
2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.
ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా 195 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీరందరికీ కంపెనీ ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంస్థ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది.
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఏప్రిల్ 18న దాదాపు 240 మందిని తొలగించగా, అంతకు ముందు ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను, మార్చిలో 30 నుంచి 35 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్‌ను కూడా సంస్థ అందిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ తొలంగించిన ట్రైనీలందరినీ.. 2022లో నియమించుకుంది.
ఇదీ చదవండి: అద్దె అపార్ట్‌మెంట్‌లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా..