సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం | Saina Nehwal to d. Lit awarded | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం

Oct 17 2016 12:28 AM | Updated on Aug 20 2018 9:35 PM

సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం - Sakshi

సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్)ను ఆదివారం ప్రదానం చేసింది.

చెన్నై: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్)ను ఆదివారం ప్రదానం చేసింది. కాటాన్ కొళత్తూరులోని వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక స్నాతకోత్సవం జరిగింది. ఆ వర్సిటీ చాన్‌‌సలర్ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం చేశారు.

అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఆర్ లక్ష్మణన్‌ను కూడా డి.లిట్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ క్రీడారంగానికి చెందిన తనకు డి.లిట్‌ను ప్రప్రథమంగా ఎస్‌ఆర్‌ఎం ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌లో సరైన ప్రదర్శన చేయలేకపోయానని తెలిపింది. క్రీడల పరంగా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement