
గాలి వాన బీభత్సం
జిల్లాలో కురిసిన వర్షం
అపార నష్టం
భీమారం: మండలంలో వర్షానికి అపార నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. భీమారం–నెన్నెల ప్రధాన రహదారిలో కొత్తగూడెం నుంచి నర్సింగాపూర్ వరకు పెద్ద ఎత్తున చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చెట్లను ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. బూర్గుపల్లి, కాజిపల్లి, భీమారం, నర్సింగాపూర్ గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి చాలా దూరంలో పడ్డాయి. దీంతో కాజిపల్లి గ్రామానికి చెందిన బాధితులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. బూర్గుపల్లిలోని పలు తోటల్లో 40 ఏళ్ల వయస్సు గల మామిడి చెట్లు వేళ్లతో సహా పడిపోయాయి. ప్రభుత్వం నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
జైపూర్: మండలంలో గురువారం రాత్రి భారీ ఈదురుగాలుల వర్షానికి మామిడి కాయలు నేలరాలయి. కిష్టాపూర్, వేలా ల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్డు వైపు ఉన్న పెద్దపెద్ద చెట్లు నెలకొరిగాయి. కిష్టాపూర్, శివ్వారం, పౌనూర్‌లో రేకులతో నిర్మించుకున్న ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యం తడిసింది.
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి, నాగారాం గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు నేలపాలయ్యాయి. కోతకు వ చ్చిన వరి పైరు నేలవాలగా.. పలు గ్రా మాల్లో కళ్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. చేతికొచ్చిన వరి ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలను నీట ముంచేసింది. దిగుబడి దశలో ఉన్న మామిడి నేలరాలింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 5.2మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నెన్నెల, భీమారం, జైపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయి రూ.30లక్షల నుంచి రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులతో చెట్లు విరిగి ఇళ్లు, రోడ్లు, విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో 33కేవీ లైన్ స్తంభాలు 5, 11కేవీ లైన్ స్తంభాలు 92, ఎల్‌టీ స్తంభాలు 99, ట్రాన్స్‌ఫార్మర్లు 14 నేలకూలాయి. విద్యుత్ శాఖకు రూ.50లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జైపూర్, భీమారం, నెన్నెల, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు విరిగి, తీగలు తెగిపడి నష్టం తెచ్చిపెట్టాయి. గురువారం రాత్రి నుంచి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. శుక్రవారం మధ్యాహ్నం వరకు పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసింది.
జిల్లాలో పంట నష్టం
జిల్లాలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలు లు, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాన్ని శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. నెన్నెల, భీ మారం, జైపూర్ మండలాల్లో 83మందికి చెందిన కోత దశలో ఉన్న వరి పంట 133ఎకరాల్లో దెబ్బ తిన్నట్లు గుర్తించారు. 1386 ఎకరాల్లోని మామిడితోటల్లో 33శాతం పైబడి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. చెట్లకొమ్ములు విరగడంతోపాటు వేర్లతో నే లకు వంగడం, కాయలు నేలరాలినట్లు తేల్చారు.
నేలకొరిగిన వరి పంట
నెన్నెల/భీమిని: నెన్నెల మండలం గంగారాం, నెన్నెల, కొత్తగూడం గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చిత్తాపూర్, నార్వాయిపేట, ఆవుడం, గంగారాం, చిన్నవెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో 800 ఎకరాల్లో మామిడికి, 300 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంగారాం, చిన్నవెంకటాపూర్, పొట్యాల, కొంపల్లిలో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి ధాన్యం రాలింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో 16గంటలపాటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఏఈ రాజ న్న సిబ్బందితో కలిసి మరమ్మతులు చేసి అంతరాయం లే కుండా చర్యలు తీసుకున్నారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి గోడలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వృక్షాలు నేలకూలి రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రూ.లక్షల్లో నష్టం ఏర్పడిందని, అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
● ఒక్కసారిగా గాలివాన రావడంతో కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో జంపాల అంజన్న రేకుల టేల ఎగిరి ఇంటిపై పడింది. ఇంటిపై ఉన్న రేకులు పగలడంతో నష్టం జరిగింది. చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. రాంపూర్ రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తడిసిన ధాన్యం
చెన్నూర్‌రూరల్: మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. లంబడిపల్లి, లింగంపల్లి, అక్కెపలి, అంగ్రాజ్‌పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యంపై కవర్లు కప్పారు. కొన్ని చోట్ల కవర్లపై నీరు చేరి కొంత మేర ధాన్యం తడిసింది. వర్షపు నీరు చేరడంతో రైతులు నీటిని ఎత్తి పోస్తున్నారు. ఆకాశంలో మబ్బులు అలాగే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు చెన్నూర్–మంచిర్యాల ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగాయి. శుక్రవారం వాటిని తొలగింపజేశారు.
నేలరాలిన మామిడి
విరిగిన విద్యుత్ స్తంభాలు
కూలిన ఇళ్ల పైకప్పులు
5.2 మిల్లీమీటర్ల వర్షపాతం
మండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో)
భీమారం 23.8
నెన్నెల 21.3
చెన్నూర్ 12.3
జైపూర్ 10.8
భీమిని 9.1
కన్నెపల్లి 6.5
కోటపల్లి 6.5
వేమనపల్లి 2.2

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం