
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వర్గల్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. వారం రోజుల కిందట ఎల్కతుర్తి వద్ద బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా హుస్నాబాద్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వర్గల్ మండలం తున్కిమక్తకు చెందిన చాకలి కనకయ్య(36) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య సుజాత, పదేళ్లలోపు శాన్వికా, హన్వికా కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరా జు పాల్గొని మృతుడి కుటుంబీకులను ఓదార్చి రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు.