Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Andhra Pradesh Election Results
అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్‌.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్‌సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్‌సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ​్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్‌.టీ.ఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్‌సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్‌సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్‌స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్‌సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

CM YS Jagan Mohan Reddy Landed In London
లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. శనివారం అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్‌ రాష్ట్రానికి వస్తారు.

T20 WC 2024 Majority Of India Bound Players To Leave For New York On This Date
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. పదిహేను రోజుల్లోపే అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ఈ ఈవెంట్‌కు తెరలేవనుంది.క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌-2024కు మే 26న శుభం కార్డు పడనుండగా.. జూన్‌ 1 నుంచి ఈ టోర్నమెంట్‌ రూపంలో మరోసారి పొట్టి క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా టీమిండియా తమ లీగ్‌ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది.ఇక మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో ఏకైక వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న రోహిత్‌ సేన.. జూన్‌ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లలో మెజారిటీ మంది మే 25న అమెరికాకు ప్రయాణం కానున్నట్లు సమాచారం.తొలి దఫా బ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రిషభ్‌ పంత్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ తదితరులతో పాటు సహాయక సిబ్బంది కూడా న్యూయార్క్‌కు బయల్దేరతారని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.నిజానికి మే 21నే వీరంతా అమెరికాకు పయనం కావాల్సి ఉందని అయితే, ఒకే ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ ఉంది కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన వాళ్లలో సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, విరాట్‌ కోహ్లి తదితరులు‌ ఐపీఎల్‌-2024 ఫైనల్‌ పూర్తైన మరుసటి రోజు అంటే మే 27న భారత్‌ను వీడనున్నారు.టీ20 ప్రపంచకప్‌-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్..

Priyanka Gandhi on why she is not contesting Lok Sabha polls
రాయ్‌బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్‌ శర్మ బరిలో నిలిచారు. లోక్‌సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్‌ జరగనుంది.కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్‌సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్‌ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్‌, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్ల‌మెంట్‌ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్‌ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్‌ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్‌బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్‌కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్‌లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు.

Hyderabad Residential Property Market Surges Over 26000 Homes Registered
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ

రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి ఊపందుకుంటోంది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో భూములు మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం 2024 మొదటి నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది.2024 ఏప్రిల్ వరకు జరిగిన 26,027 ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువ సుమారు రూ. 16,190 కోట్లు. 2023 మొదటి నాలుగు నెలలతో పోలిస్తే.. 2024 మొదటి నాలుగు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్‌ల సంఖ్య 15 శాతం ఎక్కువ. విలువ పరంగా 40 శాతం ఎక్కువని తెలుస్తోంది.2024లో ఎక్కువగా ఖరీదైన గృహాలకు రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.1 కోటి.. అంత కంటే ఎక్కువ ఖరీదైన గృహాలు ఉన్నాయి. ఖరీదైన గృహాల రిజిస్రేషన్స్ 2023 కంటే 2024లో 92 శాతం ఎక్కువ.రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్యలో ఉన్న గృహాల రిజిస్ట్రేషన్స్ 2023 కంటే 47 శాతం ఎక్కువని గణాంకాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద అన్ని రకాల కేటగిరీల గృహాల రిజిస్ట్రేషన్, విలువ 2023 కంటే ఎక్కువగానే నమోదయ్యాయి.2024 ఏప్రిల్ నెలలో మొత్తం రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు 6,578 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య 2023 కంటే 46 శాతం పెరిగింది. ఈ ప్రాపర్టీల విలువ రూ.4,260 కోట్లగా నమోదైంది. ఇది కూడా అంతకు ముందు ఏడాది కంటే 86 శాతం పెరుగుదలను చూపుతోంది.హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ హైద‌రాబాద్‌లో మాత్రమే కాకూండా మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా ఉంది. ఇవన్నీ ప్రైమరీ, సెకండరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్ చేస్తుంది.

Renu Desai Comments On Pawan Kalyan Fans
వవన్‌ కల్యాణ్‌ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్‌

పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్‌ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్‌ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్‌ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్‌కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్‌కు పాజిటివ్‌గా పోస్ట్‌ పెడితే ఆ క్రెడిట్‌ అంతా పవన్‌కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్‌ ఒక పోస్ట్‌ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్‌ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్‌ అభిమాని ఇలా కామెంట్‌ చేశాడు. పవన్ కల్యాణ్‌ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్‌ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్‌తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)

Kharge Demanded Action On Prime Minister Modi
ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్‌

ముంబై: రామమందిరంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌(ఈసీ)ని కాంగ్రెస్‌ నేషనల్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ముంబైలో శనివారం(మే 18) ఖర్గే మీడియాతో మాట్లాడారు.‘ప్రధాని మోదీ రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను రెచ్చగొడుతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్‌లు ఎక్కిస్తారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు మేం బుల్డోజర్ పదాన్ని ఎక్కడా వాడలేదు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారిపై ఎన్నికల కమిషన్‌(ఈసీ) చర్యలు తీసుకోవాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటిని కాపాడతాం. మేం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం’ అని ఖర్గే తెలిపారు.

Vijayashanthi In News Over Tweet Against Kishan Reddy To Support BRS
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్‌లో కొనసాగుతారా.. లేక?

సినీ హీరోయిన్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్‌లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్‌రెడ్డి కామెంట్స్‌ మీద ట్వీట్‌ చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్‌గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

AP Elections 2024: May 18th Political Updates In Telugu
May 18th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 18th AP Elections 2024 News Political Updates 04.11 PM, May 18th, 2024అమరావతిపోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయిసాక్షితో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్క్లూస్ టీమ్స్‌తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లు పరిశీలించి అవసరమైన చోట అదనపు FIR లు నమోదు చేస్తాంవేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాంఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇస్తాంసీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాంరెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుంది03.52 PM, May 18th, 2024తిరుపతి జిల్లానామినేషన్‌ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే:రామచంద్రాపురం మండలం, జడ్పీటీసీ భార్య ఢిల్లీ రాణిపోలింగ్‌ రోజు కూచివారిపల్లెల్లో కోటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది టీడీపీ వాళ్లేముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతి దాడి చేశారువైఎస్సార్‌సీపీ వాహనాలు టీడీపీ వాళ్లు ధ్వంసం చేశారుటీడీపీ వారిపై మాకు వ్యక్తిగత కక్షలు లేవుదౌర్జన్యాలు మేము ఏ రోజు మేము చేయలేదుగాయపడిన వారు ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా దాడి చేశారుకేసులో సంబంధం లేనివారిని కూడా కేసులో ఇరికిస్తున్నారు01.45 PM, May 18th, 2024కడపఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్‌హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధంరౌడీ షీటర్లపై ప్రత్యేక​ నిఘా పెట్టాంప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం01.30 PM, May 18th, 2024తిరుపతికి చేరిన సిట్‌ బృందం స్థానిక అధికారులతో సమావేశం పోలింగ్‌, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్‌01.00 PM, May 18th, 2024కృష్ణా జిల్లాఅల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం12.30 PM, May 18th, 2024ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబుహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్‌.. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపంఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbnహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు… pic.twitter.com/TmsKjABRfH— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 12.00 PM, May 18th, 2024దూకుడు పెంచిన సిట్ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తునిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్‌లాల్మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్ 11.30 AM, May 18th, 2024తిరుపతిజగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజా​తాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారుమళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 11.00 AM, May 18th, 2024మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా? 10.30 AM, May 18th, 2024చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్‌పరారీలో టీడీపీ నేత ప్రభాకర్‌పోలింగ్‌ రోజు జరిగిన హత్యాయత్నం కేసు​లో రాజశేఖర్‌ నిందితుడుఅతన్ని పోలీసు స్టేషన్‌ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్‌లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌వినీత్ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్‌ బలివైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్‌ వైఎస్సార్‌ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement