
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.
అయితే ఇటీవల తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.