మూత్రపిండాల వ్యాధితో మృతిచెందిన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 20న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఐదు డయాలసిస్ యూనిట్లకు ఆదరా బాదరాగా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో జారీచేశారు. గత ఒక్క ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో 424 మంది రోగులు కిడ్నీ వ్యాధులతో మృతి చెందారు.జిల్లాలో ఒక్క రిమ్స్‌లో మినహా మరెక్కడా డయాలసిస్ సదుపాయం లేదు. రిమ్స్‌లోనూ సరిపడినన్ని యూనిట్లు లేవు.