PSL 2025
-
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీసిన న్యూజిలాండ్ ఆటగాడు
న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు కొలిన్ మున్రో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో అతను డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ ముల్తాన్ సుల్తాన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో మున్రో కీలకపాత్ర పోషించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో మున్రో తన ఆటతీరుతో కాకుండా వేరే విషయం కారణంగా వార్తల్లో నిలిచాడు. మున్రో బ్యాటింగ్ చేస్తుండగా సుల్తాన్స్ బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్‌తో గొడవ జరిగింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ మూడో బంతిని ఇఫ్తికార్ బ్లాక్‌హోల్‌లోకి వేయగా మున్రో దాన్ని విజయంవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చక్ (చట్టవిరుద్ధమైన బౌలింగ్ శైలి) చేస్తున్నాడని మున్రో ఆరోపించాడు.iftikhar vs munro 😳 pic.twitter.com/kYqHo0R4OU— IF7 (@IF7____) April 23, 2025దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్ మున్రో వైపు దూసుకొచ్చి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. చకింగ్ చేస్తున్నావని చెప్పడంలో తప్పేముందున్నట్లు నిలదీశాడు. మధ్యలో సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ జోక్యం చేసుకున్నాడు. అతను కూడా మున్రోతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మైదానంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చివరికి అంపైర్ల జోక్యంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆతర్వాత కూడా ఇఫ్తికార్ వివాదాస్పద శైలితోనే బౌలింగ్ కొనసాగించాడు. లీగ్ వారిదే కావడంతో మున్రో చేసేదేమీ లేక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఛేదనలో తన జట్టు విజయానికి మంచి పునాది వేసి ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్) చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఇఫ్తికార్ 2 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 20 పరుగులు సమర్పించుకున్నాడు. పాక్ ఆటగాడిని వారి సొంత అడ్డాలోనే నిర్భయంగా నిలదీయడంతో క్రికెట్ అభిమానులు మున్రో ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అలాగే చట్టవిరుద్ధమైన శైలితో బౌలింగ్ చేస్తున్నా పట్టించుకోని పాక్ అంపైర్లను చీవాట్లు పెడుతున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ అంటే ఇంత కంటే గొప్పగా ఏమీ ఆశించలేమని సర్దుకు పోతున్నారు. మున్రో పేరిట న్యూజిలాండ్ తరఫున రెండో వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు ఉంది. 38 ఏళ్ల మున్రో న్యూజిలాండ్ తరఫున 3 టీ20 సెంచరీలు చేశాడు. -
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్ఎల్లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్‌ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్ఎల్లో తదుపరి మ్యాచ్‌లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్ఎల్లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్‌రైజర్స్‌కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్లో ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్లో కేన్ 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. కేన్‌ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. కేన్‌ను 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్‌తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్‌ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్‌ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్ఎల్ పంచన చేరారు. పీఎస్ఎల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు. పీఎస్ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్‌తో కేన్ పీఎస్ఎల్ అరంగేట్రం చేస్తాడు. -
ఇలాంటివన్ని పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి.. సహచరుడికే ఇచ్చి పడేసిన బౌలర్
చిత్రవిచిత్ర ఘటనలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా ఓ ఆటగాడు వికెట్ తీసిన ఆనందంలో సొంత జట్టు ఆటగాడిపైనే దాడి చేశాడు (అనుకోకుండా). ఈ ఘటనలో బాధిత ఆటగాడి తలకు గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.Update: Everyone is ok 🤗Khel Khel main 😄#HBLPSLX l #ApnaXHai l #MSvLQ pic.twitter.com/sJBcX91wai— PakistanSuperLeague (@thePSLt20) April 22, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. పీఎస్ఎల్ 2025లో భాగంగా నిన్న లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ లాహోర్ ఖలందర్స్‌పై 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. ఖలందర్స్‌ను సుల్తాన్స్ బౌలర్ ఉబైద్ షా 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు.ఈ ఉబైద్ షానే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వికెట్ (సామ్ బిల్లింగ్స్) తీసిన ఆనందంలో పొరపాటున సహచరుడు ఉస్మాన్ ఖాన్ (వికెట్‌కీపర్) తలపై దాడి చేశాడు. వికెట్ తీశాక సంబరాల్లో భాగంగా ఉబైద్ షా సహచరులకు హై ఫై ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఉస్మాన్ ఖాన్ కూడా తన చేయి పైకి లేపాడు. అప్పటికే జోరుమీదున్న ఉబైద్.. పొరపాటు ఉస్మాన్ చేయిపై కాకుండా తలపై హై ఫై ఇచ్చాడు. ఈ ఘటనతో దిమ్మతిరిగిపోయిన ఉస్మాన్ తల పట్టుకుని నేల వాలాడు. ఇది చూసి మైదానంలో ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు.ఊహించని చర్యతో షాక్‌కు గురైన ఉస్మాన్ కొద్ది సేపు మైదానంలో పడిపోయాడు. ఫిజియో పరిశీలించాక ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఉస్మాన్ మ్యాచ్‌లో కొనసాగాడు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కొద్ది సేపు అంతరాయం కలిగింది. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) బాగా రాణించిన తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయర్లు, హెయిర్ ట్రిమ్మర్లు బహుమతులగా ఇచ్చి నవ్వులపాలైంది. ఈ ఏడాది పీఎస్ఎల్ ఐపీఎల్‌కు పోటీగా ఒకే సమయంలో జరుగుతుంది. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్పదంటూ ఢాంబికాలకు పోయిన పాక్ క్రికెట్ బోర్డు ఇలా చేసింది. తీరా చూస్తే ఐపీఎల్ కారణంగా ఒకరిద్దరున్న పీఎస్ఎల్ అభిమానులు కూడా ఆ లీగ్‌ను చూడటం మానేశారు. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ఈ సీజన్లో పీఎస్ఎల్ అభిమానులు ఒక్కసారిగా తగ్గిపోయారు. స్టేడియంలో స్టాండ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ క్రికెట్ బోర్డు అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. -
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన 13000 పరుగుల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న వార్నర్.. పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 60; 8 ఫోర్లు) చేసిన వార్నర్.. పొట్టి క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన మూడో ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్‌ల్లో 13000 పరుగులు పూర్తి చేశాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా ఈ మార్కును తాకిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ కేవలం 381 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. గేల్ తర్వాత విరాట్ కోహ్లి (386 ఇన్నింగ్స్‌ల్లో) అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 14562అలెక్స్ హేల్స్- 13610షోయబ్ మాలిక్- 13571కీరన్ పోలార్డ్- 13537విరాట్ కోహ్లి- 13208డేవిడ్ వార్నర్- 13019టీ20ల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 381 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లి- 386డేవిడ్ వార్నర్- 403అలెక్స్ హేల్స్- 474షోయబ్ మాలిక్- 487కీరన్ పోలార్డ్- 594కరాచీ కింగ్స్, పెషావర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ రాణించడంతో పెషావర్ జల్మీపై కరాచీ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
PSL 2025: దినదినాభివృద్ధి చెందుతున్న బాబర్ ఆజమ్.. భారీ ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా ఫీలయ్యే బాబర్ ఆజమ్ తన క్రికెటింగ్ ప్రస్థానంలో దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గత కొంతకాలంగా చెత్త ప్రదర్శనలతో అదఃపాతాళానికి పడిపోయిన బాబర్.. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లో డకౌటైన బాబర్.. రెండో మ్యాచ్‌లో 1, మూడో మ్యాచ్‌లో 2, నిన్న (ఏప్రిల్ 21) జరిగిన నాలుగో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి పోటీ అని చెప్పుకునే బాబర్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి క్రికెట్ అభిమానులు వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా 0, 1, 2, 46 స్కోర్లు చూసి బాబర్ దినదినాభివృద్ధి చెందుతున్నాడని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.పీఎస్ఎల్లో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఈ సీజన్లో కెప్టెన్‌గానూ తేలిపోయాడు. తన జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట ఓటమిపాలైంది. నిన్న కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ 2 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. విశేషమేమిటంటే పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమే (46) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లలో మహ్మద్ హరీస్ (28), అల్జరీ జోసఫ్ (24 నాటౌట్), తలాత్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. సైమ్ అయూబ్ 4, టామ్ కొహ్లెర్ కాడ్మోర్ 7, మిచెల్ ఓవెన్ 5, అబ్దుల్ సమద్ 2, లూక్ వుడ్ 2 పరుగులకు ఔటయ్యారు. కరాచీ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో 3 వికెట్లు తీయగా.. ఆమెర్ జమాల్, మీర్ హమ్జా చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ కూడా ఒక్కో పరుగు సాధించేందుకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద ఆ జట్టు 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కరాచీ గెలుపుకు ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (60) గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు తడబడ్డారు. అయితే చివర్లో ఖుష్దిల్ షా (23 నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేసి కరాచీని విజయతీరాలకు చేర్చాడు. పెషావర్ బౌలర్లలో లూక్ వుడ్ 3, అలీ రజా 2, అల్జరీ జోసఫ్, ఆరిఫ్ యాకూబ్ తలో వికెట్ పడగొట్టారు. -
సప్పగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్.. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ లేదు..!
ఐపీఎల్ 2025కు పోటీగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన కూడా లేదు. ఆటగాళ్ల మెరుపులు లేకుండా దాయాది లీగ్ సప్పగా సాగుతుంది. ఏప్రిల్ 11న మొదలైన పీఎఎస్ఎల్ 2025లో నిన్నటికి (ఏప్రిల్ 20) పది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ కాస్త ఆసక్తిగా సాగింది. ఏప్రిల్ 12న జరిగిన సీజన్ మూడో మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తలో సెంచరీ (మహ్మద్ రిజ్వాన్, జేమ్స్ విన్స్) నమోదు చేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదొక్క మ్యాచే కాస్త ఆసక్తికరంగా సాగింది.ఏప్రిల్ 14న జరిగిన సీజన్ ఐదో మ్యాచ్ కూడా కాస్త పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అనంతరం పెషావర్ జల్మీ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 141 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్ మొత్తంలో ఇవే కాస్త చెప్పుకోదగ్గ ప్రదర్శనలు. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు పూర్తయినా కేవలం 14 హాఫ్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. బౌలర్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు. ఇస్లామాబాద్‌కు ఆడుతున్న విండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ (11) ఒక్కడే ఈ సీజన్లో సక్సెఫుల్ బౌలర్ అనిపించుకున్నాడు. కరాచీ కింగ్స్ బౌలర్ హసన్ అలీ (10) పర్వాలేదనిపించాడు.పాకిస్తాన్లో ఫ్లాట్ పిచ్‌లు ఉన్నా బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. 10 మ్యాచ్‌లు పూర్తయినా చెప్పుకోదగ్గ సిక్సర్లు కానీ బౌండరీలు కానీ నమోదు కాలేదు. ఇస్లామాబాద్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక సిక్సర్లు (11), అత్యధిక బౌండరీలు (25) కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. బాబర్ 3 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కసారి కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సీజన్లో జేమ్స్ విన్స్ మినహా విదేశీ ఆటగాళ్లు ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించడం లేదు. డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు కూడా తేలిపోతున్నాడు. కొలిన్ మున్రో, టిమ్ సీఫర్ట్, సామ్ బిల్లింగ్స్, ఫిన్ అలెన్ లాంటి విధ్వంకర వీరులు కూడా అడపాదడపా ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. భారీ హిట్టర్‌గా పేరున్న రిలీ రొస్సో తడబడుతున్నాడు. లోకల్ హీరోలు సల్మాన్ అఘా, మహ్మద్ హరీస్, ఫకర్ జమాన్, సౌద్ షకీల్, ఉస్మాన్ ఖాన్, అబ్దుల్లా షఫీక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. -
PSL 2025: హెయిర్ డ్రైయర్, ట్రిమ్మర్.. షాహీన్ అఫ్రిదికి ఖరీదైన బహుమతి
పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తమ ఆటగాళ్లకు (జేమ్స్ విన్స్, హసన్ అలీ) హెయిర్ డ్రైయర్లు, హెయిర్ ట్రిమ్మర్ లాంటి వస్తువులను బహుమతులుగా (అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ) ఇచ్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు కనీస విలువ చేసే బహుమతులైనా ఇవ్వాలేరా అంటూ నెటిజన్లు సదరు ఫ్రాంచైజీ యాజమాన్యంపై మండిపడ్డారు.ఈ నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన తమ ఆటగాడు షాహీన్ అఫ్రిదికి ఓ ఖరీదైన వస్తువును బహుమతిగా ఇచ్చి ట్రోలింగ్ నుంచి తప్పించుకుంది. అఫ్రిది తన ప్రదర్శనలతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖలందర్స్‌ను విజేతగా నిలపడంతో యాజమాన్యం అతనికి 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఐఫోన్ 16 ప్రోను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని ఖలందర్స్ యాజమాన్యం ఓ వీడియో ద్వారా సోషల్‌మీడియాలో షేర్ చేసింది.The iPhone has landed 📱😉Our Captain Qalandar receives a gift he’s worthy of 💛🤴🏽 A custom 24K Gold-plated IPhone 16 Pro, made just for Lahore Qalandars’ main man, Shaheen! pic.twitter.com/PYigEiJvRR— Lahore Qalandars (@lahoreqalandars) April 20, 2025ఖలందర్స్‌కు కెప్టెన్‌గా కూడా ఉన్న అఫ్రిది క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై వరుసగా 2-6, 3-35 ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా ఖలందర్స్ ఆయా జట్లపై 79, 65 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్ చేతిలో ఓటమి అనంతరం ఖలందర్స్ క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్‌పై విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (డిఫెండింగ్ ఛాంప్ ఇస్లామాబాద్ యునైటెడ్ టాప్ ప్లేస్‌లో ఉంది) కొనసాగుతుంది. ఖలందర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని ముల్లాన్ సుల్తాన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 22న జరుగనుంది. -
డేవిడ్ వార్నర్‌కు మరో ఆఫర్.. ఈసారి..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)మరో టీ20 లీగ్‌లో భాగం కానున్నాడు. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సీటెల్ ఒర్కాస్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీటెల్ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమతో జట్టు కట్టినట్లు తెలిపింది.కాగా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఎన్నో టీ20 లీగ్‌లలో వార్నర్ భాగమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పాటు బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ది హండ్రెడ్ (ఇంగ్లండ్), ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (UAE), పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో వివిధ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.12956 పరుగులు.. సగం ఐపీఎల్లోనేఇక టీ20 ఫార్మాట్లో వార్నర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు 402 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 12956 పరుగులు సాధించాడు. ఇందులో ఐపీఎల్లో ఆడిన మ్యాచ్‌లు 184 కాగా.. సాధించిన పరుగులు 6565. 2009లో ఐపీఎల్లో అడుగుపెట్టిన వార్నర్ నిలకడైన ఆటతో రాణించాడు.అమ్ముడుపోకుండా మిగిలిపోయాడుఅంతేకాదు 2016లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టైటిల్ అందించాడు. చివరగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు ఢిల్లీ వార్నర్‌ను వదిలేయగా.. వేలంలోనూ అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.పీఎస్ఎల్లో అత్యధిక ధరఈ క్రమంలో పీఎస్ఎల్ వైపు దృష్టి సారించిన వార్నర్.. ఈ పాక్ టీ20 లీగ్‌లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. కరాచీ కింగ్స్ అతడిని రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. ఇక పీఎస్ఎల్ ఏప్రిల్ 11- మే 18 వరకు జరుగనుండగా.. అమెరికా టీ20 లీగ్ MLCని జూన్ 12- జూలై 13 వరకు నిర్వహించనున్నారు.సీటెల్ ఒర్కాస్తో తాజా ఒప్పందంఈ నేపథ్యంలో సీటెల్ ఒర్కాస్ వార్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఎంత మొత్తానికి అతడి సేవలు వినియోగించుకోబోతోందో మాత్రం వెల్లడించలేదు. కాగా వార్నర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్.. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌గా ఈ ఏడాది జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతేకాదు.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి 405 పరుగులతో లీగ్‌లో అత్యధిక వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐఎల్టీ20లో ఈ ఏడాది టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో వార్నర్ సభ్యుడు. ఇక ది హండ్రెడ్ లీగ్‌లో అతడు లండన్ స్పిరిట్‌కు ఆడుతున్నాడు. చదవండి: BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం -
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్‌కు పోటీగా జరుగుతుంది. ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కాగా.. పీఎస్ఎల్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో పోటీపడే క్రమంలో ఈ సీజన్లో పీఎస్ఎల్ ఆటగాళ్ల పారితోషికాలకు భారీగా పెంచింది.గతంలో పీఎస్ఎల్లో విదేశీ ఆటగాళ్లు 2 కోట్లలోపు (భారత కరెన్సీలో), పాక్ ఆటగాళ్లు కోటిన్నర లోపు పారితోషికాన్ని అందుకున్నారు. అయితే ఈ సీజన్లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 2.57 కోట్ల రూపాయలను పారితోషికంగా పొంది రికార్డు సృష్టించాడు. పీఎస్ఎల్ 2025లో వార్నర్‌దే అత్యధిక పారితోషికం. వార్నర్ తర్వాత అత్యధికంగా డారిల్ మిచెల్ రూ. 1.88 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడు. వార్నర్, మిచెల్ తర్వాత అత్యధిక పారితోషికాన్ని పాక్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్, నసీం షా, మొహమ్మద్ రిజ్వాన్, మాథ్యూ షార్ట్, షాదాబ్ ఖాన్ అందుకుంటున్నారు. వీరింతా భారత కరెన్సీలో కోటి 88 లక్షలను పారితోషికంగా అందుకుంటున్నారు. ఈ సారి పీఎస్ఎల్లో స్థానిక ఆటగాళ్లకంటే విదేశీ ఆటగాళ్లకే అధిక పారితోషికం ఇవ్వడం విశేషం.భారత్‌లో జరిగే ఐపీఎల్‌తో పోలిస్తే.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆటగాళ్లకు లభించే పారితోషికం నామమాత్రమే. ఐపీఎల్-2025లో అత్యధిక ధర పొందిన రిషబ్ పంత్ పారితోషికంతో పోలిస్తే వార్నర్ పారితోషికం 10 శాతం లోపే. పంత్‌ను ఈ సీజన్లో మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో పంత్ అందుకుంటున్న మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. వార్నర్ తొలుత ఐపీఎల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసి, అక్కడ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో పీఎస్‌ఎల్‌వైపు మళ్లాడు. ఈ సీజన్ వేలంలో అతన్ని కరాచీ కింగ్స్ సొంతం చేసుకుని కెప్టెన్సీ కూడా అప్పగించింది.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికాలు పొందుతున్న ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)- 2.57 కోట్లు (భారత కరెన్సీలో)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుబాబర్ ఆజమ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లుఫకర్ జమాన్ (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుషాహీన్ అఫ్రిది (లాహోర్ ఖలందర్స్)- 1.88 కోట్లుసైమ్ అయూబ్ (పెషావర్ జల్మీ)- 1.88 కోట్లునసీం షా (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుమొహమ్మద్ రిజ్వాన్ (ముల్తాన్ సుల్తాన్స్)- 1.88 కోట్లుమాథ్యూ షార్ట్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుషాదాబ్ ఖాన్ (ఇస్లామాబాద్ యునైటెడ్)- 1.88 కోట్లుఐపీఎల్ 2025లో టాప్-5 పారితోషికాలు.. రిషబ్ పంత్ (లక్నో)- 27 కోట్లుశ్రేయస్ అయ్యర్ (పంజాబ్)- 26.75 కోట్లువెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)- 23.75 కోట్లుఅర్షదీప్ సింగ్ (పంజాబ్)- 18 కోట్లుచహల్ (పంజాబ్)- 18 కోట్లు -
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోలుస్తూ పాక్ రిపోర్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రెండింటిలో గొప్ప లీగ్ ఏదో చెప్పాలంటూ అతడు అడిగిన ప్రశ్నకు లాహోర్ ఖలందర్స్ స్టార్, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సత్తాకాగా ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన టీ20 లీగ్‌గా ఐపీఎల్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో భాగమైన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేసి.. అక్కడా సత్తా చాటుతున్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఐపీఎల్‌తో పోటీకి దిగిపదిహేడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్‌కు ఇంత వరకు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఈసారి ఐపీఎల్‌తో ఢీకొట్టింది. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 మే 25న ముగియనుండగా.. పీఎస్ఎల్ను ఏప్రిల్ 11- మే 18 వరకు నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది.ఫలితంగా.. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ప్రేక్షక ఆదరణ లేక పీఎస్ఎల్ వెలవెలబోతోంది. అయితే, కొంత మంది పాక్ జర్నలిస్టులు మాత్రం ఐపీఎల్‌తో పీఎస్ఎల్ను పోలుస్తూ విదేశీ ఆటగాళ్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఖలందర్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌ను ఓ రిపోర్టర్.. ప్రపంచంలోని ఇతర లీగ్‌లతో పోలిస్తే పీఎస్ఎల్ స్థానమేమిటి? అంటూ ప్రశ్నించారు.PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదుఈ ప్రశ్నను అర్థం చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ‘‘నా నుంచి మీరేదో చిలిపి సమాధానం ఆశిస్తున్నారు.. అంతే కదా!.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులను కలిగి ఉండటం క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోవడం క్రికెటర్లుగా మా బాధ్యత.కాబట్టి వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న లీగ్‌లను పోల్చి చూస్తూ.. ర్యాంకులు ఇవ్వడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇతర లీగ్‌లతో పోలిస్తే.. ఐపీఎల్ ప్రీమియర్ కాంపిటిషన్ అన్న మాట వాస్తవం. ఐపీఎల్‌తో పోలిస్తే ప్రతి లీగ్.. దానికంటే వెనుబడి ఉన్నట్లే.ఇంగ్లండ్‌లో మేము.. ఇక్కడ పీఎస్ఎల్ మాదిరే ప్రపంచంలోని రెండో అత్యుత్తమ టీ20 లీగ్‌గా పేరొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్ పరిస్థితి కూడా ఇంతే.ఏదేమైనా ప్రతీ లీగ్ దానికదే ప్రత్యేకం. నేనైతే ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’’ అని సామ్ బిల్లింగ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ కచ్చితంగా బెటర్ అంటూ పరోక్షంగా తన మనసులో మాటను వెల్లడించాడు.గతంలో ఐపీఎల్లో ఆడిన బిల్లింగ్స్కాగా 33 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ 2015-16లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంటే.. 2023 నుంచి లాహోర్ ఖలందర్స్కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన బిల్లింగ్స్.. 2018, 2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన పాక్ వికెట్ కీపర్
పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆ దేశ జాతీయ జట్టు వికెట్‌కీపర్ సాహిబ్జాదా ఫర్హాన్ విధ్వంసకర శతకంతో విరుచకుపడ్డాడు. పెషావర్ జల్మీతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఓవరాల్‌గా 52 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫర్హాన్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో కొలిన్ మున్రో (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), సల్మాన్ అఘా (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆండ్రియస్ గౌస్ 0, ఆజమ్ ఖాన్ 16, జేసన్ హోల్డర్ 20 నాటౌట్, డ్వార్షుయిస్ 18 నాటౌట్ పరుగులు చేశారు. పెషావర్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, తలాత్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఇస్లామాబాద్ బౌలర్లు ఇమాద్ వసీం (4-0-26-3), షాదాబ్ ఖాన్ (4-0-29-2), డ్వార్షుయిస్ (2.2-0-23-2), నసీం షా (3-0-14-1), జేసన్ హోల్డర్ (2-0-20-1), షాన్ మసూద్ (3-0-25-1) కలిసికట్టుగా రాణించడంతో 18.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (47 బంతుల్లో 87; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. హరీస్‌తో పాటు పెషావర్ జట్టులో మిచెల్ ఓవెన్ (10), తలాత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుఫర్హాన్.. పాక్ దేశవాలీ క్రికెట్లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను పాక్ నేషనల్ టీ20 కప్‌లో 72 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా రికార్దైంది. ఓవరాల్‌గా చూసినా టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్. టీ20ల్లో తొలి రెండు అత్యధిక స్కోర్లు క్రిస్ గేల్ (175 నాటౌట్), ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉన్నాయి. ఫర్హాన్.. హ్యామిల్టన్ మసకద్జ (162 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్‌తో కలిసి (162 నాటౌట్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. పీఎస్ఎల్ 2025లో భాగంగా పెషావర్‌పై ఫర్హాన్ చేసిన చేసిన 49 బంతుల సెంచరీ ఈ సీజన్లో మొదటిది. ఇస్లామాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2019 సీజన్లో సౌతాఫ్రికా ఆటగాడు కెమరూన్ డెల్పోర్డ్ కూడా ఇస్లామాబాద్‌కు ఆడుతూ లాహోర్ ఖలందర్స్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేద క్రికెట్ బోర్డు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయితే వారి ఆథ్వర్యంలో నడిచే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చిన ఆటగాళ్లకు కనీస బహుమతులు కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో అయితే లేదు. పీఎస్ఎల్-2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టుకు (కరాచీ కింగ్స్) చిరస్మరణీయ విజయాన్ని అందించిన ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్‌కు లీగ్ నిర్వహకులు మరీ అధ్వానంగా హెయిర్ డ్రైయర్‌ను బహుమతిగా ఇచ్చి అవమానించారు. హెయిర్ డ్రైయర్‌ను తీసుకునేందుకు విన్స్ చాలా మొహమాటపడ్డాడు. గల్లీ క్రికెట్లో కూడా వేల సంఖ్యలో విలువ చేసే వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తుంటే.. అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొనే పీఎస్ఎల్లో వెయ్యిలోపు విలువ చేసే హెయిర్ డ్రైయర్లను బహుమతిగా ఇవ్వడం బాధాకరమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. హెయిర్ డ్రైయర్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ పీఎస్ఎల్ నిర్వహకులు పబ్లిసిటీ కోసం పాకులాడటం మరీ వింతగా అనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న రాత్రి ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్పై కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పీఎస్ఎల్ చరిత్రలో ఇది మూడో భారీ ఛేదన. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు.మూడో ఫాస్టెస్ట్ సెంచరీసుల్తాన్స్తో మ్యాచ్‌లో విన్స్ చేసిన సెంచరీ పీఎస్ఎల్ చరిత్రలోనే మూడో వేగవంతమైన సెంచరీ. పీఎస్ఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉస్మాన్ ఖాన్ పేరిట ఉంది. 2023 సీజన్లో ఉస్మాన్ 36 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆతర్వాత రిలీ రొస్సో అదే సీజన్లో 41 బంతుల్లో శతక్కొట్టారు. పీఎస్ఎల్లో విన్స్ కంటే వేగవంతమైన సెంచరీలు ఈ ఇద్దరివే. టీ20ల్లో విన్స్‌కు ఇది ఏడో సెంచరీ కాగా.. ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌తో పోటీ పడి పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తున్న పాక్ క్రికెట్ బోర్డుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ కంటే తమ లీగే గొప్ప అని గప్పాలు కొట్టుకునే పీసీబీ, ఈ సారి పీఎస్ఎల్కు వస్తున్న ఆదరణ చూసి విస్తుపోతుంది. ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్ఎల్ మ్యాచ్‌లు చూసేందుకు జనాలు రావడం లేదు. స్వదేశంలోనే పీఎస్ఎల్కు ఆదరణ తక్కువ కావడం చూసి పీసీబీ అధికారులు అవాక్కవుతున్నారు. ఐపీఎల్‌తో పోటీ పడి తప్పు చేశామని లీగ్ ప్రారంభంలోనే వారు తెలుసుకున్నారు.కొద్ది రోజుల క్రితం హసన్ అలీ చెప్పినట్లు.. మంచి క్రికెట్ ఆడుతున్నా పాక్ అభిమానులు పీఎస్ఎల్ను పట్టించుకోవడం లేదు. లీగ్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) హోరాహోరీ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్.. ఛేదనలో జేమ్స్ విన్స్ విధ్వంసకర శతకాలు బాదారు.ఈ మ్యాచ్‌కు ముందు నిన్న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగింది. పెషావర్ జల్మీపై క్వెట్టా గ్లాడియేటర్స్ 80 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆతర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పెషావర్ 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఆమిర్ పెషావర్ పతనాన్ని శాశించారు.ఇలా, ఒకే రోజు రెండు రసవత్తర మ్యాచ్‌లు జరిగినా పాక్ అభిమానులు పీఎస్‌ఎల్‌వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు మ్యాచ్‌లు జరిగిన స్టేడియాలు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. రాత్రి జరిగిన ముల్తాన్, కరాచీ మ్యాచ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉండింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు పట్టుమని 10 వేల మంది కూడా రాలేదు. పాక్ మీడియా ప్రకారం.. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన జనం కంటే స్టేడియంలో సెక్యూరిటి గార్డులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు 5000 మంది స్టేడియానికి రాగా.. అక్కడ సెక్యూరిటి సిబ్బంది 6700 మంది ఉన్నారట. ఈ లెక్కలు చూస్తే చాలు పీఎస్ఎల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పవచ్చు.ఇలాంటి లీగ్ ఐపీఎల్‌కు పోటీ అని పాక్ క్రికెట్ బోర్డు గొప్పలు చెప్పుకోవడం చూసి క్రికెట్ అభిమానులు నవ్విపోతున్నారు. పీఎస్ఎల్కు ఐపీఎల్‌తో పోలికే లేదని అంటున్నారు. ఐపీఎల్లో ఓ మ్యాచ్ జరిగితే వేలు, కొన్ని సార్లు లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో మ్యాచ్‌లు వీక్షించే వారి సంఖ్య లెక్కలేనంతగా ఉంటుంది. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఐపీఎల్‌ను అత్యధిక సంఖ్యలో వీక్షిస్తారు. విదేశాల్లో వారి సొంత దేశ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. 2008 నుంచి ప్రతి సీజన్లో విజయవంతమైన ఐపీఎల్‌ను చూసి ఓర్వలేని పాక్.. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌తో సమాంతరంగా పీఎస్ఎల్ను నిర్వహించి చేతులు కాల్చుకుంది. -
ఒకే సమయంలో విధ్వంసకర శతకాలు.. ఐపీఎల్లో అభిషేక్.. పీఎస్ఎల్లో రిజ్వాన్, విన్స్
క్రికెట్ అభిమానులు శనివారం (ఏప్రిల్ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్.నిన్న సాయంత్రం సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్ జరుగుతుండగానే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరో సూపర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
అంతర్జాతీయ క్రికెట్లో గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. నిన్న (ఏప్రిల్ 12) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) డకౌటయ్యాడు. మొహమ్మద్ ఆమిర్ వేసిన అద్భుతమైన బంతికి బాబర్ బోల్తా పడ్డాడు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్ చేతిలో 80 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదర్కొంది.తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సౌద్ షకీల్ (59), ఫిన్ అలెన్ (53) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. హసన్ నవాజ్ (41), రిలీ రొస్సో (21 నాటౌట్), కుసాల్ మెండిస్ (35 నాటౌట్) రాణించారు. పెషావర్ బౌలర్లలో అలీ రజా, అల్జరీ జోసఫ్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (4-0-42-4) చెలరేగడంతో 15.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, ఉస్మాన్ తారిఖ్ తలో రెండు వికెట్లు తీయగా.. కైల్ జేమీసన్ ఓ వికెట్ పడగొట్టాడు. పెషావర్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. హుసేన్ తలాత్ (35), మిచెల్ ఓవెన్ (31) పర్వాలేదనిపించారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ సహా ఐదుగురు డకౌట్ అయ్యారు. బాబర్‌తో పాటు టామ్ కొహ్లెర్ కాడ్మోర్, మ్యాక్స్ బ్రయాంట్, అల్జరీ జోసఫ్, మొహమ్మద్ అలీ ఖాతా తెరవలేకపోయారు.కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఐపీఎల్‌కు పోటీగా ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ఐపీఎల్‌తో సమాంతరంగా జరుగుతుండటంతో పీఎస్ఎల్కు స్వదేశంలోనే ఆదరణ కరువైంది. ఈ లీగ్‌ను వీక్షించే నాథుడే లేకుండా పోయాడు. విదేశీ స్టార్లంతా ఐపీఎల్లో బిజీగా ఉంటే, ఐపీఎల్లో అమ్ముడుపోని వారు, వెటరన్లు పీఎస్ఎల్లో ఆడుతున్నారు. పీఎస్ఎల్ ఎప్పుడూ జరిగినట్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగి ఉంటే స్వదేశంలోనైనా ఆదరణ ఉండేది. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే పీఎస్ఎల్ కూడా జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులంతా క్యాష్ రిచ్ లీగ్‌కే ఓటేస్తున్నారు. ఐపీఎల్లో మ్యాచ్‌లు రసవ్తరంగా సాగుతుండటంతో క్రికెట్ ప్రేమికులు పీఎస్‌ఎల్‌వైపు కన్నేత్తి చూడటం లేదు. -
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025