May Day
-
కార్మికుల గొప్పతనం చెబుతున్న రాజేష్
-
వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: సమ్మె యోచనలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన వీడాలని.. ఏదైనా సమస్యలు ఉంటే చర్చిద్దామని.. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని అన్నారాయన. రవీంద్రభారతిలో గురువారం జరిగిన మేడే ఉత్సవాలలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మంత్రితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.అణా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్లేది లేదు. అంతా మీ కోసమే ఖర్చు చేస్తాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు అండగా ఉంటా అని సీఎం రేవంత్ ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి అన్నారు. ఇంకా ఆయన మే డే ప్రసంగంలో ఏం చెప్పారంటే.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకం. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకువెళుతున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే మీ సహకారం ఎంతో ఉంది.సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చింది. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కార్మికులకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం. అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోందిగత పదేళ్లలో విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారు.రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలింది. ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి. కపటనాటక సూత్రధారి(కేసీఆర్‌ను ఉద్దేశించి..) మళ్లీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు అని రేవంత్ ప్రసంగించారు. -
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు.#MayDay #InternationalLabourDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025 -
కష్ట జీవులకు ఝలక్!
సాక్షి, అమరావతి: భవన నిర్మాణ, ఇతర అంసఘటిత రంగ కార్మికులు, కూలీల జీవితాలు కొద్ది నెలలుగా దుర్భరంగా మారాయి. అరకొర పనులు, అప్పుల బాధలు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బు పుట్టక బతుకు భారంగా ఈడుస్తున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కోట్ల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ అలవిగాని హామీల వర్షం కురిపించి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలకు సైతం గండి కొట్టింది. కార్మిక శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.80 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. లెక్కల్లోకి రాని వారు మరికొన్ని లక్షల్లో ఉంటారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు ఉన్నారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలప్పుడు భవన నిర్మాణ బోర్డ్‌ను పునరుద్ధరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేస్తాం’ అని కూడా హామీ ఇచ్చారు. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సాయం ఇలా» వైఎస్సార్ కళ్యాణమస్తు కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష.. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీల కులాంతర వివాహాలకు రూ.75 వేలు, షాధీ తోఫా కింద ముస్లింలకు రూ.1 లక్ష.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు చొప్పున అందించారు. » వైఎస్సార్ బీమా పథకం కింద ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, సహజ మరణాలకు రూ.లక్ష, వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. » రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ.2.5 లక్షలు ఇచ్చారు. » జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఇంటర్మీడియట్ వరకూ రూ.15 వేలు ఇచ్చారు. ఆపై ఉన్నత విధ్యకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మద్దతుగా నిలిచారు. వసతి దీవెన కింద ఇంజినీరింగ్, డిగ్రీ చదివే పిల్లలకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున సాయం అందించారు.» అసంఘటిత రంగ కార్మిక కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యంబారిన సందర్భాల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించారు. పేరు మార్పు తప్ప సాయం లేదు» అసంఘటిత రంగ కార్మికులు, ఇతర బలహీన వర్గాల కుటుంబాల్లోని వ్యక్తుల సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.10 లక్షలు బీమా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వంలో అమలైన వైఎస్సార్ బీమా పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.» దీంతో సంపాదించే వ్యక్తి మరణించిన, అంగ వైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద 81 వేల కుటుంబాలకు రూ.876 కోట్ల మేర సాయం అందింది. ఈ ప్రభుత్వంలో అది పూర్తిగా నిలిచిపోయింది. » చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే ఈ పథకాలన్ని ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి కనీస భరోసా కరువై కార్మికుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. పిల్లల చదువులు, ఆడ బిడ్డల పెళ్లిళ్లు, అనారోగ్యం, ఇతర అవసరాలకు ప్రభుత్వం నుంచి సాయం లేక ఎన్నో అగచాట్లు పడుతున్నారు. » రాష్ట్రంలో భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం గత వైఎస్ జగన్ ప్భుత్వం నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందించింది. వారి బిడ్డల విద్యకు ఊతమిచ్చింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ పథకాల కింద ఉచిత వైద్య సేవలతో ఆరోగ్యాలకు భరోసాగా నిలిచింది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా.. ఉపాధి కోల్పోయే ఆ కుటుంబానికి బీమా ద్వారా ధీమా కల్పించింది. అమ్మ ఒడి, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, చేదోడు, భరోసా, వాహన మిత్ర ఇలా డీబీటీ, నాన్‌డీబీటీ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అరకొర పనులే కొన్నేళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక అని ఆర్భాటం చేశారు. వాస్తవానికి ఇసుక ఉచితంగా దొరకడం లేదు. సిమెంట్, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త నిర్మాణాలకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. వారం అంతా పని దొరకడం గగనంగా మారింది. దీంతో కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. – టి.నాగబాబు, సంతజూటూరు, నంద్యాల జిల్లాఆగిన ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో మా ఊర్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వాటిలో వేలల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దీంతో బయటకు ఎక్కడికి వెళ్లే పని లేకుండా ఊర్లోనే పనులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. పెయింటింగ్, ఉడ్వర్క్స్, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై ఈ ప్రభావం పడుతోంది. వారాలు, నెలల తరబడి ఇంటి పట్టునే ఉంటే మా కుటుంబాలు ఎలా గడుస్తాయి? నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడం కూడా కష్టమవుతోంది. – ఆదాం, పెయింటర్, కృష్ణా జిల్లాఆదుకునే పథకాలేవీ? రోజూ ఉదయాన్నే బెంజ్ సర్కిల్ అడ్డా మీదకు పని కోసం వస్తాను. వారంలో మూడు రోజులు పని దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. గతంలో ఈ పరిస్థితులు లేవు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల చదువులు భారంగా మారాయి. గతంలో అమ్మ ఒడి, వసతి దీవెన కింద సాయం అందేది. ఇప్పుడు ఆదుకునే ఆ పథకాలు కూడా లేకుండా పోయాయి. – వెంకటేశ్, తాపీ మేస్త్రీ, విజయవాడ -
May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.! -
కార్మికులంతా ఒక్కటవ్వాలి!
కార్మికుల పండగ దినం ‘మే డే’. ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే 1వ తేదీని జరుపుకొంటారు. 1886 ముందు కార్మికులు వెట్టి చాకిరితో మగ్గిపోతూ రోజుకు 18 గంటల పాటు పనిచేసేవారు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగ రంలో జరిగిన కార్మికుల ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణకాండను ప్రపంచమంతా ఖండించింది. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల ద్వారా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే హక్కును కార్మికులు దాదాపు అన్ని దేశాల్లోనూ సాధించు కున్నారు. ఈ విజయానికి సూచిక గానే మే డేని జరుపుకుంటున్నారు కార్మిక సోదరులు. భారతదేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలు జరి పిన పోరాటాల ఫలితంగా వెట్టి చాకిరీ నిర్మూలన జరిగింది. వేతన సవరణకు సంబధించిన ఒప్పందాలకు అంకురార్పణ జరిగింది. సెలవులు, ఇంక్రిమెంట్లతోపాటు కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పని ప్రదేశంలో సాధించడంలో కొంతవరకు కృత కృత్యులమయ్యాము. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంకానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మళ్లీ వారిని పాత కాలపు కష్టాల పాలు చేయడానికి ప్రయత్ని స్తున్నాయి. కేంద్రం కార్మిక చట్టాలన్నంటినీ నాలుగు కోడ్ల కిందికి తీసుకురావడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్ని ఆందో ళనలు చేపట్టినా ప్రభుత్వ పెద్దలఆలోచనా విధానంలో మార్పు రానందున మే 20వ తేదీనాడు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్లమీదికి వచ్చి ఉద్యమం చేయనున్నది. మే డే స్ఫూర్తితో కార్మిక లోకం ఉవ్వెత్తున ఎగసిపడనున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారు. అందుకే ఆయన మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు.కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వారికి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అనేక ప్రయోజనాలు కలుగ జేసింది. ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న ఉద్యోగులను పర్మినెంట్ చేశారు నాటి సీఎం జగన్. ఇదే తరుణంలో ఆటో కార్మికులకు రూ. 10,000, దర్జీలు, దోబీలు, నాయి బ్రాహ్మణులు, బెస్త కార్మికులు వంటివారికీ 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయ టం తెలిసిందే. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకూ కృషిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తలంచితే దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు జగన్. అసెంబ్లీలో ప్రైవేటీకర ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన కార్మికుల పక్షపాతి జగన్. ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలూ ఖండించాలి. మే డే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగవలసిన అవసరం ఉంది.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుమొబైల్: 98481 05455(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే) -
మే డే: ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసిన పరుచూరి గోపాలకృష్ణ (ఫొటోలు)
-
ఠంఛన్‌గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్‌కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్‌లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్‌కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్‌ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్‌కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు
ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్ క్లాప్ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్ క్లాప్ వారికి బాత్రూమ్ల క్లీనింగ్ కోసం కాల్ చేస్తే వాళ్లు ఒక్కో బాత్రూమ్కు ఇంతని చార్జ్ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్రూమ్లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్ క్లీన్ చేయాలంటే కూడా ఒక చార్జ్ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్ కడిగి, స్టవ్ రుద్ది క్లీన్ చేస్తుంది. ఆ చార్జ్ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్ మెథడ్: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్మెంట్ కాస్ట్ మెథడ్: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్ క్లాప్ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్పుట్/అవుట్‌పుట్ కాస్ట్ మెథడ్: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు. దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు. ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి. -
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్‌తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే)