
భగీరథ మహర్షి జయంతి
పాతమంచిర్యాల: కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబ డిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ దివారం భగీరథ మహర్షి జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ హాజరై భగీరథ మహర్షి చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సగరుని ముని మనువడు అయిన భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతుందన్నారు. ఈ సందర్భంగా సగర కు లస్థులు భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా సంక్షేమ అఽధికారి రవూఫ్‌ఖాన్, సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి, ఈడీ దుర్గాప్రసా ద్, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, డీఆర్పీలు పాల్గొన్నారు.