Usha Vance
-
తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్
ఆగ్రా/జైపూర్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం తాజ్ మహల్‌ను సందర్శించింది. తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం తాజ్ మహల్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. తాజ్ మహల్ అంతటా కలియదిరిగారు. ఓ గంటపాటు ఆ అద్భుత నిర్మాణాన్ని వీక్షించారు. సందర్శన అనంతరం ‘తాజ్ మహల్ ఓ అద్భుతం. నిజమైన ప్రేమకు, మానవ నైపుణ్యానికి నిదర్శనం’అని వాన్స్ సందర్శకుల డైరీలో రాశారు. అంతకుముందు జైపూర్ నుంచి ఆగ్రా విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. వారు ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ వరకు కారులో ప్రయాణించారు. వారి కాన్వాయ్ మార్గం వెంబడి ఉన్న మార్గాలను ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది పాఠశాల పిల్లలు వీధుల్లో నిలబడి, అమెరికా–భారత్‌ల జాతీయ పతాకాలను ఎగురవేశారు. తాజ్ మహల్ దారి పొడవునా రంగురంగుల ముగ్గులు, ఇసుకతో బొమ్మలు సహా వివిధ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. వాన్స్ కుటుంబానికి స్వాగతం పలుకుతూ పలు చోట్ల భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. హైప్రొఫైల్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన అనంతరం వాన్స్ కుటుంబం జైపూర్‌కు తిరిగి వచ్చింది. ముందే షెడ్యూల్ అయిన జైపూర్ సిటీ ప్యాలెస్ పర్యటనను వారు రద్దు చేసుకుని, నేరుగా రామ్ బాగ్ ప్యాలెస్‌కు వెళ్లారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్లనుంది. -
అంబర్ కోట అదరహో.. వాన్స్ ఫ్యామిలీకి పుష్ప, చందా స్వాగతం
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కుటుంబ సమేతంగా మంగళవారం జైపూర్‌లోని అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబ సభ్యులకు యూనెస్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ వద్ద రాజస్థానీ సంప్రదాయంలో ఘన స్వాగతం లభించింది. హతీ గావ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన చందా, పుష్ప అనే ఏనుగులు వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికగా.. పలువురు నృత్యాలతో అలరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబుల్ సమేతంగా నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పింక్ సిటీ జైపూర్ పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం.. అంబర్ కోటతో పాటు హవా మహల్, జంతర్ మంతర్‌ను సైతం సందర్శించనుంది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎర్ర ఇసుక రాయి, పాలరాతితో ఉన్న అంబర్ పోర్ట్‌ను ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తుంటారు. రాజా మాన్ సింగ్ 16వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. #WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children welcomed at Jaipur's Amber Fort. pic.twitter.com/bhFxFOLrHW— ANI (@ANI) April 22, 2025ఇక.. ఈ పర్యటనలో ఆ రాష్ట్ర గవర్నర్ హరిబావు కిషన్రావ్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఇచ్చే ఆతిథ్యం వాన్స్ కుటుంబం స్వీకరించనుంది. రాజస్థాన్ ఇంటర్నేషన్ సెంటర్లో(RIC)లో దౌత్యవేత్తలు, మేధావులను ఉద్దేశించి అమెరికా-భారత్ సంబంధాలపై జేడీ వాన్స్ ప్రసంగించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో జైపూర్ అలర్ట్ అయ్యింది. ప్రముఖులు బస చేసే రామ్‌బాగ్ ప్యాలెస్‌లో వాన్స్ కుటుంబం దిగగా.. అక్కడ కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం భారత్‌కు చేరుకున్న వాన్స్ కుటుంబం.. న్యూఢిల్లీలో బస చేసింది. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాలపై జేడీ వాన్స్ చర్చించారు. అనంతరం వాన్స్ కుటుంబానికి ప్రధాని మోదీ ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలతో మోదీ సరదాగా గడిపారు. బుధవారం వాన్స్ కుటుంబం ఆగ్రాను సందర్శించనుంది. గురువారం ఉదయం తమ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరనున్నారు. -
భారత పర్యటనలో ఆంధ్రా అల్లుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులు
US Vice President JD Vance Tour Updates..అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన జేడీ వాన్స్ దంపతులుభారత్లో పర్యటిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషఈ సందర్భంగా ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న జేడీవాన్స్ కుటుంబ సభ్యులుDelhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, visited Akshardham Temple.(Source: Akshardham Temple) pic.twitter.com/eQrvqWpol5— ANI (@ANI) April 21, 2025 అక్షర్ధామ్ టెంపుల్‌కు జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి అక్షర్ధామ్ టెంపుల్ చేరుకున్న జేడీ వాన్స్భారీ భద్రత మధ్య అక్షర్ధామ్ టెంపుల్‌కు జేడీ వాన్స్ #WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, reach Akshardham Temple. pic.twitter.com/y0D2zp1lBi— ANI (@ANI) April 21, 2025 భారత్ చేరుకున్న జేడీ వాన్స్..👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్‌కు చేరుకున్నారు. భారత్‌లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వాన్స్.. సోమవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం దిగారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. 👉కాగా, వాన్స్ వెంట ఆయన సతీమణి ఉషా వాన్స్, ముగ్గురు పిల్లుల కూడా వచ్చారు. జేడీ వాన్స్ పిల్లులు.. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఎయిర్‌పోర్టులో భారత శాస్త్రీయ నృత్యంతో వారికి సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో వారు ఢిల్లీలోని అక్షర్ధామ్ టెంపుల్‌కు వెళ్లనున్నారు.#WATCH | Delhi: Visuals from the Akshardham Temple where Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, will visit shortly.Akshardham Temple Spokesperson Radhika Shukla says, "The Vice President and the Second Lady are coming… pic.twitter.com/yEKwdZemVj— ANI (@ANI) April 21, 2025👉అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. వాన్స్‌కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం వాన్స్ దంపతులు, అమెరికా అధికారులకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance arrive at Palam airport. pic.twitter.com/iCDdhYLVdz— ANI (@ANI) April 21, 2025👉విందు అనంతరం సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపురకు వెళ్తారు. అక్కడ విలాసవంతమైన రాంభాగ్ ప్యాలెస్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. అందులో అంబర్ కోట కూడా ఉంది. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ హయాంలో భారత్, అమెరికా సంబంధాలపై మాట్లాడతారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1— ANI (@ANI) April 21, 2025👉ఈనెల 23వ తేదీ(బుధవారం) ఉదయం వాన్స్ కుటుంబం ఆగ్రాకు వెళ్లనుంది. అక్కడ తాజ్ మహల్‌ను, భారతీయ కళలకు సంబంధించిన శిల్పాగ్రామ్‌ను సందర్శిస్తారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత మళ్లీ వారు జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు.#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children welcomed at Palam airport. Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/ocXCXOdmgQ— ANI (@ANI) April 21, 2025 -
వాన్స్ భారత పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య, తెలుగమ్మాయి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఉన్నత స్థాయి అధికారుల బృందంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారని ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలను చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్ యంత్రాంగం టారిఫ్‌ల మోతెక్కిస్తూ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాన్స్, సెకండ్ లేడీ ఉష తమ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లతో కలిసి జైపూర్, ఆగ్రాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని వెల్లడించింది. వాన్స్ పర్యటనలో అధికారిక కార్యక్రమాలున్నా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుందని సమాచారం. ఉష వాన్స్ తెలుగమ్మాయి అన్నది తెలిసిందే. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అమె రికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. -
డెన్మార్క్‌ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
గ్రీన్లాండ్: ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి గ్రీన్లాండ్లో పర్యటించారు. డెన్మార్క్‌తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్ లేదని అన్నారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్లాండ్లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. -
గ్రీన్‌ల్యాండ్‌కు జేడీ వాన్స్ పర్యటన.. పొలిటికల్ టెన్షన్
వాషింగ్టన్: డెన్మార్క్‌లో స్వయంప్రతిపత్తి గల ‘గ్రీన్‌ల్యాండ్’ను కొనేందుకు సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ డెన్మార్క్ ప్రభుత్వానికి మరింత కోపం తెప్పించేలా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రవర్తించారు. అనధికార పర్యటనలో భాగంగా గ్రీన్‌ల్యాండ్‌కు వాన్స్ భార్య ఉషా గురువారం వెళ్లి శనివారం తిరిగిరానున్నారు. అయితే భార్యతో వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని వాన్స్ మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ల్యాండ్ అంశాన్ని ప్రస్తావించారు.ఈ క్రమంలో వాన్స్ మాట్లాడుతూ..‘భార్య ఒక్కతే ఆనందంగా ఉంటే సరిపోతుందా. నేను కూడా ఆమెతోపాటు గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్తా. గ్రీన్‌ల్యాండ్ పర్యటనలో భాగంగా అక్కడి వాయవ్య పిటిఫిక్ భూభాగంలోని అమెరికా వైమానిక స్థావరాన్ని సందర్శిస్తా. అధ్యక్షుడు ట్రంప్ తరఫున మాట్లాడుతున్నా. గ్రీన్‌ల్యాండ్ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రీన్‌ల్యాండ్ భద్రత అనేది పరోక్షంగా యావత్ ప్రపంచ భద్రతకు సంబంధించింది’ అని అన్నారు.దీంతో డెన్మార్క్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘ప్రైవేట్‌గా లేదంటే ప్రభుత్వం తరఫున ఎవరినీ మా దేశంలోకి అనుమతిస్తూ ఆహ్వానాలు పంపలేదు’ అని గ్రీన్‌ల్యాండ్ సర్కార్ ఫేస్బుక్లో ఒక పోస్ట్పెట్టింది. ‘పిలవకుండా వచ్చి మమ్మల్ని అనవసర ఒత్తిడికి గురిచేయాలని అనుకుంటున్నారు’ అని డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సిసిమియట్ పట్టణంలోని అవన్నాటా క్విమిసెర్సూ శునకాల స్లెడ్జ్ బండ్ల పరుగుపోటీని, గ్రీన్‌ల్యాండ్ సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించేందుకు అక్కడ పర్యటిస్తానని ఉషా గతంలో చెప్పడం తెలిసిందే. గ్రీన్‌ల్యాండ్‌లో లిథియం వంటి ఖనిజ నిల్వలు అపారం. వీటిని దక్కించుకునేందుకు ట్రంప్ కుయుక్తులు పన్నారని డెన్మార్క్ ప్రభుత్వం గతంలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంలో డెన్మార్క్‌కు నాటో సభ్య దేశాలు సైతం మద్దతు పలికాయి. JD Vance announces he’s going to Greenland with his wife Usha.Nobody wants her or you there, bro.pic.twitter.com/IowQstwafx— Art Candee 🍿🥤 (@ArtCandee) March 25, 2025 -
ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్‌లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్‌తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్‌లో జరిగిన తప్పిదం ఏంటంటే..డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు. Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్‌గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న క్రేజ్) -
‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.