
వాడపల్లి ఆలయానికి మంగళసూత్రాలు, వెండి పళ్లెం సమర్పణ
కొత్తపేట: విశాఖపట్నంలో శ్రీవెంకటకృష్ణ అన్నమాచార్య ఆధ్యాత్మిక సేవా సంస్థ సభ్యుల బృందం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుమారు రూ.6 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు, వెండి పళ్లెం సమర్పించింది. 42 గ్రాముల రెండు మంగళసూత్రాలు. ఒకటిన్నర కేజీల వెండిపళ్లాన్ని సంస్థ ఆర్గనైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో క్షేత్రంలో దేవస్థాన అధికారుల ద్వారా ఆలయ అర్చకులకు అందజేశారు. అలాగే సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి దొరబాబు, సుధారాణి దంపతులు తమ కుమారుడు రమేష్‌చంద్రతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి వారు రూ.1,00,700 విరాళంగా సమర్పించినట్టు దేవస్థానం సూపరింటెండెంట్ పి.రాంబాబు తెలిపారు.

వాడపల్లి ఆలయానికి మంగళసూత్రాలు, వెండి పళ్లెం సమర్పణ