Weekly Horoscope Telugu: ఈ రాశి వారు వారం మధ్యలో గుడ్‌ న్యూస్‌ వింటారు

Weekly Horoscope Telugu 22-01-2023 To 28-01-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంటాబయటా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అతి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చాకచక్యం, పట్టుదలతో సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు ఎదురవుతున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలలో విజయాల బాటపడతారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం రాగలదు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మీపై ఆరోపణలు తొలగుతాయి. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. వారం చివరిలో మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనూహ్యమైనరీతిలో వవ్యవహారాలు పూర్తి కాగలవు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు సా«ధిస్తారు. ఇంటాబయటా అనుకూలం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అతి ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాల అంచనాలు నిజం కాగలవు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలు  దిగ్విజయంగా కొనసాగుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఆస్తుల విషయంలో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. మనశ్శాంతి లోపిస్తుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభాలు అంది పుంజుకుంటాయి. ఉద్యోగులు విధులను సక్రమంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.  ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో శ్రమ పెరుగుతుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఎంతటి వారినైనా ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుని ఖర్చులు అదుపు చేసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి.  భూవివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. కళారంగం వారికి పురస్కారాలు రావచ్చు. వారం చివరిలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top