
● బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌లో సందడి ● గత నెల 28న మా
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌లో మామిడికాయల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గత నెల 28న మార్కెట్‌ను లాంఛనంగా ప్రారంభించగా చిన్న, సన్నకారు రైతులు మార్కెట్‌లో మామిడికాయల అమ్మకాలు సాగిస్తున్నారు. రోజువారీగా క్వింటాళ్ల కొద్ది మామిడికాయలు మ్యాంగో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి తదితర రకాల మామిడి కాయలు లభిస్తున్నాయి. స్థానిక ట్రేడర్స్‌తో పాటు నాగ్‌పూర్‌కు చెందిన బడా వ్యాపారులు కొందరు కమీషన్ ఏజెంట్లను పంపించి కాయల కొనుగోళ్లు చేపడుతున్నారు. కొనుగోలు చేస్తున్న మామిడి కాయలను మార్కెట్‌లో కూలీలతో గ్రేడింగ్ చేయించి బాక్స్‌ల్లో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి నాగ్‌పూర్, అమరావతి, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అమ్మకం, కొనుగోలు దారులతో మ్యాంగో మార్కెట్ సందడిగా మారింది. స్థానికంగా మామిడి కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతాంగానికి రవాణా భారం గణనీయంగా తగ్గింది.
దళారుల ప్రమేయం లేకుండా..
మామిడి రైతులు దశాబ్దాల నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి మామిడి కాయల అమ్మకాలు సాగించేవారు. అక్కడ బడా వ్యాపారులు, దళారులు కుమ్మకై ్క మద్దతు ధర దక్కకుండా చేసి రైతులను తీవ్రంగా వంచించేవారు. మార్కెట్ ఆవరణలోకి మామిడికాయలతో అడుగు పెడితే చాలు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్‌కు శిస్తు కట్టడంతో పాటు పంట ఉత్పత్తులు అమ్మి పెట్టినందుకు దళారికి కమిషన్ చెల్లించుకోవాల్సి వచ్చేది. కానీ బెల్లంపల్లి మార్కెట్‌లో దళారుల ప్రమేయం లేకుండా, మోసాలకు తావులేకుండా పంటను అమ్ముకునే సౌకర్యం కలిగింది. మద్దతు ధర లేకుంటే పంటను మరోప్రాంతానికి తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ మామిడి కాయల క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మ్యాంగో మార్కెట్‌కు కళ వచ్చింది.
మామిడి కాయలను తూకం వేస్తున్న సిబ్బంది
మార్కెట్‌లో కాయలను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు
గత ఆరురోజుల్లో మామిడికాయల విక్రయాల వివరాలు..
మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన మామిడికాయలు 3,000 క్వింటాళ్లు
చెల్లించిన మద్దతు ధర రూ.21,000 (కనిష్టం), రూ.53,000 (గరిష్టం)
అమ్మకానికి తెస్తున్న మామిడి రకాలు దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి
పంట అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు 165 మంది
మద్దతు ధర కల్పించాలి
మామిడి తోటలపై ఎన్నో ఆశలు పెంచుకున్న రైతులకు ఏటా మద్దతు ధర దక్కడం లేదు. వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసి పంట నేలపాలై నష్టపోతున్నాం. మరోవైపు మద్దతు ధర రాక మరిన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. రైతులు నష్టాల పాలు కాకుండా మామిడికి గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– రాజన్న యాదవ్, రైతు, పొట్యాల
కోరిక నెరవేరింది..
మ్యాంగో మార్కెట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. ఇప్పటివరకు నాగ్‌పూర్‌కు పంటను తీసుకెళ్లి నష్టాల పాలయ్యాం. రవాణా చార్జీలు భారంగా ఉండేవి. కానీ ప్రస్తుతం బెల్లంపల్లి మార్కెట్ ఆ బాధలు తప్పాయి. నాగ్‌పూర్ మార్కెట్ కన్నా బెల్లంపల్లి మార్కెట్ చాలా నయం.– బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి

● బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌లో సందడి ● గత నెల 28న మా

● బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్‌లో సందడి ● గత నెల 28న మా