‘మా ఎమ్మెల్యేలంతా మా పార్టీలో ఉన్నట్టే’ | tdp demanded speaker on disqualification petitions | Sakshi
Sakshi News home page

‘మా ఎమ్మెల్యేలంతా మా పార్టీలో ఉన్నట్టే’

Dec 15 2016 5:42 PM | Updated on Apr 7 2019 3:47 PM

‘మా ఎమ్మెల్యేలంతా మా పార్టీలో ఉన్నట్టే’ - Sakshi

‘మా ఎమ్మెల్యేలంతా మా పార్టీలో ఉన్నట్టే’

తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.  టీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు గురువారం శాసనసభ స్పీకర్ ను కలిసి పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు వేయాలని కోరారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారాన్ని పరిష్కరించడానికి హైకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 21 తో ముగుస్తుందని, ఆలోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం వెల్లడించాలని స్పీకర్ ను కోరినట్టు చెప్పారు. తామిచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ చర్య తీసుకునే వరకు ఆ 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన వారే అవుతారని, అసెంబ్లీలో ఆ లెక్క ప్రకారం అసెంబ్లీలో మాకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement