ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు మరోసారి ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కడప: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు మరోసారి ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం కడపలో రాయలసీమకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు. రాయలసీమలోని పరిస్థితులు, ప్రభుత్వ వైఖరి గురించి చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు చెప్పారు.