
నరేందర్‌కు శ్రమశక్తి అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో విధులు నిర్వర్తిస్తున్న రాంశెట్టి నరేందర్‌ను మేడే సందర్భంగా ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రబారతిలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు. తనకు సహకరించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్‌ప్రసాద్, నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.