Top Stories
ప్రధాన వార్తలు

మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.

భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
‘‘కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘వేవ్స్’లో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఫర్హాన్ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్ కుమార్ రావు, కబీర్ బేడీ, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్ కపూర్ చిత్రాలు పాపులర్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సత్యజిత్ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్ అనగానే ఏఆర్ రెహమాన్, రాజమౌళి (‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్ చక్రవర్తిగారు, స్టంట్స్ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్ ఖాన్, నటి దీపికా పదుకోన్ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్ షారుక్ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్. దీపికా పదుకోన్ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, మ్యూజిక్ డైరెక్టర్ సలీల్ చౌదరిల పోస్టల్ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు.⇒ ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్వయంగా ఈ మాట అంటున్నారు. ‘వేవ్స్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు. అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్ ΄్యాడ్ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్ ΄్యాడ్ వేవ్స్’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కులగణన విధివిధానాలేమిటో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రహస్యంగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అందర్నీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని, నిపుణులతో కూడిన అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తూతూమంత్రంగా కాకుండా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, బీర్ల ఐలయ్య వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే.. రాహుల్ ప్రతిపాదనను గౌరవించడం గొప్పతనం మా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ పహల్గాం దాడి నుంచి పక్కదారి పట్టించడానికో, బిహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నా సరే. దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు.. ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఇందుకు పూర్తిగా సహకరిస్తాం. మా అనుభవాలను పంచుకోవడానికి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కులగణన చేపడ్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ ప్రతిపాదనను మోదీ గౌరవించడం గొప్పతనం. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారో తేదీలను ప్రధాని ప్రకటించాలి. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది. దీనివల్ల సంక్షేమ పథకాలు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆయా కులాలకు కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. దాదాపు వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కులగణన చేశాం. రాహుల్‌గాంధీ సూచనలు తీసుకుని ఎలాంటి వివాదాలు, తప్పులు లేకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర స్టేక్ హోల్డర్లందరినీ భాగస్వాములను చేస్తూ.. 57 ప్రశ్నలతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సమగ్రంగా వివరాలు సేకరించి నివేదిక రూపొందించాం. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా భద్రత కల్పించాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. సీఎస్ నుంచి ఎన్యూమరేటర్ వరకు, మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఇలా.. 1.5 లక్షల మందితో ఈ ప్రక్రియ నిర్వహించాం. రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం.. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేశాం. దేశంలో జనగణనతో పాటు కులగణన తక్షణమే చేపట్టాలి అనేది మొదటిది. రెండోది బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపించాం. ఇదే డిమాండ్‌తో కుల సంఘాల మద్దతుతో ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఒకరోజు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అయినా కులగణన చేయబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు ఇప్పుడు అంగీకరించడానికి మా ఒత్తిడే ప్రధాన కారణం. ఏది ఏమైనా కేంద్రం నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. అభినందిస్తున్నాం. పారదర్శకంగా ముందుకు వెళ్లాలి ఈ ప్రక్రియ అమలులో సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో వెల్లడించాలి. కేంద్రం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ముందుకు వెళ్లాలి. అన్ని రాష్ట్రాల్లో సమాచార సేకరణ చేయాలి. మేం అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. కులగణన పూర్తి చేసి ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. మేము కుల గణన చేసినప్పుడు ఎదురైన సవాళ్లను కేంద్రంతో పంచుకోవడానికికి సిద్ధం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మా సంకల్పం. రాహల్‌గాంధీ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా నివేదికను ఇప్పటికే ఢిల్లీకి పంపించాం. ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమే. ఇక్కడకు వచి్చనా సరే.. మమ్మల్ని ఢిల్లీ రమ్మనా సరే.. ఒక మెట్టు దిగడానికి మేము రెడీ. పకడ్బందీగా చేసే ఆలోచన కన్పించడం లేదు మాది రాజకీయ ఉద్దేశంతో చేసిన కుల గణన అంటూ విమర్శలు చేసే నాయకులను ఒకే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో, 16 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కుల గణన చేసి ఆదర్శంగా నిలిచి ఉంటే.. మేము తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి (బీజేపీ) మాటల్లో కనిపిస్తోంది. పకడ్బందీగా కులగణన, జనగణన చేయాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. 2021లో జనగణన చేయకుండా వాయిదా వేశారు. మోదీ.. రేవంత్‌రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కక్కలేక మింగలేకపోతున్నారు. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు.. ఒక రాష్ట్రంలో బీసీ ఉండి, మరో రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులాలకు సంబంధించి కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినప్పుడు సమాధానం లభిస్తుంది. రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు అమలవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దీనితో సంబంధం లేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. మాకంటే మెరుగ్గా వారు కులగణన చేస్తే మంచిదే. ఆస్తులు, అప్పులు, పొలాల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. కానీ కులం విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. కులాల లెక్క పక్కాగా తేలితే సంక్షేమ పథకాల అమలు సులభం. వీటికి కేంద్రం డేటానే ప్రామాణికం. అది లేనప్పుడు మేము చేసిన సర్వే డేటానే ప్రామాణికం. తెలంగాణ సేకరించిన సమాచారం దేశానికి రోల్‌మోడల్. 400 సీట్లు వచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసేవారు బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. రిజర్వేషన్లు ఎత్తేసేవారు. ఇప్పుడు ఈ కులగణన చేపట్టేవారు కూడా కాదు. ఎన్నికల సమయంలో మేముప్రజలను అప్రమత్తం చేయడం వల్ల వారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకు పరిమితం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగానే వారి ఎజెండాను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతోందో ఈ బచ్చాలకు తెలియదు ఢిల్లీలో ఏమి జరుగుతోందో గల్లీలో తిరిగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బచ్చాలకు తెలియదు. నరేంద్రమోదీ ఎవరిని ఫాలో అవుతున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరి సలహా తీసుకుంటున్నారు. ఈ గల్లీల్లో తిరిగే పిల్లలకు తెలియదు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు తప్పుపట్టింది తప్ప.. 50 శాతం సీలింగ్‌ను కాదు. ఈడబ్ల్యూఎస్‌తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి. నమోదు చేసుకోనివారు లెక్కల్లో లేనట్లే.. కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు లెక్కలో లేనట్లే. కేసీఆర్ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక మాట అన్నారు. ‘ఉన్నోడే ఉన్నట్లు ..లేనోడు పోయినట్లే అని..’. వారికి ఆ స్పష్టత ఉంది. మా పార్టీ, ప్రభుత్వం హింసకు (ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ) వ్యతిరేకం. అది రాజ్యహింస అయినా, వ్యక్తులు చేసినా.. సంఘాలు చేసినా..తప్పే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం.

రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు, సవరణలతో అత్యంత కచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధంచే సేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మృతిచెందిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి వెనువెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్ మృతిచెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచిచూడకుండా నేరుగా ‘రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా’నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుంది. దీంతో మృతుల పేరిట మరొకరు ఓటు వేసే ఆస్కారం లేకుండా చేయాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఈసీ తీసుకుంది. అవి.. 1. నమోదిత మరణాల తాజా జాబితా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అందగానే బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ)కి సమాచారం ఇస్తారు. ఫామ్–7 అభ్యర్థన కోసం వేచిచూడకుండా నేరుగా రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఈ జాబితా తెప్పించుకోవచ్చు. తర్వాత మరణాన్ని ధృవీకరించుకునేందుకు ఆ బీఎల్ఓ సదరు ప్రాంతానికి వెళ్లి మృతి విషయాన్ని ఖరారుచేసుకుంటారు. ఓటర్ల నమోదు నియమావళి–1960లోని 9వ నిబంధన, 2023లో సవరించిన జనన, మరణాల నమోదు చట్టం–1969లోని 3(5)(బీ) సెక్షన్ ప్రకారం ఆయా జనన, మరణాల వివరాలు అడిగి తీసుకునే హక్కు ఈసీకి ఉంది. 2. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్(వీఐఎస్) మరింత స్పష్టంగా ఉండేందుకు ప్రస్తుతమున్న దాని డిజైన్‌ను మార్చనున్నారు. ఇకపై పెద్ద అక్షరాలతో డిజైన్ చేయడం వల్ల వీఐఎస్ సీరియల్ నంబర్, ఓటర్ పార్ట్‌నంబర్ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో ఓటర్ మరింత తేలిగ్గా చూసుకోగలడు. పోలింగ్ అధికారులు సైతం ఆయా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఏ పేజీలో ఉన్నాయో సులభంగా గుర్తుపట్టగలరు. 3. ప్రజా ప్రతినిధుల చట్టం,1950లోని 13బీ(2) సెక్షన్ ప్రకారం ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ నియమించిన బీఎల్ఓలు అందరికీ ప్రామాణికమైన ఫొటో గుర్తింపు కార్డులను జారీచేయనున్నారు. ఓటర్ వెరిఫికేషన్, నమోదు కార్యక్రమాల్లో బీఎల్ఓలను ఓటర్లు సులభంగా గుర్తించడానికి, వారితో ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తిచేసుకోవడానికి, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి వీలు చిక్కుతుంది. ముఖ్యంగా బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగే క్రమంలో వారిని ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఈ నూతన ప్రామాణిక గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈసీ భావిస్తోంది.

జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల పరంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. గతేడాది ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 12.6 శాతం అధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూలైంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలకు జీఎస్టీ ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది.ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఇది రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది. దేశీ లావాదేవీలపై జీఎస్టీ 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు చేరింది. రిఫండ్లు 48% అధికంగా రూ.27,341 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లను సర్దుబాటు చేసి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీ లావాదేవీలపై సెంట్రల్ జీఎస్టీ రూ.48,634 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ.59,372 కోట్లు సమకూరింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.69,504 కోట్లు, సెస్స్ వసూళ్లు రూ.12,293 కోట్ల చొప్పున ఉన్నాయి. బలమైన ఆర్థిక పనితీరు: డెలాయిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మించడం బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శమని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు. అన్ని ప్రధాన తయారీ, వినియోగ రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో 11–16 శాతం మధ్య ఉన్నాయని.. అంతకుముందు నెలల్లో పెద్ద రాష్ట్రాల్లో తక్కువ వృద్ధి నమోదైన దానికి ఇది భిన్నమని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని జీఎస్టీ వసూళ్లు చాటుతున్నట్టు ఈవై ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం ‘‘జీఎస్టీ వసూళ్ల గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సహకారాత్మక సమాఖ్యవాదాన్ని చాటుతున్నాయి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ అధికారుల కృషిని అభినందించారు

IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు.అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (13), రియాన్ పరాగ్ (16), ధృవ్ జురెల్ (11), శుభమ్ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత!
గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్ చేయడం, అందుకు కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది.

నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రీమెన్ కమిటీ
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది అనేదానికి కేవలం ఒక్కరు చెప్పినదాని ప్రకారం నిర్ధారణకు రాలేమని.. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని త్రిసభ్య విచారణ కమిటీ చెబుతోంది. గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం.. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడింది.త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. సింహాచలం ప్రమాద ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. మూడు రోజుల్లో ప్రాధమిక నివేదిక ఇస్తాం. నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం..సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది కారణాలు ఏమిటి అనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం. నాసిరకంగా కట్టడం వల్ల జరిగిందా? ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నాం. కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోలేం. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాం. అందరూ అన్ని వివరాలు చెప్పిన తరువాత మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.ఇక.. గోడ కూలిన ప్రమాద స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈ క్రమంలో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై త్రీమెన్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే వాళ్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఏవీ ఫాలో అయ్యారా....? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు. ప్రసాదం స్కీం పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సి ఫార్సులు ఏమయ్యాయన్న ప్రశ్నకు వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానాలు రాలేదు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటాకగోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం కూటమి ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది.

భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు. యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

IPL 2025, RR VS MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ (మే 1) జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.2011 నుంచి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడుతున్న హిట్‌మ్యాన్ ఆ ఫ్రాంచైజీ తరఫున 231 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 6017 పరుగులు చేశాడు.ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రోహిత్ తర్వాత కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. పోలీ ఎంఐ తరఫున 211 మ్యాచ్‌ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 3915 పరుగులు చేశాడు. పోలార్డ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంఐ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు.స్కై ఈ ఫ్రాంచైజీ తరఫున 109 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 3460 పరుగులు చేశాడు. ఈ జాబితాలో స్కై తర్వాతి స్థానాల్లో అంబటి రాయుడు (2635), సచిన్ టెండూల్కర్ (2599) ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (53), ర్యాన్ రికెల్టన్ (61) ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔటయ్యారు. 15 ఓవర్ల ముగిసే సమయానికి ముంబై స్కోర్ 146/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (18), హార్దిక్ పాండ్యా (10) క్రీజ్‌లో ఉన్నారు.
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
ఆటో.. అటూ ఇటూ!
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
అదిరిపోయే లుక్‌లో నభా నటేశ్.. వేకేషన్లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో కొత్త చిత్రం.. డప్పులతో ఫస్ట్ లుక్ పోస్టర్
'సినిమాల్లో మామయ్యే నాకు ఆదర్శం'.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ఆడుతూ పాడుతూ మార్కులు
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
రామాలయంలో బంగారు అభరణాల అపహరణ
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
ఆటో.. అటూ ఇటూ!
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు
పారిశుద్ధ్యంపై శ్రద్ధ తప్పనిసరి
గోపీనాథపట్నంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
ఆచారాలను ‘గంట‘ కలిపేశారు
గ్రాసిమ్ నుంచి ముడుపుల కోసమే..
కారు బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు
వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి
కళారంగానికి చేయూతనిస్తాం
శ్రీవారి చెంత సేద తీరి
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
మట్టి మాఫియా ఆగడాలపై నిరసన
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
గాలిదుమారం.. అకాల వర్షం
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్ ఎక్కువైంది’
‘ వారికి వసూల్ చేయడం రాదనే.. సీఎంను మార్చడం లేదు’
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై కత్తితో దాడి
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
భారత బాక్సర్లకు ఆరు పతకాలు
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
డ్రోన్ సాయంతో జూదరుల గుర్తింపు
ట్రంప్ టారిఫ్‌ల టెన్షన్!
అంగరంగ వైభవంగా పిడకల సమరం
క్యాసంపల్లి పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ అవార్డు
ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు
శిశువు మరణంపై పోలీసుల దర్యాప్తు
అక్రమ అరెస్టులకు భయపడకండి
లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు
1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత
పిడుగుపాటుతో రెండు ఆవులు మృతి
హెచ్ఆర్డీఎస్ ఇండియాతో కాల్కలస్ గ్రూప్ జట్టు
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలి
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి
ప్రైవేటుతో పర్యాటక శోభ..
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్ర
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ
జిమ్ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!
భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..
Champions Trophy 2025: టీమిండియా మేనేజర్ ఇంట విషాదం
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
రామోజీ లేరు.. విచారణా అక్కర్లేదు!
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
Hyderabad: గుర్రపు డెక్క తొలగిస్తుండగా ప్రమాదం
రన్‌వేపై విమానం బోల్తా
డీజీపీని కోర్టుకు పిలుస్తాం: హైకోర్టు
చిలుకతో వర్మ హీరోయిన్ పోటీ.. అరుణాచలంలో బిగ్‌బాస్ బ్యూటీ
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
భార్యతో గొడవపడి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
ఆటల్లో ఆణిముత్యం..ఐఏఎస్ ఆమె టార్గెట్..!
పట్టపగలే యువతికి లైంగిక వేధింపులు
సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు
‘నేనంటే పుతిన్‌కు భయం’
అసలు సమస్య ముంపే!
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
బ్యాంకింగ్ కాల్స్‌కు ప్రత్యేక నంబర్ల సిరీస్: ఆర్బీఐ సూచన
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బలగం బ్యూటీ బోల్డ్ లుక్.. మరింత హాట్‌గా పూనమ్ బజ్వా!
నదులు ఎండిపోతున్నాయ్!
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
‘చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట’
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
ఆటో.. అటూ ఇటూ!
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
అదిరిపోయే లుక్‌లో నభా నటేశ్.. వేకేషన్లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో కొత్త చిత్రం.. డప్పులతో ఫస్ట్ లుక్ పోస్టర్
'సినిమాల్లో మామయ్యే నాకు ఆదర్శం'.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్!
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ఆడుతూ పాడుతూ మార్కులు
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
రామాలయంలో బంగారు అభరణాల అపహరణ
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
ఆటో.. అటూ ఇటూ!
ఆన్లైన్లో చాటింగ్.. ఆపై మోసం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులతో ఉద్యోగావకాశాలు
పేరుపాలెం బీచ్‌లో యువకుడి గల్లంతు
పారిశుద్ధ్యంపై శ్రద్ధ తప్పనిసరి
గోపీనాథపట్నంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
ఆచారాలను ‘గంట‘ కలిపేశారు
గ్రాసిమ్ నుంచి ముడుపుల కోసమే..
కారు బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు
వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలి
కళారంగానికి చేయూతనిస్తాం
శ్రీవారి చెంత సేద తీరి
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
మట్టి మాఫియా ఆగడాలపై నిరసన
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
గాలిదుమారం.. అకాల వర్షం
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
‘100 కేసులు పెట్టినా భయపడను.. ఏ తప్పు జరిగినా నిలదీస్తూనే ఉంటా’
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
‘ముస్లింలు మీటింగ్‌కు టీడీపీ నేతల పర్మిషన్ కావాలా?’
గద్దర్ అవార్డ్స్.. 15 మంది జ్యూరీ కమిటీ సభ్యులు వీళ్లే
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
‘కూటమి విజయంలో బీజేపీదే కీలక పాత్ర.. టీడీపీ ఓవరాక్షన్ ఎక్కువైంది’
‘ వారికి వసూల్ చేయడం రాదనే.. సీఎంను మార్చడం లేదు’
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై కత్తితో దాడి
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
భారత బాక్సర్లకు ఆరు పతకాలు
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
డ్రోన్ సాయంతో జూదరుల గుర్తింపు
ట్రంప్ టారిఫ్‌ల టెన్షన్!
అంగరంగ వైభవంగా పిడకల సమరం
క్యాసంపల్లి పల్లె దవాఖానాకు ఎన్‌క్వాస్ అవార్డు
ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు
శిశువు మరణంపై పోలీసుల దర్యాప్తు
అక్రమ అరెస్టులకు భయపడకండి
లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు
1999లో ప్రైవేటీకరణ జపంలో మూసివేత
పిడుగుపాటుతో రెండు ఆవులు మృతి
హెచ్ఆర్డీఎస్ ఇండియాతో కాల్కలస్ గ్రూప్ జట్టు
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలి
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి
ప్రైవేటుతో పర్యాటక శోభ..
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్ర
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ
జిమ్ కెళ్తున్నారా.. జర భద్రం.. సొంత ప్రయోగాలొద్దు!
భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..
Champions Trophy 2025: టీమిండియా మేనేజర్ ఇంట విషాదం
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
రామోజీ లేరు.. విచారణా అక్కర్లేదు!
ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్ జగన్
Hyderabad: గుర్రపు డెక్క తొలగిస్తుండగా ప్రమాదం
రన్‌వేపై విమానం బోల్తా
డీజీపీని కోర్టుకు పిలుస్తాం: హైకోర్టు
చిలుకతో వర్మ హీరోయిన్ పోటీ.. అరుణాచలంలో బిగ్‌బాస్ బ్యూటీ
శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లోనే ఉంది కల్తీ
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
భార్యతో గొడవపడి.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భర్త
ఆటల్లో ఆణిముత్యం..ఐఏఎస్ ఆమె టార్గెట్..!
పట్టపగలే యువతికి లైంగిక వేధింపులు
సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు
‘నేనంటే పుతిన్‌కు భయం’
అసలు సమస్య ముంపే!
సంజయ్‌పై కక్ష సాధింపు చర్యలు.. రాజకీయ, వ్యక్తిగత ప్రతీకారమే!
బ్యాంకింగ్ కాల్స్‌కు ప్రత్యేక నంబర్ల సిరీస్: ఆర్బీఐ సూచన
ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బలగం బ్యూటీ బోల్డ్ లుక్.. మరింత హాట్‌గా పూనమ్ బజ్వా!
నదులు ఎండిపోతున్నాయ్!
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
‘చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట’
థియేటర్లలో పుష్పరాజ్ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి !
సినిమా

సొంతంగా ఖరీదైన ప్రైవేట్ జెట్.. అజయ్ దేవగణ్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది.ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. బాలీవుడ్లో మీరు తొలి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్‌లో అజయ్ దేవగణ్ ఐఆర్ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు.

అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు.

'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?
టైటిల్ : రెట్రో’పైనేనటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజూ జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: జ్యోతిక, కార్తేకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీదర్శకత్వం, కథ: కార్తీక్ సుబ్బరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణవిడుదల: మే1, 2025గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత ఏలాగైన తన అభిమానులను సంతోషపెట్టాలని ‘రెట్రో’పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి సూర్య తీసుకొచ్చాడు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 2 గంటలా 40 నిమిషాల రన్‌టైమ్ ఉంది. గతంలో దర్శకుడు సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల నిడివి కూడా ఇంతే ఉండటం గమనార్హం. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్ రెట్రోతో మెప్పించాడా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.కథేంటంటే..గ్యాంగ్‌స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. అయితే, ఒకరోజు వారు ఫారిన్ గ్యాంగ్‌తో కుదుర్చుకున్న ఢీల్ (గోల్డ్ ఫిష్) వల్ల సమస్యలు వస్తాయి. అప్పటి వరకు తిలకన్ చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసిన పారివేల్.. గోల్డ్‌ఫిష్ ఢీల్‌ను వదులుకోవాలని పెంచిన తండ్రికి ఎదరుతిరుగుతాడు. ఇదే సమయంలో తన ప్రియురాలు రుక్మిణి (పూజా హెగ్డే)ని వివాహం చేసుకోవడానికి పారివేల్ రెడీ అవుతుంటాడు. తనతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని వదులుకుని ఆమెతో సాధారణ జీవితాన్ని గడుపుతానని వాగ్దానం చేస్తాడు. అలాంటి సమయంలోనే గోల్డ్ ఫిష్ వివరాలు చెప్పాలని ఆ పెళ్లికి అడ్డుగా తిలకన్ నిలబడుతాడు. తన గ్యాంగ్‌తో ఆ వేడుకలో అల్లకల్లోలం సృష్టిస్తాడు. దీంతో పారివేల్ కన్నన్ మళ్లీ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఈ గొడవ కారణంగా ఐదేళ్లు జైలుకు వెళ్తాడు పారివేల్. గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్‌ను కోరతాడు. చివరికి ఆమె అండమాన్లకు దూరంగా ఒక ఐల్యాండ్‌లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి తప్పించుకున్న పారివేల్ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. దీంతో తనను పెంచిన తండ్రి తిలకన్ కూడా గోల్డ్‌ఫిష్ వివరాలు కోసం అదే ఐలాండ్‌కు చేరుకుంటారు. అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్‌తో రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్ సెట్ చేసుకుని తిలకన్ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్ వార్ మొదలౌతుంది. అక్కడి నుంచి గోల్డ్‌ఫిష్ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్‌ఫిష్ సీక్రెట్ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్‌కు ఆ ఐల్యాండ్‌తో ఉన్న గత సంబంధం ఏంటి..? అక్కడి గుడితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి..? పారివేల్ పుట్టక ముందే రాజ్‌వేల్ దొర (నాజర్)తో ఉన్న లింక్ ఏంటి..? ఫైనల్‌గా రుక్మిణిని పారివేల్ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సూర్య తొలిసారి కలిసి పనిచేయడమే అని చెప్పవచ్చు. అందుకే, రెట్రో సినిమా ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఊహించినట్లుగానే.. కార్తీక్ సుబ్బరాజ్, సూర్య బలాలను వెండితెరపై చూపించారు. యాక్షన్, రొమాన్స్ అంశాలను సమానంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు. చాలా సినిమాల్లో మాదిరే.. రెట్రో కథలో కూడా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్‌స్టర్ గురించి చెప్పారు. ఇందులో అతను ఎలా విజయం సాధిస్తాడు అనేది కాస్త ప్రత్యేకంగా చూపారు. సినిమా మొదటి భాగంలో తిలకన్, పారివేల్, రుక్మిణిల చుట్టూ తిరుగుతుంది. భారీ యాక్షన్ సీన్స్‌లకు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చి కథను చూపారు. అదంతా మనకు రొటిన్‌గానే అనిపించవచ్చు. సెకండ్ పార్ట్ అంతా ఒక ఐలాండ్‌లో జరుగుతుంది. అక్కడి నుంచి స్క్రీన్‌ప్లే గజిబిజిగా మారడం ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న గ్యాంగ్స్టర్స్ రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్‌తో పారివేల్ పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌లోకి స్టోరీ వెళుతుంది. ఇక్కడే సినిమా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అక్కడ ఐలాండ్‌లో జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు కొత్తగా ఉంటాయి. ఆ పోటీల పేరుతో అక్కడున్న గిరిజన జాతి జీవితాలతో ఆడుకుంటున్న ఆ ప్రాంత రాజును పారివేల్ ఎదుర్కొన్న తీరు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఐలాండ్‌లోని జడ ముని గుడి నేపథ్యంతో పాటు దానితో పారికి ఉన్న సంబంధం తెలిపిన పాయింట్ కాస్త భావోద్వేగభరితంగా కథను మారుస్తాయి.కథలో గ్రిప్పింగ్ లేకున్నా.. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సూర్య, పూజాల మధ్య సరైన లవ్ ట్రాక్ కనిపించదు. కానీ, వారిద్దరి మధ్య చాలా ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ ఉన్నట్లుగా మనకు దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ఐల్యాండ్‌కు పారివేల్‌కు ఉన్న రిలేషన్ ఏంటి అనేది వివరంగా చెప్పడంలో విఫలం అయ్యాడనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే రెట్రో సినిమాకు కాస్త మైనస్ అని చెప్పవచ్చు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూర్య, పూజా హెగ్డేలను చాలా కొత్తగా దర్శకుడు చూపించారు.ఎవరెలా చేశారంటే..సూర్య తన అన్ని చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్ అయినా, కామెడీ అయినా సూర్య చాలా అద్భుతంగా నటించాడు. పూజ హెగ్డేతో అతను కనిపించే సన్నివేశాలు పెద్దగా క్లిక్ కాకపోయిన కెమెరామెన్ పనితనంతో కాస్త గట్టెక్కించాడని చెప్పవచ్చు. రెట్రో డ్రెస్‌లో పూజా చాలా చక్కగా సెట్ అయిపోయింది. ఆపై గ్లామర్‌కు ఎలాంటి స్కోప్‌లేకుండా కేవలం యాక్టింగ్‌కు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడంతో తన కెరీర్లో ఇదొక బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ తిలకన్ పాత్రలో మరోసారి తన ప్రతిభను ప్రదర్శించగా, మైఖేల్ పాత్రను పోషించిన నటుడు కూడా అద్భుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అతిధి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.సంతోష్ నారాయణ్ ఇచ్చిన సంగీతం రెట్రోకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసే అద్భుతమైన BGMను ఆయన అందించాడు. కన్నిమ పాట ఇప్పటికే థియేటర్లలో పెద్ద సంచలనంగా మారింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన రెట్రో మంచి ప్రయత్నమే కానీ చాలా ట్రాక్‌లతో కూడిన గజిబిజి స్క్రీన్‌ప్లే వల్ల కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. సూర్య, పూజా హెగ్డే తమ అభిమానులను రెట్రోతో తప్పకుండా అలరిస్తారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం
క్రీడలు

IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్కే..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో సీఎస్కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్‌ల్లో ఓడింది.సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌ల కోసం సీఎస్కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్‌కు పిలిచినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ గుజరాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్‌ను మిడ్ సీజన్ ట్రయల్స్‌కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.ఉర్విల్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సాహిత్ గతేడాది సైప్రస్‌పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.26 ఏళ్ల ఉర్విల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. ఇతనికి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.ఉర్విల్‌ను సీఎస్కే మేనేజ్మెంట్ తదుపరి సీజన్ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్లో రిటైర్ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్‌ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.ఉర్విల్ ఈ సీజన్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్కేకు ఉర్విల్‌పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్ మాత్రే సీఎస్కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, సీఎస్కే నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

IPL 2025: వైభవ్ ఒక్క మ్యాచ్‌లో చేస్తే, సీఎస్కేకు సీజన్ మొత్తం పట్టింది..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) రాత్రి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం 14 ఏళ్ల రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. గత మ్యాచ్‌లో వైభవ్ గుజరాత్‌పై 35 బంతుల్లో శతక్కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ విధ్వంసకర ప్రదర్శన కారణంగా నేటి మ్యాచ్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వైభవ్.. ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్‌ను ఎలా ఎదుర్కోగలడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో అందరి కంటే ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సీఎస్కేను వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పోటీ పెడుతున్నారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆరు సిక్సర్లు బాదగా.. సీఎస్కే ఈ సీజన్ మొత్తంలో పవర్ ప్లేల్లో ఆరే సిక్సర్లు కొట్టింది.ఈ లెక్క చూస్తే ప్రస్తుత సీజన్లో సీఎస్కే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది. ఆ జట్టు టాపార్డర్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌ల కంటే నిదానంగా ఆడుతున్నారు. పోనీ వికెట్లైనా కాపాడుకున్నారా అంటే అదీ లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 50కి మించి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లు నమోదు చేసింది.తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జోష్‌లో ఉన్నట్లు కనిపించిన రచిన్ రవీంద్ర ఆ తర్వాత తేలిపోయాడు. దారుణమైన విషయమేమిటంటే, ఇతర ఆటగళ్లతో పోలిస్తే రచిన్ రవీంద్రనే కాస్త బెటర్. రచిన్ రెండు మూడు మ్యాచ్‌లకు ఒకసారైనా 20, 30 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు అదీ చేయలేక చేతులెత్తేశారు. నిన్న మొన్న వచ్చిన ఆయుశ్ మాత్రే కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ కర్రన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. ఈ సీజన్లో సీఎస్కే బ్యాటర్ల నుంచి ఇది తప్ప మంచి స్కోరే లేదు.

RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

IPL 2025: ధోనికి ఇలా జరగడం ఇదే తొలిసారి..!
ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్లో ఆ జట్టు ఖేల్ ఖతమైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఈ సీజన్లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సీఎస్కేకు ఈ మ్యాచ్‌లు అంత ముఖ్యం కాకపోయినా ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను నిర్ణయిస్తుంది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ (మే 3), కేకేఆర్ (మే 7), రాజస్థాన్ రాయల్స్ (మే 12), గుజరాత్ టైటాన్స్‌తో (మే 18) తలపడనుంది. పైన ఉన్న జట్లన్నీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండటంతో సీఎస్కే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ ఆరంభంలో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని సీఎస్కే పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా సీఎస్కే తలరాత ఏమీ మారలేదు. వరుస పరాజయాలతో సతమతమైంది. ఫ్యాన్స్ సైతం చాలా రోజుల కిందటే సీఎస్కేపై ఆశలు వదులుకున్నారు.ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ధోని ఓ అపప్రదను మూటగట్టుకున్నాడు. తొలిసారి వరుసగా రెండు ఐపీఎల్ ఫైనల్స్ మిస్ అయ్యాడు (కానున్నాడు). ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న ధోని ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరుసగా రెండు ఫైనల్స్ ఆడకుండా ఉండలేదు. ఓ సీజన్ మిస్ అయినా మరుసటి సీజన్లోనే ఫైనల్ ఆడాడు. మొత్తంగా ధోని తన ఐపీఎల్ కెరీర్లో 11 ఫైనల్స్ (10 సీఎస్కే తరఫున, ఒకటి రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున) ఆడాడు.ధోని ఆడిన ఐపీఎల్ ఫైనల్స్..2008 (రన్నరప్)2010 (ఛాంపియన్)2011 (ఛాంపియన్)2012 (రన్నరప్)2013 (రన్నరప్)2015 (రన్నరప్)2017 (రన్నరప్, పూణే తరఫున)2018 (ఛాంపియన్)2019 (రన్నరప్)2021 (ఛాంపియన్)2023 (ఛాంపియన్)ధోని ఆడని ఐపీఎల్ ఫైనల్స్2009201420162020202220242025
బిజినెస్

రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
గడిచిన నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. ప్రభుత్వం మే 1న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జీఎస్టీ రూపంలో రూ.2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతకుముందు నెలలో అంటే మార్చిలో రూ.1.96 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.కాగా గతేడాది ఇదే నెలలో అంటే 2024 ఏప్రిల్‌లో ప్రభుత్వం రూ.2.1 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలు చేసింది. వార్షిక వసూళ్ల వేగం 12.6 శాతంగా ఉండటం కూడా 17 నెలల్లో ఇదే గరిష్టం. ఆర్థిక వ్యవస్థకు వినియోగం తోడ్పడటంతో త్రైమాసిక వసూళ్లు 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ .5.75 లక్షల కోట్లకు చేరుకున్నాయి.దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ ఆదాయం 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి చేసుకున్న వస్తువుల ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరింది. ఏప్రిల్‌లో రీఫండ్ల జారీ 48.3 శాతం పెరిగి రూ.27,341 కోట్లకు చేరింది.ఇక అంతకుముందు నెలల్లో జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే ఫిబ్రవరిలో రూ.183,646 కోట్లు, జనవరిలో రూ.1.96 లక్షల కోట్లు, డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈ సంవత్సరానికి జీఎస్టీ ఆదాయంలో 11% పెరుగుదలను అంచనా వేసింది. సెంట్రల్ జీఎస్టీ, పరిహార సెస్‌తో సహా వసూళ్లను రూ .11.78 లక్షల కోట్లుగా అంచనా వేసింది.

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ .14.50 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన కొత్త ధర మే 1 నుండి అమలులోకి వస్తుంది. మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.రేట్ల తగ్గింపు తరువాత, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ .1,747.50 వద్ద ఉంది. ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో సవరించిన ధరలు ముంబైలో రూ .1,699, కోల్‌కతాలో రూ .1,851.50, చెన్నైలో రూ .1,906, హైదరాబాద్‌లో 1,969 వద్ద ఉన్నాయి. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు వంటి కారకాల వల్ల ఎల్పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్, వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున సర్దుబాటు చేస్తుంటారు. ఈ మార్పు వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై రూ.50 పెరిగింది. రోజువారీ కార్యకలాపాల కోసం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు ఈ తగ్గింపు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

అ(త)ప్పు చేయకూడదంటే....
కష్టాలు చెప్పి చెప్పి రావు... కష్టాలు చుట్టాల్లా వచ్చి పలకరిస్తాయి...పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదురా నాయనా...ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో...మనం తరచుగా వినే మాటలే ఇవి.ఒక్కొక్కరి కష్టాలు ఒక్కో రకంగా ఉండొచ్చు.. ఇతరత్రా కష్టాలని కాసేపు పక్కన పెట్టేసి... ఆర్ధిక కష్టాల గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం... మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉందనేది వాస్తవం. మరి ఈ డబ్బుని ఎంత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అంత సురక్షితంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలంటే ప్రతి వ్యక్తికీ సరైన ఆర్ధిక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే జీవితం అధోగతి పాలవుతుందనేది నిర్వివాదాంశం. కాబట్టి మీరు సంపాదన మొదలు పెట్టిన తొలినాళ్లలోనే పక్కా పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. ఇందుకు ప్లాన్-1, ప్లాన్-2, ప్లాన్-3, ప్లాన్-4 అనే అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి.ప్లాన్-1 చేతిలో ఎప్పుడూ తగినంత నగదు ఉంచుకోవాలి. ఉదాహరణకు: మీకు నెలకు అన్ని ఖర్చులూ పోగా సగటున రూ. 2000 అవసరమవుతోంది అనుకోండి. మీ చేతిలో దానికి అయిదు రెట్లు... అంటే రూ.10,000 ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అది నగదు రూపంలోనైనా సరే.. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోనైనా సరే. ఆరోగ్యపరంగా కావచ్చు... ఏదైనా ఫంక్షన్స్ రావొచ్చు.. అప్పటికప్పుడు అత్యాసర పని మీద ఏదైనా ఊరు వెళ్లాల్సి రావొచ్చు.. కారణం ఏదైతేనేం... చేతిలో కొంత నగదు అట్టేపెట్టుకోవడం ప్లాన్-1 లో ప్రథమ లక్షణం. ఇలా చేయడం వల్ల అప్పుకు ఎవరి దగ్గరికీ పరిగెత్తాల్సిన పరిస్థితి తలెత్తదు.ప్లాన్-2 బ్యాంకులో డిపాజిట్లు తప్పనిసరి. మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా పొదుపు చేసే రికరింగ్ డిపాజిట్ అయినా.. కొంచెం పెద్ద మొత్తంలో దాచుకున్న ఫిక్సడ్ డిపాజిట్ అయినా... మీకు సమయానికి ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో ఎవరి దగ్గరా చెయ్యి చాచనక్కర్లేకుండా .. ఈ డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని అవసరాన్ని నెరవేర్చుకోవచ్చు. మరో విషయం: ఈ ఆర్డీ, ఎఫ్డీ లను మధ్యలోనే విత్ డ్రా చేయడం వల్ల మీరు ఆశించిన వడ్డీ రాదు, కొన్ని సందర్భాల్లో మీరు పెనాల్టీ కూడా కట్టాల్సి రావచ్చు. అయినప్పటికీ... మీరు అప్పు చేయాల్సిన అవసరం ఏర్పడదు. అదే సమయంలో ఒకర్ని సాయం చేయమని అడిగే పరిస్థితి తలెత్తదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆత్మాభిమానం దెబ్బ తినదు. ఒకవేళ మీరు చెప్పిన టైం కి బాకీ తీర్చలేకపోతే అవతలి వ్యక్తులు అనే మాటలు పడాల్సిన అవసరం ఉండదు. అప్పిచ్చినవాడు ఎప్పుడు మీద పడతాడో అని నిత్యం నలిగిపోతూ బతకక్కర్లేదు. కాబట్టి... ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్లాన్-2 అనేది తప్పనిసరి.ప్లాన్-3 లిక్విడ్ పెట్టుబడులుప్రతి వ్యక్తి ఆర్ధిక జీవితంలోనూ ఇదొక అత్యంత కీలకాంశం. ఈ మూడో మార్గంలో మిమ్మల్ని ఆదుకునేది మీరు చేసే చర పెట్టుబడులే. అవును.. ఇది నిజమే.. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బంగారాల్లో చేసిన పెట్టుబడుల్ని మూడో అంచె మిత్రులుగా చెప్పుకోవచ్చు. ఈ మూడింటిలోనూ పెట్టుబడి పెట్టడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి పోకండి. కేవలం పెట్టుబడులపైనే దృష్టి పెట్టండి.షేర్ల విషయానికొస్తే... తప్పనిసరిగా ఫండమెంటల్స్ బాగుండే ప్రధాన కంపెనీలనే ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల... పెద్ద కంపెనీల షేర్లు మార్కెట్ ఒడుదొడుకుల్లో క్షీణించినప్పటికీ... మళ్ళీ సత్వరమే కోలుకునే సత్తా వీటికి ఉంటుంది. కాబట్టి భయపడిపోయి మార్కెట్ కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా దూసుకెళ్ళేవి కూడా ఈ షేర్లే. మీరు ఎంచుకునే షేర్లను బట్టే మీకొచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో కనీసం మూడేళ్లకు తగ్గకుండా.. దీర్ఘకాలిక దృక్పథంతో చేసే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు కూడా అవసరానికి ఆదుకునే లక్షణం ఉంది. (వివరాలు మరో ఆర్టికల్ లో చర్చిద్దాం).ఇక బంగారంలో పెట్టుబడి మూడోది. ఈవేళ బంగారం ధర లక్షకు చేరుకుంది. మీకు తెలియకుండానే అప్పుడో కొంత.. ఇప్పుడో కొంత చొప్పున బంగారం కొంటూ వచ్చినా.. లేదంటే.. గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చినా.. మీకు మంచి ప్రయోజనమే ఉంటుంది. తాకట్టు పెట్టుకుంటే దాని విలువలో దాదాపు 80% అప్పు దొరుకుతుంది. అది కూడా తక్కువ వడ్డీకే. మళ్ళీ మీరు శక్తియుక్తులు కూడదీసుకున్నాక దాన్ని విడిపించుకోవచ్చు.పై మూడు పెట్టుబడుల్లోనూ ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే... మన అవసరాలకు తక్షణమే పెద్ద మొత్తంలో నగదు కావాల్సి వచ్చినపుడు ఈ మూడూ ఆదుకుంటాయి. అంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, బంగారాల్లో పెట్టుబడులు సమయానికి అక్కరకొస్తాయన్న మాట. ఇవన్నీ తక్షణ లిక్విడిటీ ఉన్న పెట్టుబడులు.ప్లాన్-4 స్థిరాస్తులపై పెట్టుబడిభూములు, ఆస్తులు, భవనాలపై పెట్టుబడులను ఈ కేటగిరీలోకి తీసుకోవచ్చు. ఇవి ఖరీదైనవే కావచ్చు..వీటిని సమకూర్చుకోవడం అందరివల్లా కాకపోవచ్చు. కానీ ప్రతి మనిషీ తన జీవితంలో ఒక సొంత ఇల్లు సమకూర్చుకోవాలి అనుకోవడం సహజమే కదా..మరికొందరు రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతో కొంత భూమి కొనుక్కుంటారు. అలా సమకూర్చుకున్న సొమ్మే ఆపదలో ఆదుకుంటుంది (ఇల్లు అమ్ముకోమని కాదు. ఇదొక మార్గం కూడా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం).ముగింపు అనుకోకుండా తలెత్తే ఖర్చులను తట్టుకోవడానికి ప్రతి మనిషి జీవితానికీ నాలుగు దశల ఆర్ధిక ప్రణాళికలు ఉండాలి. మొదటిది చిన్న చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడితే..రెండోది ఇంకొంచెం పెద్ద సమస్యలను దీటుగా గట్టెక్కడానికి దోహదపడుతుంది. మూడోది ఎలాంటి పరిస్థితులనుంచి అయినా బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది.పీకల మీదకి వచ్చి... విధిలేని పరిస్థితుల్లో తోడ్పడేది నాలుగోది. ఈ నాలుగు పాటించిన వాళ్ళ జీవితం నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసిన వారి జీవితం నిత్యం యాతనతో సతమతమవుతూనే ఉంటుంది. నిర్ణయం మీచేతుల్లోనే ఉంది.-బెహరా శ్రీనివాస రావు, ఆర్ధిక నిపుణులు

ఒక అరటి పండు ధర రూ.565!
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ సర్వీసులు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈమేరకు వాటి ధరలను హైలైట్ చేస్తూ ప్రయాణికులు సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేస్తున్నారు.ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్క అరటిపండు ధర రూపాయిల్లో రూ.565, ఒక బీరు రూ.1,697, ఫుల్ మీల్స్ భోజనంకు రూ.2,000 తీసుకుంటున్నారు. ఈ రేట్లు గమనించిన ప్రయాణికులు ఇస్తాంబుల్ విమానాశ్రయాన్ని ‘ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎయిర్పోర్ట్’గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా సరసమైన భోజనానికి ప్రసిద్ధి చెందిన మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్.. వంటి ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్‌లో కూడా ప్రీమియం ధరలు ఉన్నాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజూ 2,20,000 మందికిపైగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటిగా ఉంది. అక్కడ ఆకట్టుకునే మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నప్పటికీ ఆహార ధరలు చాలా మందికి మింగుడుపడడం లేదు. భోజన ధరలు సాపేక్షంగా సహేతుకంగా ఉన్న ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోలిస్తే ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ

ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
ఏ శివాలయంలోనైనా వైష్ణవ పూజారులను చూడగలమా? ఏ విష్ణ్వాలయంలోనైనా జైన మతాధికారులు కనిపిస్తారా... అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ పురాతన శైవక్షేత్రానికి మాత్రం ఈ ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ధర్మస్థల ఒకటి. అందుకే భక్తులందరూ కర్ణాటకలోని ధర్మస్థలను ఒక్కసారైనా సందర్శించి, ధర్మదేవతలను దర్శించుకుని, మంజునాథుని మనసారా చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఏదైనా పనిమీద బెంగళూరు వచ్చిన వారు ధర్మస్థలను సందర్శించడాన్ని విధిగా పెట్టుకుంటారు. స్థలపురాణం... పూర్వం కుడుమ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జైన సైనికాధికారి బిర్మన్న, ఆయన భార్య అంబుబల్లాతి నివసించే వారు. నిరాడంబరులుగా, నిజాయితీపరులుగా, అతిథి సేవ, సాటివారికి సాయం చేసే ఆదర్శ్ర΄ాయులైన దంపతులుగా వారిని అందరూ గౌరవించేవారు. ధర్మపరాయణులుగా, ఆపదలలో ఉన్న వారిని ఆదుకునే వారిగా వారికి ఎంతో మంచి పేరుండేది. వారి కీర్తి దేవతల వరకు వెళ్లడంతో నిజంగా వారెంతటి ధర్మనిష్ఠాపరులో తెలుసుకుని, వారు గనక సరైన వారేనని తేలితే, వారి ద్వారా ధర్మపరిరక్షణ, ధర్మప్రచారం చేయిద్దామని ఇద్దరు ధర్మదేవతలు ఒక రాత్రిపూట వాళ్ల ఇంటికి నిరుపేద వృద్ధదంపతుల రపంలో వచ్చారు. హెగ్గడే దంపతులు వారిని సాదరంగా ఆహ్వానిం, అతిథి సత్కారాలు చేశారు. ధర్మదేవతలు వారితో తమకు ఆ ఇల్లు ఎంతో నచ్చిందని, ఇల్లు ఖాళీ చేసి తమకు ఇవ్వమని అడిగారు. వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముక్కూముఖం తెలియని వారి కోసం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వారి ఔదార్యానికి సంతోషింన ధర్మదేవతలు నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు.హెగ్గడే దంపతులు ఎంతో సంతోషంతో వారికి ఆ ఇంటిని అప్పగించి, వారికి పూజలు చేశారు. ఆ ఇంటిని అందర నెలియాడిబీడు అని పిలవసాగారు. కాలక్రమేణా ఆ ఇల్లు కాస్తా ఆలయంగా రపు దిద్దుకుంది. ఆ ధర్మదేవతలకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారందర అక్కడే ఉండి, ధర్మపరిరక్షణ చేయసాగారు. కొంతకాలానికి వారందరూ విగ్రహాల రపంలో ఆ ఇంటిలోనే కొలువు తీరారు. అక్కడి ఆలయ పూజారికి ఒకరోజున పూనకం వచ్చి, ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్టిం, పూజించవలసిందిగా గ్రామప్రజలను ఆదేశించాడు. దాంతో హెగ్గడే దంపతుల వంశీకుడైన అణ్ణప్ప హెగ్గడే అనే అతను మంగుళూరు పక్కనున్న కద్రి నుంచి శివలింగాన్ని తీసుకు వచ్చి ధర్మదేవతల సన్నిధి పక్కనే లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగమే మంజునాథుడుగా పూజలందుకుంటున్నాడు. అనంతరం ఓ వైష్ణవుడు తన ఆస్తి΄ాస్తులన్నింటినీ అమ్ముకుని ఆలయానికి అంగరంగవైభవంగా కుంభాభిషేకం జరిపించాడు. అప్పటినుంచి ఈ పుణ్యస్థలాన్ని అందరూ ధర్మస్థల అని పిలవసాగారు.ఆలయ వర్ణన...చెక్కస్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం అందమైన కళాకృతులతో శోభిల్లుతుంటుంది. ఆలయాన్ని చేరుకోగానే విశాలమైన ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక సన్నిధిలో మంజునాథుడు, మరో సన్నిధిలో నరసింహస్వామి దర్శనమిస్తారు. మరో సన్నిధిలో ΄ార్వతీ దేవి, ధర్మదేవతలు కొలువై ఉంటారు. ధర్మస్థల ప్రాంత్రానికి వెళ్లిన భక్తులు ముందుగా ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో స్నానమాచరించి, మంజునాథుని, అమ్మవారిని, నలుగురు ధర్మదేవతలను, గణపతిని, అణ్ణప్పదేవుని సందర్శించుకుని, ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. అనంతరం ఆలయానికి బయట గల పురాతన రథాలను, వాహన ప్రదర్శనశాలను పుష్పవాటికను, వసంత మహల్‌ను సందర్శించుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో అన్ని కులాలు, మతాలవారూ తృప్తిగా భోజనం చేయవచ్చు. అవసరం అయితే ఆశ్రయం ΄÷ందవచ్చు.గోమఠేశ్వరుడు కొలువుదీరిన శ్రావణ బెళగొళ ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఎలా చేరాలంటే..?బెంగళూరు నుంచి ధర్మస్థలకు చేరుకోవడం సులువు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి ధర్మస్థలకు నేరుగా బస్సులున్నాయి. మంగుళూరు వరకు రైలులో వెళితే అక్కడినుంచి బస్సులో లేదా ప్రైవేటు వాహనాలలో ధర్మస్థలకు వెళ్లవచ్చు. మంగుళూరు ఎయిర్‌పోర్ట్‌నుంచి కూడా నేరుగా ధర్మస్థలకు బస్సులున్నాయి. ఇదీ చదవండి: అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లుఅన్ని విశ్వాసాలకూ, మతాలకూ చెందిన భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి దేవతలను దర్శించుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.ఈ ఆలయంలో నిత్యం పదివేలమందికి అన్నదానం, ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుపట్టని పలు వ్యాధులకు ఔషధ దానాలతోబాటు వేలూ, లక్షలూ వెచ్చించి చదువుకొనలేని పేద విద్యార్థులకు సలక్షణమైన, నాణ్యమైన విద్యాదానమూ జరుగుతుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అభాగ్యులు తలదాచుకునేందుకు వీలుగా ఇక్కడ ఆశ్రయమూ లభిస్తుంది. అదే బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గల ధర్మస్థల.– డి.వి.ఆర్.

పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?)

శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
రోజూ ఉదయం నుంచి వంటింట్లో చెమటలు కక్కుతూ వంటకాలతో కుస్తీ పడుతుంటుంది అమ్మ. ‘నీరసంగా ఉంటోంది.. ఏ పనీ చేయాలనిపించడం లేదు’ అని అంటూనే లేని ఓపికను తెచ్చుకొని పనులు చేస్తూనే ఉంటుంది. ‘కాళ్ల నొప్పులు.. కదలనివ్వడం లేదు’ అంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతుంటుంది బామ్మ. కాలేజీ నుంచి వస్తూనే ‘బ్యాగ్ కూడా మోయలేను.. అలసటగా ఉంది’ అంటూ సోఫాలో కూలబడిపోతుంది కూతురు. రోజూ మూడుపూటలా తింటూనే ఉన్నాం, అయినా ఎందుకిలా?! ఏ ఆరోగ్య సమస్యనో అని వైద్యులను కలిస్తే పోషకాహారం తీసుకోండి’ అని చెబుతుంటారు. మన శరీరానికి ఏయే పోషకాలు అవసరం, సీజన్‌కి తగినట్టు మన ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి. సింపుల్‌గా హెల్తీ వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చు... ఈ వివరాలతో వరుస కథనాలుమహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి సమతులాహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పెరిగాయి. కానీ, మన రొటీన్ ఫుడ్ మాత్రం అలాగే ఉంటోంది. హార్మోన్ల సమతుల్యతకు, శక్తికి తినే ఆహారం చాలా ముఖ్యమైనది. సాధారణంగా మహిళలు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి ఐరన్, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు. శక్తికి ఇనుము... రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనం అవుతారు. త్వరగా అలసిపోతారు. రక్తస్రావం అధికం అవుతుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, తోటకూర. గోంగూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరంలో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి రోజువారీగా అవసరమైన ఐరన్ మోతాదు వారి వయసు, జెండర్‌పై ఆధారపడి ఉంటుంది. గర్భిణులు, బాలికలకు రోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. దీంతో పాటు విటమిన్ – సి ఉండే నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు, రసాలు తీసుకోవడం వల్ల ఒంట్లో ఇనుము శోషణ పెరుగుతుంది.పాల ఉత్పత్తులతో కాల్షియం... ఎముకల బలానికి,,, ప్రత్యేకంగా మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం అధికం. అందుకు పాల ఉత్పత్తులు, బాదం, శనగలు, కాలీఫ్లవర్ .. వంటివి తినాలి. ∙గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ. ఆకుకూరలు, మాంసం, దాల్చిన చెక్క.. వంటి వాటి నుంచి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఒమేగా–3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగ పడతాయి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపల నుంచి ఈ ప్యాటీ యాసిడ్స్ లభిస్తాయి శరీర బలానికి, కండరాల పెంపుకు ప్రోటీన్లు చాలా అవసరం. మినపపప్పు, చికెన్, గుడ్లు, నట్స్... నుంచి ప్రోటీన్లు లభిస్తాయి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం. గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది.వయసుల వారీగా డైట్ చక్రటీనేజ్, యవ్వనం, గర్భధారణ, పిల్లలకు పాలు ఇవ్వడం, మోనోపాజ్, వయసు పైబడటం.. వంటి దశల ఆధారంగా పోషక అవసరాలు మారుతుంటాయి. కానీ, మన ఇళ్లలో సాధారణంగా అందరికీ ఒకేతరహా వంటను వండుతుంటాం. దీనివల్ల వయసుల వారీగా సరైన పోషకాలు శరీరానికి అందక, శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చురుకుదనం తగ్గుతుంది. ఫలితం చేసే పనులపై ప్రభావం చూపుతుంది. అందుకని పోషకాహార చక్రం ఎవరికి వారు, వయసుల వారీగా ఆరోగ్యదాయకంగా మార్చుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. బాల్యం నుంచియవ్వనం (8–18 ఏళ్లు) వరకు శరీరం వృద్ధి చెందడానికి, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల బలానికి ... పాల ఉత్పత్తులు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, మటన్, చికెన్, బచ్చలి, బ్రొకోలి, బీట్రూట్.. మొదలైన ఐరన్ నిచ్చే పదార్థాలు ఈ వయసుకు కీలకం. బ్రేక్‌ఫాస్ట్: ఉప్మా/΄పొంగల్/ ఇడ్లీ.. + ఒక గుడ్డు + గ్లాస్పాలుమధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్/ రోటీ (2)+ పప్పు, ఆకుకూర, బీన్స్, పెరుగుసాయంత్రం స్నాక్స్: బాదం/జీడిపప్పు/ఇతర డ్రై ఫ్రూట్స్‌తో చేసిన స్నాక్స్ (చిన్న మోతాదులో)+ అరటి పండురాత్రి భోజనం: రోటీ (2) లేదా మినప పిండితో చేసిన అట్టు +ఏదైనా కూరగాయ + నిమ్మరసం కలిపిన వెజ్ సలాడ్యువతులకు (19–30 ఏళ్లు)రుతుక్రమం చురుకుగా ఉండటం, సంతానోత్పత్తి ప్లానింగ్‌కి సరైన సమయం. ఈ దశలో... ఐరన్ – ఫోలేట్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు, అరటి మొదలైనవి తినాలి. ఒమేగా–3 యాసిడ్స్ ఉండే ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, వాల్‌నట్స్‌ను కూడా చేర్చుకోవాలి.. పీచుపదార్థాలు ఉండే గోధుమ, కూరగాయలు, జామ వంటి పండ్లు తినాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి. జింక్ సమృద్ధిగా లభించే చిక్కుళ్లు లాంటివి.. ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.గర్భధారణ సమయంలో...పిండం అభివృద్ధికి, తల్లి శక్తికి తీసుకోవాల్సినవి... డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ + ఆకుకూరలు, నువ్వులు, దాల్చిన చెక్క, ప్రోటీన్ల కోసం గుడ్లు, పప్పులు, చికెన్, కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, ఫైబర్‌కి పండ్లు, బ్రౌన్ రైస్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కి చేపలు, ఫ్లాక్స్ సీడ్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.బ్రేక్‌ఫాస్ట్: గోధుమ రవ్వ/ ఓట్స్ ఉ΄్మా+ అరటి పండు + గ్లాసుడు పాలులంచ్: బ్రౌన్ రైస్ /రోటీ (2) / మెంతికూర పప్పు/ పెసరపప్పు+ బెండకాయ కూర, పెరుగు + కారట్/కీరా సలాడ్సాయంత్రం స్నాక్స్: బాదం/వాల్నట్ (4–5) +అరటిపండు / సపోటాడిన్నర్: రొట్టెలు (2) / మినప దోస, బీన్స్ / సొరకాయ కూర + గ్లాస్ మజ్జిగ.పాలిచ్చేతల్లులుతగినంత శక్తిని తిరిగి పొందడానికి, పాల వృద్ధికి తీసుకోవాల్సినవి.. ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పండ్లు, లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ తల్లులకు ప్రోటీన్ అందిస్తాయి. పాల ఉత్పత్తులు, నువ్వులు, ఆహారం జీర్ణం అవడానికి పల్చని మజ్జిగ మొదలైనవి తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్: పెసరట్లు, అల్లం పచ్చడి+గ్లాసుడు పాలు/రాగి జావలంచ్: బ్రౌన్ రైస్+ మటన్/ చికెన్‌కర్రీ, మెంతికూర పప్పు, పెరుగు, గోంగూర పచ్చడి. సాయంత్రం స్నాక్స్: జీరా రసం + బాదం/మెంతి లడ్డు, ఏదైనా ఒక పండు. డిన్నర్: రోటీ (2)/మినప రొట్టె, పల్లీలు, బచ్చలి కూర రాత్రి పడుకునే ముందు (ఒంటిగంట లోపల) గ్లాస్ నీళ్లు లేదా చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చనిపాలు. బాగా ఆకలిగా అనిపిస్తే అర టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు. మెనోపాజ్ దశ 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్లాన్ చేసుకోదగిన పోషకాహారంలో హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలం, కోలెస్ట్రాల్ నియంత్రణ పై దృష్టి పెట్టాలి. కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, సోయా, టోఫు వంటివి తీసుకోవాలి. చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, పీచుపదార్థాలు ఉండే కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బెర్రీస్, నాటు, తాటి బెల్లం, గ్రీన్ టీలను చేర్చుకొని చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి... బ్రేక్‌ఫాస్ట్: (ఉదయం 8:00 – 9:00): ఓట్స్ + పాలు + కొద్దిగా వాల్నట్ లేదా బాదం (లేదా) రాగి దోస + పెసరపప్పు చట్నీ, ఒక అరటి పండు + గ్లాస్ నీరు. మధ్యాహ్న భోజనం (లంచ్ – 1:00): బ్రౌన్ రైస్ లేదా గోధుమ/జొన్న/సజ్జ రొట్టెలు, ఆకుకూరల పప్పు (గోంగూర, తోటకూర వంటివి), దుంపలు కాకుండా దోండకాయ/బీన్స్/బెండకాయ, సలాడ్ (కీరా, గాజర్), పెరుగు. సాయంత్రం స్నాక్స్ (5:30 – 6:00): గ్రీన్ టీ లేదా తులసి టీ (షుగర్ లేకుండా) నట్స్ (బాదం, నువ్వులు లేదా ఫ్లాక్స్సీడ్స్) (లేదా) ఆపిల్ / పియర్ / సపోటా రాత్రి భోజనం (డిన్నర్ – 7:30 – 8:00): గోధుమ రొట్టె (1–2). వెజిటబుల్ సూప్ లేదా తేలికగా జీర్ణం అయ్యే కూర (బెండకాయ, సొరకాయ వంటివి), మజ్జిగ (ఉప్పు తక్కువతో) తీసుకోవాలి.సమతుల్యత అవసరంఓవర్ ఈటింగ్/ తక్కువ తినడం రెండూ సమస్యలు తెచ్చిపెట్టేవే. వ్యక్తి శరీర బరువు, శ్రమను బట్టి డైట్ ΄్లాన్ చేసుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ప్రతి వ్యక్తికి వారి శరీర బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహారణ: 50 ఏళ్ల మహిళ డైట్ చార్ట్. ∙సమతుల్యత, ఎముకల ఆరోగ్యం, శక్తి ఉండేటట్లు డైట్ ప్లాన్ చేయాలి. ప్రత్యేక సూచనలు: రోజూ కనీసం 7,000 – 8,000 అడుగులు నడవాలి / యోగా / లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఉప్పు, స్వీట్స్ తక్కువగా వాడాలి. మెనోపాజ్ దశ కాబట్టి కాల్షియం, విటమిన్–ఇ విషయంలోప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తప్పనిసరి. 15 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి నేరుగా తాకేలా చూసుకోవాలి. – డా.బి. జానకి, పోషకాహార నిపుణులు (చదవండి: 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..)

May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
ఫొటోలు


జూ పార్క్‌లో పర్యాటకుల సందడి.. వన్యప్రాణులను కెమెరాల్లో బంధిస్తూ! (ఫోటోలు)


వేవ్స్ సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నాగచైతన్య- శోభిత దూళిపాల (ఫోటోలు)


రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)


రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)


అక్షయ తృతీయ: మీకంతా శుభాలే.. నటి (ఫొటోలు)


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


సింహాచలం దుర్ఘటన.. ఎటు చూసినా ఆర్తనాదాలే
అంతర్జాతీయం

పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది.

లిబరల్ పార్టీ విజయం
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

చైనా రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.#BREAKING 🚨First images from the restaurant fire 🔥22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయం

పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్ నుంచి భారత్ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్ గగనం తలంపై పాక్ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్ రిజిస్టర్డ్ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. మరోవైపు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది.

భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్–పాక్ మధ్య 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
సాక్షి, నేషనల్ డెస్క్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధాన్ని తలపిస్తున్న నేపథ్యంలో వాటి సైనిక పాటవం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. సైనిక బలాబలాల విషయంలో భారత్ ముందు పాక్ ఏ మాత్రమూ తూగే పరిస్థితి లేదు. పైగా ఆర్థికంగా దాదాపుగా దివాలా తీసిన నేపథ్యంలో యుద్ధ భారాన్ని తట్టుకునే పరిస్థితుల్లో అసలే లేదు. కాకపోతే భారత్ నిర్ణాయక రీతిలో దాడికి దిగితే పరువు ప్రతిష్టల కోసమైనా పాక్ ఏదో రకంగా ప్రతిచర్యలకు దిగక తప్పకపోవచ్చు! ఈ నేపథ్యంలో ఇరుదేశాల సాయుధ పాటవాన్ని ఓసారి చూస్తే..

టిక్.. టిక్... టిక్
న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మోదీ రష్యా పర్యటన రద్దు మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్ పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మన గగనతలం మూత పాక్ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.సూపర్ కేబినెట్ భేటీయే కీలకం!ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు. ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం. ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు


కులగణనపై కేంద్రం నిర్ణయానికి YSRCP సంపూర్ణ మద్దతు


కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వైఎస్ జగన్


మంచిది కాదు అని చెప్పా.. బలవంతంగా నాతో గోడ కట్టించారు.. కాంట్రాక్టర్ సంచలన నిజాలు..


హిట్ 3 మూవీ రివ్యూ


భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్..


జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్న పిటిషనర్ తీరుపై సుప్రీం ఆగ్రహం


Watch Live: మీ తెగువకు హ్యాట్సాఫ్.. మీ అందరికీ మాటిస్తున్నా


విషాదం నింపిన.. సింహాచల దైవదర్శనం


సింహాచలం ఘటన చూస్తుంటే అమరావతి ఆగమైనట్టే


ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది: బొత్స సత్యనారాయణ