ఆగిఉన్న బస్సును ఇసుక లారీ ఢీకొట్టడంతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. మరో ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంలో జరిగింది. నందికోట్కూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెల్టూరు సమీపానికి రాగానే ముందు టైర్ పంక్చర్ అయింది. దీంతో సిబ్బంది టైరు మార్చడానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు రోడ్డు పక్కన వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇసుక లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు వెనక సీట్లో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కర్నూలు కు చెందిన వీరన్న(35) అనే వ్యక్తి మృతిచెందాడు.