
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 26 మంది బాధితుల వివరాలను అధికారులు విడుదల చేశారు.
ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టుల మృతదేహాలకు శ్రీనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అధికారులు మృతుల వివరాల్ని అధికారింగా ప్రకటించారు. ఈ మృతుల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాం ఉగ్రదాడి.. అధికారికంగా మృతుల వివరాలు విడుదల
సుశీల్ నాథ్యాల్ – ఇండోర్
సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాం
హేమంత్ సుహాస్ జోషి – ముంబై
వినయ్ నార్వాల్ – హర్యానా
అతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్ర
నీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్
బిటన్ అధికారి – కోల్‌కతా
సుదీప్ నియుపానే – నేపాల్
శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్
ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశా
మనీష్ రంజన్ – బీహార్
ఎన్. రామచంద్ర – కేరళ
సంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబై
దినేష్ అగర్వాల్ – చండీగఢ్
సమీర్ గుహార్ – కోల్‌కతా
దిలీప్ దసాలీ – ముంబై
జే. సచంద్ర మోలీ – విశాఖపట్నం
మధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరు
సంతోష్ జాఘ్డా – మహారాష్ట్ర
మంజు నాథ్ రావు – కర్ణాటక
కస్తుబ గంటోవత్య – మహారాష్ట్ర
భరత్ భూషణ్ – బెంగళూరు
సుమిత్ పరమార్ – గుజరాత్
యతేష్ పరమార్ – గుజరాత్
టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్
శైలేష్‌భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్
హెల్ప్ లైన్ ఏర్పాటు
మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో అనంత్ నాగ్ పోలీసులు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు సహాయం చేసేందుకు, బాధితుల కుటుంబాలకు కీలకమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. అనంతనాగ్ హెల్ప్ డెస్క్ కోసం అధికారులు రెండు కాంటాక్ట్ నంబర్‌లను విడుదల చేశారు. వాటిలో ఒకటి 9596777669, 01932-225870, అలాగే 9419051940లో వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను కూడా విడుదల చేశారు.
కుటుంబసభ్యులు, పర్యాటకులు కోసం 0194-2457543,0194-2483651 హెల్ప్‌లైన్ నంబర్‌ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం శ్రీనగర్ అదనపు డిప్యూటీ కమిషనర్ (ADC) ఆదిల్ ఫరీద్ 7006058623ను సంప్రదించవచ్చు.