
‘ఐఏటీ’లో గిరిజన విద్యార్థినికి 729వ ర్యాంక్
ఉట్నూర్ రూరల్: మండలంలోని గంగన్నపేట్ గ్రామానికి చెందిన రాథోడ్ సరోజ–కిశోర్ దంపతుల కూతురు కీర్తి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఏటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి 729 ర్యాంక్ సాధించింది. తద్వారా బీఎస్‌ఎంఎస్ ఐదేళ్ల కోర్సులో ఒడిసా రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యూకేషనల్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) బరంపూర్ కళాశాలలో సీటు పొందింది. కీర్తి తల్లి సరోజ ఉపాధ్యాయురాలు కాగా, తండ్రి కిశోర్ నార్నూర్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. కీర్తి ఎస్సెస్సీ వరకు ఉట్నూర్‌లో, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. కీర్తిని స్థానికులు అభినందిస్తున్నారు.