుమార్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ను మెస్రం వంశీయులు శాలువా కప్పి సన్మానించారు. నాగోబా ప్రతిమ అందించారు. ఆల య నిర్మాణం, చరిత్ర, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జాతర నిర్వహణ వివరాల ను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఏమాయికుంట నుంచి సమాక, పాటగూడ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలు తెలుసుకున్నారు. అటవీ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ ఎఫ్‌డీవో రేవంత్‌చంద్ర, డీఆర్‌వో నరేశ్, ఇంద్రవెల్లి, బేల ఎఫ్‌ఆర్వోలు సంతోష్, గులాబ్‌సింగ్, ఎఫ్‌ఎస్‌వోలు రాజేందర్ తదితరులు ఉన్నారు.