ప్రాదేశిక ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ | 81 percent polling in MPTC, ZPTC Election in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఎన్నికల్లో 81 శాతం పోలింగ్

Apr 7 2014 9:42 PM | Updated on Mar 10 2019 8:01 PM

ప్రాదేశిక ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ - Sakshi

ప్రాదేశిక ఎన్నికల్లో 81 శాతం పోలింగ్

తొలిదశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశికాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 81 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

హైదరాబాద్: తొలిదశ జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశికాలకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 81 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2006లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో 72.26 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి అదనంగా దాదాపు తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యధిక పోలింగ్ నల్గొండలో 86 శాతం, గుంటూరు జిల్లాలో 85 శాతం నమోదైంది.

అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 72 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 80 శాతం పైగా పోలింగ్ జరిగిన జిల్లాల్లో వరంగల్, పశ్చిమగోదావరి(84%), అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్టణం కృష్ణాల్లో(83%), మెదక్(82%), చిత్తూరు(81%),ఖమ్మం, కర్నూలు, వైస్సార్ కడపల్లో (80%) పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement