
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి మధ్యంతర పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణలో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి, ఆర్‌బీఐ వాదనలు వినిపించాయి.
విచారణ సందర్భంగా రామోజీ మృతి చెందారు.. విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తెలంగాణ సర్కార్ సైతం దాదాపు ఇదే వాదనలు వినిపించింది.
అదే సమయంలో మార్గదర్శి సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించింది. రామోజీ ఉన్నా, లేకున్నా విచారణ కొనసాగించాల్సిందేనని ఆర్‌బీఐ పట్టుబట్టింది. ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ మార్చి7కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.