నీటితొట్టిలో పడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో బుధవారం జరిగింది. పరకాలకు చెందిన మద్దెల మధు, రేవతి దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జనగామకు వచ్చారు. మధు ఎలక్ట్రీషియ¯ŒSగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారి గారాలపట్టి నిహారిక(3)ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
Sep 15 2016 12:06 AM | Updated on Sep 4 2017 1:29 PM
జనగామ : నీటితొట్టిలో పడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో బుధవారం జరిగింది. పరకాలకు చెందిన మద్దెల మధు, రేవతి దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జనగామకు వచ్చారు. మధు ఎలక్ట్రీషియ¯ŒSగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారి గారాలపట్టి నిహారిక(3)ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో తనతోపాటే ఉన్న కూతురు కొద్దిసేపటికి కనిపించకపోవడంతో రేవతి ఆందోళనకు గురైంది. ఇంటి వెనకాల ఉన్న నీటితొట్టి వద్దకు వెళ్లి చూడగా విగత జీవితగా కూతురు కనిపించడంతో ఆ తల్లి కుప్పకూలింది. అయ్యో బిడ్డా అంటూ గుండెలవిసేలా రోదించింది. రేవతి అరుపులు, కేకలు విన్న స్థానికు లు అక్కడి వెళ్లి చిన్నారిని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కన్న కూతురు చనిపోయిందని తెలుసుకున్న మధు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement