
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రారభించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయినప్పటికీ ప్రజల వద్ద ఇంకా రూ.6266 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన నోట్లు 98.24 శాతం. ఇంకా 1.76 శాతం నోట్లు రావాల్సి ఉందని ఆర్‌బీఐ వెల్లడించింది.
పెద్దనోట్ల ఉపసంహరణ ప్రకటించిన సమయానికి చలామణిలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు ఉన్నాయి. అయితే ఇది 2025 ఏప్రిల్ 30 నాటికి రూ. 6,266 కోట్లకు తగ్గింది.
ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అలా కాకుంటే.. పోస్టాఫీసు నుంచి ఆర్‌బీఐ జారీ కార్యాలయాలకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. మీరు పంపించిన నోట్ల విలువకు సమానమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు ఆర్‌బీఐ జమచేస్తుంది.