
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. అయితే 2025 మే 5 నుంచి కొన్ని ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ (వాట్సాప్) పనిచేయదు. ఇంతకీ జాబితాలో ఏ ఫోన్లు ఉన్నాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.
యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెటా ఎప్పటికప్పుడు 'వాట్సాప్'ను అప్డేట్ చేస్తూ లేదా కొత్త ఫీచర్లులను ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వాట్సాప్ ఉపయోగించే ఫోన్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో పాత ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఐఫోన్లలో తమ సేవలను నిలిపివేయనుంది.
మీరు ఉపయోగించే ఐఫోన్ iOS 15.1 తర్వాత లాంచ్ అయిన వెర్షన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్ పనిచేస్తుంది. అయితే మీ ఐఫోన్ iOS 15.1 లేదా అంతకు ముందు వెర్షన్ అయితే వాట్సాప్ పనిచేయదు. జాబితాలో ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ వంటివి ఉన్నాయి. అంటే ఈ ఫోన్లలో మే 5 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే ఈ ఫోన్‌లు iOS 14 వెర్షన్‌లకే పరిమితమయ్యాయి. వీటిని iOS 15కి అప్‌డేట్ చేయడం కుదరదు.