
అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు
ఐ.పోలవరం మండలం మురమళ్లలో వరద వల్ల వేట లేక నిలిచిన పడవలు
అమలాపురం రూరల్: ప్రతి ఒక్కరూ జీఎస్టీ లబ్ధిని పొందడానికి అర్హులేనని, ఈ విషయంలో అడ్డంకులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ హెచ్చరించారు. జీఎస్టీ తగ్గింపుపై శనివారం కలెక్టరేట్‌లో అధికారులు, వ్యాపారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు లభించాల్సిన ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారిపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలందరికీ చేరవేయడంలో అధికారులు, ఏజెన్సీలు, డీలర్లు, వ్యాపారులు పూర్తిగా సహకరించాలని కోరారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక జీఎస్టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
7,709 మందికి లబ్ధి
జిల్లాలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 7,709 మంది లబ్ధి పొందారని కలెక్టర్ మహేష్‌కుమార్ వెల్లడించారు. శనివారం అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆటోడ్రైవర్ల సేవలో ఆయా డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేశారన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, డీఆర్‌వో కొత్త మాధవి, డీటీవో డి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్

అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు