CSK Vs MI: ఒక్కోసారి మనపై మనకే డౌట్‌!.. ఇప్పుడు ఇలా..: రోహిత్‌ శర్మ | "After Being Here For A Long Time...": Rohit Sharma Breaks Silence On IPL 2025 Form After Half Century Against CSK | Sakshi
Sakshi News home page

Rohit Sharma: ఒక్కోసారి మనపై మనకే డౌట్‌!.. నాకు దక్కిన అరుదైన గౌరవం

Published Mon, Apr 21 2025 9:20 AM | Last Updated on Mon, Apr 21 2025 11:25 AM

Rohit Sharma Breaks Silence On IPL 2025 Form After Fifty Against CSK

Photo Courtesy: BCCI

ముంబై ఇండియన్స్‌ దిగ్గజ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (MI vs CSK)తో మ్యాచ్‌ సందర్భంగా.. చాలా కాలం తర్వాత హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ ఝులిపించాడు. సొంత మైదానం వాంఖడేలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 45 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చాలా కాలం తర్వాత ఇలా
నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో అజేయ అర్ద శతకంతో జట్టును గెలిపించిన రోహిత్‌ శర్మను ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం తర్వాత నేను ఇక్కడ నిలుచోగలిగాను. ఫామ్‌లేమి కారణంగా ఒక్కోసారి మనపై మనకే సందేహం కలుగుతుంది. మన పంథాను మార్చుకునేలా చేస్తుంది. 

కానీ అలాంటపుడే సంయమనంతో ఉండాలి. లేదంటే ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. నా వరకు ఈరోజు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్‌. అందుకే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆడాలని ముందే నిర్ణయించుకున్నా. మా ప్రణాళికల ప్రకారమే నా ఇన్నింగ్స్‌ కొనసాగించాను.

బంతి నా ఆధీనంలోకి వచ్చినప్పుడు బౌండరీకి తరలించాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగడంలో నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫీల్డింగ్‌ వేళ చివరి 2-3 ఓవర్లలో వచ్చినా.. నేరుగా బ్యాటింగ్‌కే దిగినా పెద్దగా తేడా ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నాడు.

నాకు దక్కిన అరుదైన గౌరవం
అదే విధంగా.. వాంఖడేలో కొత్తగా తన పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్‌ గురించి కూడా రోహిత్‌ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘రోహిత్‌ శర్మ స్టాండ్‌లోకి బంతిని తరలించడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. నాకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆ పేరును పలికినప్పుడల్లా ఎలా స్పందించాలో కూడా నాకు తెలియడం లేదు.

ఏదేమైనా ఈరోజు చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. నా బాధ్యత కూడా అది. సరైన సమయంలో మేము గెలుపు బాట పట్టాము. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచాం’’ అని రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెపాక్‌లో చెన్నై చేతిలో ఓడిన తాజా గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ముంబై ఎనిమిదింట నాలుగు మ్యాచ్‌లలో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు రోహిత్‌ శర్మ.. ఏడు ఇన్నింగ్స్‌ ఆడి 158 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌-2025: ముంబై వర్సెస్‌ చెన్నై స్కోర్లు
టాస్‌: ముంబై.. తొలుత బౌలింగ్‌
చెన్నై స్కోరు: 176/5 (20)
ముంబై స్కోరు: 177/1 (15.4)
ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసిన ముంబై.

చదవండి: IPL 2025: ఇటు రోహిత్‌.. అటు కోహ్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement