
వడగళ్ల బీభత్సం
● దుబ్బాక మండలంలో దంచికొట్టిన వాన ● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
దుబ్బాక: మండలంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన వానతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. కమ్మరపల్లి, చీకోడ్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. సకాలంలో తరలించకపోవడంతో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా తడిసిపోయాయి. కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు.
కొమురవెల్లిలో వాన
కొమురవెల్లి(సిద్దిపేట)/జగదేవ్‌పూర్(గజ్వేల్): కొమురవెల్లి, జగదేవ్‌పూర్ మండలాల్లోనూ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆర బోసిన ధాన్యం తడిసిపోయింది. తపాస్‌పల్లిలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రైతులు కల్లాలో ఆరబెట్టిన ధాన్యం ప్లాస్టిక్ కవర్లను కప్పారు. జగదేవ్‌పూర్ మండలంలో పలుచోట్ల పంటలకు నష్టంజరిగింది. అలాగే తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి.