అనార్యోగం.. రైలులో రద్దీ వెరసి ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా జనగామలో చోటుచేసుకుంది.
జనగామ: అనార్యోగం.. రైలులో రద్దీ వెరసి ఓ చిన్నారి ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా జనగామలో చోటుచేసుకుంది. గీసుకొండకు చెందిన గాదె రమేష్, అరుణల కూతురు క్రీస్తుజ్యోతి(11) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మెరుగైన చికిత్స కోసం దంపతులు ఆ చిన్నారితో ఆదివారం పుష్‌పుల్ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరారు. రైలు జనగామకు రాగానే పాప సొమ్మసిల్లింది. అప్పటికే అనారోగ్యంగా ఉండడం... రైలులో రద్దీ ఎక్కువగా ఉండడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో దంపతులు జనగామలో రైలు దిగి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు.