దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి రక్షిత నీటిని అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి 99 శాతం గ్రామాలకు నీటిని అందిస్తామని ప్రభుత్వం శాసనసభకు స్పష్టం చేసింది.
హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇంటింటికి రక్షిత నీటిని అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టును 2018-19 సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి 99 శాతం గ్రామాలకు నీటిని అందిస్తామని ప్రభుత్వం శాసనసభకు స్పష్టం చేసింది. గురువారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పుట్టా మధుకర్, గాదరి కిషోర్ కుమార్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అజ్మీరా రేఖ, సున్నం రాజయ్య, డాక్టర్ కె.లక్ష్మణ్‌లు మిషన్ భగీరథపై అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు సమాధానం చెప్పారు.
మొదటి దశలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని కొంత భాగం, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌లోని కొంత భాగం, తుంగతుర్తిలోని కొంత భాగం, జనగామ, స్టేషన్ ఘనాపూర్, పాలకుర్తిల్లోని కొంతభాగాలకు నీటి కనెక్షన్లను సమకూర్చాలని ప్రాతిపాదించినట్టు చెప్పారు.