
కన్నవారిని కోల్పోయిన పిల్లలకు భరోసా
పుష్కలంగా యూరియా
బాపట్ల : జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్ కేంద్రాల 21 ద్వారా 260 మెట్రిక్ టన్నుల యూరియాను 2,456 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా 287 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.
బాపట్ల: కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సోదరుడిలా ఉండి భరోసా కల్పిస్తానని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో ప్రధానమంత్రి కేర్ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో జిల్లా కలెక్టర్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి ఆరుగురు బాలలు ఆ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. వారు తిరుపతి, తెనాలి, కర్నూలు ప్రాంతాల్లో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అన్ని విషయాలను చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు.
లబ్ధిదారుల పేర్లు జాబితాల్లో చేరుస్తాం
19న బాపట్ల షాపింగ్ ఫెస్టివల్
బాపట్ల: ఈ నెల 19వ తేదీన బాపట్ల షాపింగ్ ఫెస్టివల్‌ను జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి బాపట్ల, చీరాల ట్రేడర్ల సంఘం ప్రతినిధులతో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ట్రేడర్ల సంఘాలు సహకరించాలన్నారు. 7వ తేదీన ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో 40 నిమిషాలపాటు జీఎస్టీ తగ్గింపుపై విద్యార్థులకు క్లాస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు.
పర్యాటక అభివృద్ధికి చర్యలు
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృష్టితో క్యారవాన్ టూరిజం ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సూర్యలంక బీచ్‌లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరావుతో కలసి డ్రీమ్‌లైనర్స్ క్యారవాన్ సర్వీస్ లగ్జరీ బస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాహనం వచ్చే శనివారం, ఆదివారం చీరాల బీచ్ వద్ద ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
బాధితులకు న్యాయం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్