
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాపులర్ అయిన 'ఐఐటీ బాబా' గుర్తున్నాడా? ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT)బాంబేలో తెలివైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి, లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి అభయ్ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ తన విశిష్టమైన విధానంతో మహా కుంభ్‌లో భక్తులను కట్టిపడేశాడు.
తాజాగా అభయ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. విద్యార్థి దశలో అభయ్ అద్భుతమైన ట్రాక్ రికార్డు వైరల్‌గా మారింది. 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభయ్ తన 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతి పరీక్షలలో 92.4 శాతం మార్కులు సాధించాడట. ఈ స్కోర్లు అతని మేధో నైపుణ్యాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. పలు మీడియా నివేదికలు వెలువడ్డాయి. అంతేకాదు 2008లో, అతను IIT-JEE పరీక్షలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడని నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ టాలెంటే అతడిని దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ అభ్యర్థులలో ఒకటిగా నిలిపిందిఅంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!
మహాకుంభ మేళా 2025ల దర్శనమిచ్చిన వివిధ సాధువులు , బాబాలలో ఆకర్షణీయంగా నిలిచిన వారిలో ఒకరు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ ఒకరు. ఈయన హర్యానాకు చెందినవాడు. ఇంజనీర్ బాబా ఐఐటీ బాంబే నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. ఏడాది రూ. 36 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.. అభయ్ డిజైన్‌లో మాస్టర్స్ (MDs) కూడా చేశాడు అయితే, బాబా ఆ ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఫోటోగ్రఫీలో కోర్సు చేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీ చేస్తున్న క్రమంలో అతనిలో మార్పుమొదలైంది. కొంతకాలం తన సొంత కోచింగ్‌ను ప్రారంభించాడు.
నాలుగేళ్లు డేటింగ్...కానీ
నాలుగేళ్లు ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదాలు చూసిన తన సంబంధాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని వెల్లడించాడు. ఇక్కడి నుండి ఆయన ఇంజనీరింగ్ వదిలి పూర్తిగా ఆధ్యాత్మికతకు వైపు మళ్లి బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు.తన జీవితమంతా మహాదేవ్‌కు అంకితం చేశానని కూడా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.