వేములవాడ: రాజన్న ఆలయంలో కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు నంది, గరత్మంతుడు వాహనాలపై ఊరేగారు. వాతావరణం మేఘావృతం కావడంతో గ్రామసేవను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు పాల్గొన్నారు.
వేములవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారు శుక్రవారం కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాల్లో మూత్రశాలల నిర్మాణానికి శుక్రవారం ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ ఈఈ ఆంజనేయులు, సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు స్థలాన్ని పరిశీలించారు. ఈనెల 21న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు అధికారులు స్థలాన్ని పరిశీలించి, ఎంపీడీవో శశికళతో మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీనారాయణ, కాంట్రాక్టర్ బద్దం హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద లో లెవల్ వంతెన కింద వరద ప్రవాహానికి వచ్చి తట్టుకున్న బండరాళ్లు, చెట్ల కొమ్మలు, మట్టిని శుక్రవారం జేసీబీతో శుభ్రం చేయించారు. ఇవి తట్టుకోవడంతో వరద బ్రిడ్జిపై నుంచి వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు గురువారం పరిశీలించి మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఈ పనులు చేపట్టారు. లోలెవల్ వంతెన కింద ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించడంతో బ్రిడ్జి కింది నుంచి నీరు వెళ్లే అవకాశం కలిగింది.
సిరిసిల్లఅర్బన్: మూడు నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేద ని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద జీపీ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడి నిరసన తెలి పారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్‌దాస్ గణేశ్ మాట్లాడుతూ దసర, బతుకమ్మ పండగలకు వేతనాలు రాక పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు. శనివారం నుంచి అత్యవసర సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగమంటి ఎల్లారెడ్డి, వర్కోలు మల్ల య్య, బుర్ర శ్రీనివాస్, అక్కల అంజాగౌడ్, శ్రీనివాస్, నర్సయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
వైన్స్‌లకు దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: జిల్లాలో 2025– 2027 సంవత్సరానికి 48 మద్యం షాపులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. ఈనెల 26న టెండర్ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా, అక్టోబర్ 18వ తేదీ ఆఖరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే నెల 23న దుకాణాల డ్రా తీయనున్నారని పేర్కొన్నారు. తొలి రోజు దరఖాస్తులు రాలేవని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
నంది, గరత్మంతుడు వాహనాలపై విహరింపు
నంది, గరత్మంతుడు వాహనాలపై విహరింపు
నంది, గరత్మంతుడు వాహనాలపై విహరింపు
నంది, గరత్మంతుడు వాహనాలపై విహరింపు