డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది | Khammam man with marriage America girl | Sakshi
Sakshi News home page

డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది

Jan 4 2016 9:23 PM | Updated on Apr 4 2019 3:41 PM

డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది - Sakshi

డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది

ఖమ్మం డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది. అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ చైతన్య అక్కడి అమ్మాయిని ప్రేమించి..

ఖమ్మం డాక్టర్ ప్రేమ..ఖండాంతరం దాటింది. అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ చైతన్య అక్కడి అమ్మాయిని ప్రేమించి..ఇరువైపుల పెద్దలను ఒప్పించి..సంప్రదాయబద్దంగా ఆదివారం ఖమ్మం సమీపంలోని పెద్దతండా చల్లపల్లి గార్డెన్‌లో పెళ్లి చేసుకున్నారు. నగరానికి చెందిన ఎస్‌బీహెచ్ రిటైర్డ్ ఏజీఎం వేములపల్లి వెంకటేశ్వర రావు, సుజాతల కుమారుడు డాక్టర్ వేములపల్లి కృష్ణచైతన్య. కొన్నేళ్లుగా అమెరికాలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
 
 శాన్‌డెస్కీ ఒహియో ప్రాంతానికి చెందిన మేఘన్ అనే అమ్మాయితో పరిచయం కాస్త..ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ..వారి తల్లిదండ్రులకు విషయం చెప్పగా..వారూ ఓకే అనేశారు. తల్లిదండ్రులు డేవిడ్‌కేన్, నాన్నికేన్‌లను తీసుకొని..ఆ అమ్మాయి ఖమ్మం చేరుకుంది. చల్లపల్లి గార్డెన్స్‌లో అబ్బాయి బంధువులందరి సమక్షంలో..వేద మంత్రోచ్ఛరణల నడుమ..వివాహం చేసుకున్నారు. వచ్చిన వారంతా..జంట భలే చూడముచ్చటగా ఉందే..శుభమస్తు..అంటూ ఆశీర్వదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement