Siva Balaji
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)
-
త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. (ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. -
ఆ యూట్యూబర్‌పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ప్రణీత్ హనుమంత్ కి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు..
-
ట్రోలర్స్ కి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన మా సభ్యులు
-
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
మీడియా వాళ్ళు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి
-
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు
'మా ఊరి పొలిమేర' కరోనా సమయంలో హాట్‌స్టార్ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేంద్ మౌళి, బాలాదిత్య తదితరులు నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. భారీ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బన్నీవాసు, హీరో కార్తికేయ హాజరయ్యారు. వారందరి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్షుద్రపూజల చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. మొదటి భాగంలో భారీ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు 'మా ఊరి పొలిమేర 2' సీక్వెల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు పెట్టారో ట్రైలర్లోనే తెలిసిపోతుంది. నవంబర్ 3న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈసారి మాత్రం ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లే చూడాలి. ఆ తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారు. -
దీపావళికి నేను ఎందుకు దూరంగా ఉన్నానంటే..!
-
ఇలాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టం..!
-
డబ్బు పిచ్చి కన్నా పెద్ద జబ్బు ఏది లేదు
-
ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం అదే అంటున్న శివ బాలాజీ
-
మా అమ్మ కారణంగా నేను నా జీవితాన్ని ద్వేషిస్తున్నాను: శివ బాలాజీ
-
దిల్లీ టూర్లో మధుమిత- శివబాలాజీ కపుల్స్ (ఫొటోలు)
-
నాన్న చనిపోయాక అప్పు తీర్చలేక ఆస్తులమ్మేశాం: శివ బాలాజీ
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శివబాలాజీ. ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీతో వెండితెరకు పరిచయమయ్యాడు శివబాలాజీ. తండ్రి వ్యాపారవేత్త అయినా శివబాలాజీ మాత్రం నటన అంటే ఆసక్తి ఉండటంతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తక్కువ కాలంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. చందమామ, శంభో శివ శంభో, ఆర్య వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల తన భార్య మధుమితతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైన శివబాలాజీ తన కష్టనష్టాలను చెప్పుకొచ్చాడు. 'నాన్న చనిపోయాక తన బిజినెస్ చూసుకునేవాళ్లు ఎవరూ లేరు. అమ్మకు ఏం తెలియదు, తమ్ముడు ఇంకా చిన్నవాడు. నెమ్మదిగా బిజినెస్ డౌన్ అవటం, బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు వడ్డీ పెరగడం మొదలైంది. అప్పుడు నేనే వెళ్లి మిషనరీలు, ఉన్న స్థలాలు.. ఇలా కొన్ని ఆస్తులమ్మేసి ఆ డబ్బుతో అప్పు కట్టేశాను. ఆ తర్వాత నేను కూడా బిజినెస్ చేసి చాలా మోసపోయాను. ఈము పక్షులు పెంపకం గురించి విని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందని తెలిసి వాటిని పెంచాం. 1500 పక్షులను పెంచాను. కేవలం వాటి తిండికే నెలకు రూ.5 లక్షల దాకా అయ్యేది. ఆ తర్వాత అదంతా స్కామ్ అని తెలిసింది. సబ్బులు, పెయిన్ రిలీఫ్ ఆయిల్.. ఇలా అన్నీ చేశాం. కానీ ఆ స్టాక్ అమ్ముడుపోక మిగిలిపోయేవి. దీంతో ఆ వ్యాపారమూ మూసేశాం. స్నేహమేరా జీవితం సినిమా కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టి అక్కడా నష్టపోయాను' అని చెప్పుకొచ్చాడు శివ బాలాజీ పిల్లలను స్కూల్ మాన్పించేసిన ఘటన గురించి మధుమిత మాట్లాడుతూ.. 'కోవిడ్ సమయంలో స్కూలు ఫీజులు ఎంతమేరకు ఉండాలనేది ఒక జీవో వచ్చింది. మా పిల్లల స్కూల్లో అంతకంటే ఎక్కువ ఫీజు ఉంది. అప్పటికే ఆ స్కూల్లోని విద్యార్థుల పేరెంట్స్ గేటు బయట ధర్నా చేద్దామంటూ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. కోవిడ్ సమయంలో ధర్నా వద్దు, స్కూల్ యాజమాన్యంతోనే మీరొకసారి మళ్లీ మాట్లాడితే సరిపోతుంది అని ఒక మెసేజ్ పెట్టాను. నా మాట విని వాళ్లంతా ధర్నా ఆపేశారు. అయితే రేప్పొద్దున నేనేది చెప్పినా అంతా వింటారని అనుకున్నారో ఏమో కానీ స్కూల్ యాజమాన్యం మా పిల్లలను తీసేసింది. వారం రోజుల్లో పరీక్ష ఉండగా ఒక్క మాట కూడా చెప్పకుండా తీసేశారు. అప్పటికీ మేము ఫీజంతా కట్టేశాం. అయినా మేం ఏ తప్పూ చేయకపోయినా అలా ప్రవర్తించారు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. అప్పటి క్షణాలను తలుచుకుంటూ.. -
చిన్న రూమ్ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ
ఆర్య, చందమామ, శంభో శివ శంభో లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శివబాలాజీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక 2009లో నటి మధుమితను ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో నటిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలతో పడ్డ కష్టాలను వెల్లడించాడు. ‘మా నాన్న చెన్నైలో ఓ కంపెనీ రన్ చేస్తుండేవాడు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు కొన్నాళ్ల పాటు నేను చూసుకున్నాను. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) అయితే సినిమాలపై నాకున్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్ రావాలనుకున్నాను. నేను ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టంలేదు. చెన్నైలోనే ఉండి బిజినెస్ చూసుకోవాలని ఆయన కోరిక. కానీ నాకు మాత్రం బిజినెస్ నచ్చలేదు. హైదరాబాద్‌కి వచ్చాన కొన్నాళ్ల పాటు సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నించాను. ఓ సారి నాన్నకు ఫోన్ చేస్తే.. ‘అక్కడే ఉండు’అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు. షూటింగ్ అయ్యాక చిన్న రూమ్‌ని రెంట్‌కి తీసుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి కానీ సినిమా అవకాశాలు రావట్లేదు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. మేల్కొని ఉంటే ఎక్కడ ఆకలి అవుతుందోనని త్వరగా పడుకొని లేటుగా నిద్ర లేచేవాడిని. మంచి నీళ్లు తాగుతూ గడిపిన రోజులు ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు చాలా కష్టపడ్డాను. నా బాధలు చూసి అమ్మని నా దగ్గరికి పంపించాడు నాన్న. ఆ తర్వాత ఓ పెద్దింటికి షిఫ్ట్ అయ్యాం’ అంటూ శివ బాలాజీ ఎమోషనల్ అయ్యాడు. -
పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ
టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా కాలేదని చెబుతుంది ఈ జంట. పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడట. మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతోనే అలా చేశాడట. ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది ఈ జంట. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్ ) మధుమిత మాట్లాడుతూ.. ‘దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు శివ బాలాజీ ఫోన్ చేసి ‘మనకు సెట్ అవ్వదు. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు. ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశాను. మనం ఫ్రెండ్స్‌గా ఉందామని బాలాజీ చెప్పినా నో చెప్పాను. ఎందుకంటే అతన్ని నేను భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లోవాళ్లు జాతకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ అత్తమ్మ వాళ్లు జాతకాలను నమ్ముతారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బాలాజీ టచ్‌లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పుడు జాతకాలు చూపిస్తే.. బాగున్నాయని చెప్పారు. అప్పుడు మా పెళ్లి జరిగింది’ అని మధుమిత చెప్పుకొచ్చింది. ఇక శివ బాలాజీ మాట్లాడుతూ.. మధమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఒక్క ఏడాది చూస్తా.. అప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోతే.. ఎలాగైనా ఇంట్లో వాళ్లని ఒప్పిద్దామనుకున్నాను. ఆమెకు ఎన్ని సంబంధాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని తెలిసింది. మా ఎలక్షన్ల సమయంలో మధుని మళ్లీ కలిశా. మాట్లాడలేదు. ఒకరోజు ‘మళ్లీ ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు’అని నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలిసి.. కొన్నాళ్లకు ఇంట్లో ఒప్పించాం’ అని శివబాలాజీ చెప్పుకొచ్చాడు. -
ఆర్య సినిమా చేయనన్నాను, ఎందుకంటే?: శివ బాలాజీ
బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్ గారు ఆర్య ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆర్య తర్వాత మల్టీస్టారర్ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్ రాదని ఫిక్సయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్‌కు వెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా.. బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా -
ఆ సినిమాతో రూ.2 కోట్లు నష్టపోయా: శివ బాలాజీ
శివ బాలాజీ అంటే టాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో ఆయన నటించారు. 'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ ఆ తర్వాత సినీ రంగంపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. చందమామ, శంభో శివశంభో, ఆర్య, అన్నవరం, టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రాలతో గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ బాలాజీ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పంత్ కోసం ప్రార్థించండి'.. ఊర్వశి రౌతేలా మదర్ పోస్ట్ వైరల్.) శివ బాలాజీ మాట్లాడుతూ.. ' నా ఫ్రెండ్స్ ద్వారా ఈము పక్షుల పెంపకం గురించిన విన్నా. దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుందని చెప్పారు. ఆ తర్వాత నేను ఈము పక్షుల పెంపకం మొదలుపెట్టా. దాదాపు 500 ఈము పక్షులతో యూనిట్ ప్రారంభించాం. దాదాపు ఒక నెలకు వాటికోసం రూ.5 లక్షలు ఖర్చు చేసేవాన్ని. కానీ ఆ తర్వాత మాకు తెలిసింది అదంతా ఓ స్కామ్ అని. కానీ ప్రభుత్వం మీట్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిందని చెప్పారు. దీనికి తగినంత మార్కెట్ దొరకలేదు. ఆ తర్వాత పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ వ్యాపారం మొదలెట్టాం. ఇది కూడా పెద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను స్నేహమేరా జీవితం సినిమా చేశా. కానీ పెద్దగా మార్కెట్ చేయలేదు. మూవీ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేశా. ఈ ప్రభావం నాపై ఎక్కువగా పడింది. లోలోపల చాలా ఫీలయ్యా. నా వల్ల అందరూ బాధపడ్డారని భావించా. నా వల్ల అందరూ ఫెయిల్ అయ్యారని తీవ్ర నిరాశకు గురయ్యా. నా భార్య మధుమిత వల్లే నేను మళ్లీ నార్మల్ అయ్యా.' అని అన్నారు. -
శివబాలాజీ సిందూరం టీజర్ వచ్చేసింది..
శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సిందూరం. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ... సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించాము. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవరాల్‌గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హై ఇంటెన్షన్ సిందూరం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది' అని తెలిపారు. చదవండి: కృష్ణంరాజు కోసమే కైకాల ఆ పనికి ఒప్పుకున్నారు: శ్యామలా దేవి -
రాజ్ ఎలిమినేట్, అంధురాలి పెన్షన్‌తో ఐదేళ్లు బతికామన్న ఆది!
Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ఫుల్ జోష్ మీదున్నారు. వారి జోష్ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గొంతును గుర్తుపట్టడం డెడ్ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు. మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్స్కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్ సెంటర్లో జాయిన్ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ టఫ్ కాంపిటీషనర్ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్ కాంపిటీషన్ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు. ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్. రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు. తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్ కాంపిటీషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది అని మురిసిపోయింది. శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు. కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్ ఆల్రెడీ పూర్తవగా రాజ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్ ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు -
కామంతో కళ్లు మూసుకుపోతే.. 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: రెక్కీ (వెబ్ సిరీస్) నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా, ధన్యా బాలకృష్ణ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాత: శ్రీరామ్ కొలిశెట్టి కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ సంగీతం: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్ విడుదల తేది: జూన్ 17, 2022 (జీ5) ఇటీవలే 'గాలివాన' వెబ్ సిరీస్‌తో అలరించిన జీ5 తాజాగా 'రెక్కీ' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్ నోరోన్హా, సమ్మెట గాంధీ నటించిన ఈ వెబ్ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. 1992లో తాడిపత్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు డైరెక్టర్ కృష్ణ తెలిపారు. 7 ఎపిసోడ్లుగా వచ్చిన 'రెక్కీ' వెబ్ సిరీస్ జీ5లో జూన్ 17న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తాడిపత్రికి వరదరాజులు ('ఆడు కాలమ్' నరేన్) మున్సిపల్ ఛైర్మన్. అదే పట్టణంలో రంగ నాయకులు (రామరాజు) మాజీ మున్సిపల్ ఛైర్మన్. వీరిద్దరి మధ్య రాజకీయ పోరాటం జరుగుతుంది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు గురవుతాడు. తర్వాత 6 నెలలకు వరదరాజులు కుమారుడు చలపతి (శివ బాలాజీ) కూడా చంపబడతాడు. ఈ హత్యలు చేసింది ఎవరు ? ఎవరు ప్లాన్ చేశారు ? వాటి వెనుక ఉన్నది ఎవరు ? వారిని ఎస్సై లెనిన్ (శ్రీరామ్) కనిపెట్టాడా ? అతను తెలుసుకున్న నిజాలు ఏంటీ ? ఈ రెండు హత్యలతో వారి ఇంట్లోని ఆడవాళ్లు ఏం నిర్ణయించుకున్నారు ? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'రెక్కీ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ: ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగిందని చెప్పుకుంటాం. అలాంటి వనితపై వ్యామోహం పెరిగితె ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. కథ చూస్తే రాజకీయ నేపథ్యమున్నట్లు అనిపించినా కామ వాంఛ, మహిళా పాత్రను ప్రధానంగా చూపించారు. అనుకున్న కథ ప్రకారం ఆద్యంతం ఆసక్తికరంగా ఆవిష్కరించారు డైరెక్టర్ పోలూరు కృష్ణ. అధికారం, రాజకీయం కథలతో అనేక సిరీస్‌లు ఇదివరకు వచ్చాయి. కానీ వీటికి కాస్త భిన్నంగా కామ వాంఛను జోడించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. బంధాలు, అక్రమ సంబంధాల గురించి చక్కగా చూపించారు. సిరీస్‌లో వచ్చే మలుపులు ఊహించని విధంగా చాలా బాగా ఆకట్టుకున్నాయి. అలాగే మహిళళ పాత్రలను బలంగా చూపించారు. కానీ అక్కడక్కడ కొంతమేర అడల్ట్ సన్నివేశాలు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే? సిరీస్ ప్రారంభం నుంచి చివరి వరకు నటీనటుల నటన అద్భుతంగా ఉంది. ఆద్యంతం వారి నటనతో సిరీస్‌ను రక్తి కట్టించారు. శ్రీరామ్, శివ బాలాజీ, ఆడు కాలమ్ నరేన్, సమ్మెట గాంధీ, ఎస్తేర్ నోరోన్హా పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ పాత్రలు చివర్లో ఆకట్టుకుంటాయి. అలాగే మరో కీలక పాత్రలో నటించిన తోటపల్లి మధు పూర్తి న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే 1990వ దశకంలోని వాతావరణాన్ని బాగా చూపించారు. రామ్ కె మహేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. 'రెక్కీ' వెబ్ సిరీస్‌కు ఈ బీజీఎం ప్రాణం పోసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మిమ్మల్ని కదలనివ్వకుండా థ్రిల్‌కు గురిచేసే వెబ్ సిరీస్ 'రెక్కీ'. -సంజు (సాక్షి వెబ్ డెస్క్) -
సన్నీ లియోన్‌తో మంచు విష్ణు ఫన్నీ గేమ్, నెటిజనుల సందడి!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్ స్టార్ సన్నీ లీయోన్తో కలిసి ఒక గేమ్ ఆడారు. ఒకరి తరువాత ఫన్నీ గేమ్ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్లో పోస్ట్ చేశారు. బాల్యంలో ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు కమెంట్ చేయగా, మరింత ఫన్నీగా, మరికొందరు స్పందించారు. సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. కాగా విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపు కుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్‌లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు. Love this game!! pic.twitter.com/wyhr3wq5KV — Sunny Leone (@SunnyLeone) April 15, 2022 -
MAA Elections 2021: బాహుబలిలా కాదు..మదర్ థెరిస్సాలా రావాలి
హైదరాబాద్: ఎన్నికలంటే మాటల వేడి, ఆరోపణలు ఇలా ఓ సంగ్రామాన్ని ఆ సన్నివేశాలు తలపిస్తుంటాయ్. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలకు సమయం ఉండగానే ఇప్పటి నుంచే ఈ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో తమపై వచ్చిన ఆరోపణలు.. భవిష్యత్ కార్యచరణపై ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ శనివారం మీడియాతో సమావేశం నిర్వహించారు. ‘ మా ’కి ఏం చేయలేదని అనడం తనకి చాలా బాధగా కలిగించిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, సినీ నటుడు శివ బాలాజీ అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘మా’ లో ఏమీ జరగలేదని మీరు అంటే తీసుకోవడానికి చాలా బాధగా ఉంది. పని చేయడానికి మాకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. ఈ క్రమంలో మా స్నేహితుల నుంచి కూడా విరాళాలు తీసుకుని సహాయం చేస్తున్నాం. ‘మా’లోకి ఎవరైనా రావొచ్చు.. కాకపోతే వచ్చే వాళ్లు బాహుబలి లా రావొద్దు.. మదర్ థెరిస్సాలా రావాలని.... వచ్చి సర్వీస్ చేయలని అన్నారు. పనిచేసేవారికి గుర్తింపు ఎలాగైనా వస్తుందన్నారు. నరేష్ గారు ‘మా’లోకి నన్ను రావాలని ఆహ్వానించారు. ఆయన ప్రకారమే పోటీ చేసి గెలిచాను కూడా. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తరువాత మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేవాడిని.ఈ క్రమంలో నేను మొదటగా నేర్చుకుంది గొడవలే. ఎందుకంటే అందరివీ ఒకేలా అభిప్రాయాలు ఉండవు కదా. ప్రత్యేకంగా నేను ఈ విషయాన్నే ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే... ఓటింగ్ చేసేటప్పుడు ఒక ప్యానల్‌ని గెలిపించండంటూ కోరారు. అటూ ఇటూ ఉంటే పనులు జరగవని శివ బాలాజీ తెలిపారు. చదవండి: Kathi Mahesh: కత్తి మహేశ్ కంటికి తీవ్ర గాయం, ఐసీయూలో చికిత్స var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మా’ఎన్నికల్లో నరేశ్ కొత్త ప్రతిపాదన
-
ఎవరు అడ్డుపడినా ‘మా’ పనులు ఆగవు: శివబాలాజీ
-
తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవరో తెలుసా?
ఉగాది పచ్చడిలో అయినా షడ్రుచులు కాస్త అటూఇటుగా ఉంటాయోమో కానీ బిగ్‌బాస్ షోలో మాత్రం అన్ని రసాలు పండించే కంటెస్టెంట్లను లోనికి పంపిస్తారు. ఆవేశం స్టార్లను, అతి సహనపరులను, నవ్వించేవాళ్లను, డ్యాన్స్ చేసేవాళ్లను.. ఇలా ప్రతీది ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రతీ సీజన్లో ఓ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అనేది పక్కాగా ఉంటోంది. వీళ్లు చిన్న విషయానికి కూడా చిందులు తొక్కుతుంటారు. మరి మొదటి సీజన్ నుంచి నాల్గవ సీజన్ వరకు ఆ అర్జున్‌రెడ్డి ఎవరెవరున్నారో ఓ లుక్కేయండి.. ఇస్మార్ట్ సోహైల్ ఇప్పుడు అతడిని కెప్టెన్ సోహైల్ అని పిలుచుకోవాలి. ఈ సీజన్లో ఐదో కెప్టెన్‌గా అవతరించాడు. మొదట్లో కాస్త సాఫ్ట్‌గా కనిపించిన సోహైల్ ఉన్నట్టుండి వయొలెంట్‌గా మారిపోయాడు. గొడవ ప్రారంభమైందంటే చాలు కథ వేరుంటది అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి తెలీకుండానే బూతులు కూడా మాట్లాడేస్తాడు. దీంతో అతడంటేనే ఓ రకమైన భయం వచ్చేసింది కొందరు కంటెస్టెంట్లకు. ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కూడా సోహైల్ నరాలు కట్ అయిపోయేలా మాట్లాడతాడని చెప్పింది. ఆఖరికి నాగార్జున కూడా చాలా కోపం ఉందని, కాస్త నియంత్రించుకోమని సూచించారు. తమన్నా సింహాద్రి మొట్టమొదటిసారి ఓ ట్రాన్స్‌జెండర్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చారు. మొదట బాగానే ఉన్న ఆమె తన విశ్వరూపం చూపించింది. సహ కంటెస్టెంటు రవికి చుక్కలు చూపించింది. పప్పు అని ఆడుకుంటూ అతడిని ఏడిపించింది. అటు అలీ రెజా, రోహిణితో కూడా కయ్యానికి కాలు దువ్వేది. అలా హౌస్‌లో ఆమె పేరు చెప్తేనే వణికే పరిస్థితి వచ్చింది. దీంతో ఆమె అరాచకాలకు అడ్డు కట్ట వేయాలని భావించిన ప్రేక్షకులు ఆమెను తొందరగానే హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇలా కోపంగా ఉంటూ గొడవలు పెట్టుకుంటూనే తను షోలో ఉన్నానన్న విషయం అందరికీ తెలుస్తుందనే ఈ ట్రిక్ ప్లే చేశానని చెప్పుకొచ్చింది. (చదవండి: అవినాష్, అరియానాల బండారం బయటపడనుందా?) అలీ రెజా టాస్క్ అంటే చాలు.. ఉన్న శక్తినంతా కూడదీసుకుని మరీ టాస్క్‌లో తన ప్రతాపాన్ని చూపేవాడు. అతని ఆటకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. కానీ అతని కోపమే అతని పాపులారిటీని, ఓట్లను దెబ్బ తీసింది. వీరావేశంతో ఎదుటివారిపై నోరు జారడంతో ఆయన షో మధ్యలోనే వీడ్కోలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అతడు రీ ఎంట్రీ ఇవ్వాలని నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు. ఈ సారి గేమ్ ప్లాన్ మార్చి ఆడటంతో ఫైనల్ వరకు వెళ్లాడు. తనీష్ అల్లాడి రెండో సీజన్లో పాల్గొన్న హీరో తనీష్‌ను కోపానికి కేరాప్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. కౌశల్, నూతన్ నాయుడుతో తరచూ గొడవలు జరిగేవి. వీటికి హద్దూ అదుపూ ఉండేది కాదు. అయినా సరే, తనీష్‌కు అభిమాన గణం మెండుగానే ఉండేది. దీనికితోడూ దీప్తి సునయనతో ప్రేమాయణం కూడా బాగానే వర్కవుట్ అయింది. దీంతో టాప్ 3 స్థానంలో నిలబడ్డాడు. ((చదవండి: 'అమ్మో' రాజశేఖర్, మళ్లీ శాపం పెట్టాడు!) తేజస్వి మడివాడ రెండో సీజన్లో తేజస్వి కూడా చీటికి మాటికీ రుసరుసలాడుతుండేది. తనకు ఏదైనా నచ్చకపోతే చాలా ఆ విషయాన్ని చీల్చి చెండాడేది. వివాదం, ఫిజికల్ టాస్క్, బ్రెయిన్ టాస్క్ ఇలా ఏదైనా సరే అందులో తన మార్క్ చూపించేది. ముక్కు మీద కోపం ఉన్న ఈ భామ ఏడో వారంలోనే బ్యాగు సర్దేసుకుని వెళ్లిపోయింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్‌బాస్ అంత ఇస్తున్నాడా?) శివబాలాజీ అన్నీ అమర్చిన బిగ్‌బాసే ఒక్కోసారి కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడు. అయితే ఇలాంటి సందర్భాల్లో బిగ్‌బాస్‌ను అభ్యర్థించాల్సింది పోయి అతడిపైనే ఆవేశపెట్టాడు శివబాలాజీ. మొదటి సీజన్లో పాల్గొన్న శివబాలాజీ ఓ రోజు నీళ్లు సడన్‌గా రాకపోవడంతో బిగ్‌బాస్‌పైనే ఆగ్రహించాడు. కోపంతో పాటు మిగతా ఎమోషన్స్ కూడా ఎక్కువే కావడంతో ఆ ఆగ్రహాన్ని కవర్ చేయగలిగాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్ విజేతగా నిలిచాడు. -
శివబాలాజీతో సరదాగా కాసేపు
-
శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్!
-
శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై సరికొత్త రియాల్టీ షో బిగ్‌బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యహరించిన ఈషో 70 రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది. మొత్తం 14 మందితో మొదలైన తొలిసీజన్ విజేతగా హీరో శివబాలాజీ నిలిచాడు. భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజగా శివబాలాజీ ఇంటికి బిగ్‌బాస్ వచ్చాడు. అంతే కాకుండా టాస్క్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే శివబాలాజీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో స్నేహమేరా జీవితం అనే చిత్రం తెరకెక్కింది. ఈచిత్రం ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ వాయిస్‌ను ఉపయోగించుకున్నారు. ఇందులో భాగంగా ఒక ప్రమోషన్ వీడియోని విడుదల చేశారు. అందులో శివబాలాజీ ఇంట్లో కూర్చుని ఉండగా బిగ్‌బాస్ వాయిస్ వినిపిస్తుంది. షో విజేతగా నిలిచినందుకు, స్నేహమేరా జీవితం సినిమా ట్రైలర్ 1మిలియన్ వ్యూస్ దాటినందుకు బిగ్‌బాస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకుండా ప్రీజ్, రిలీజ్ టాస్క్‌ను కూడా చేయించారు. ప్రేక్షకులకు కూడా ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. సినిమా సారాంశాన్ని ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి పంపాలి. ఆ వీడియో సినిమా కథకు దగ్గరగా ఉంటే వారికి శివబాలాజీ, రాజీవ్ కనకాలను కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్ తన ఇంటికి వచ్చినట్లుగా తీసిన ఈ వీడియోను శివబాలాజీ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇంక ఎందుకు ఆలస్యం మీరూ ఒక వీడియో తీసి ఓసారి ప్రయత్నించండి. -
నటుడు శివబాలాజీ,రోజా ఇళ్లలోకి వర్షపు నీరు
-
‘బిగ్‌బాస్’ శివ బాలాజీ
-
‘బిగ్‌బాస్’ శివ బాలాజీ
సాక్షి, హైదరాబాద్: ‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరు? లక్షల నగదు బహుమతిని దక్కించుకునే ఆ విజేత ఎవరు? ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఆదివారం తెరపడింది. 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్ నిలిచారు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగిన సంగతి తెలిసిందే. చివరికి హౌస్‌లో నవదీప్, శివ బాలాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, అర్చన, హరితేజ మిగిలగా, శివ బాలాజీని విజయం వరించింది. ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టంట్లలో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. గత వారం అక్షరాలా పదకొండు కోట్లకు పై చిలుకు మంది ఆడియన్స్ తమ అభిమాన సెలబ్రిటీని గెలిపించేందుకు ఓటింగ్‌లో పాల్గొన్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో శివ బాలాజీ బిగ్‌బాస్ సీజన్-1 టైటిల్‌తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. విన్నర్‌ను ప్రకటించిన వెంటనే శివ బాలాజీ కుటుంబసభ్యుల దగ్గరికి చేరి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం విజేతకు ట్రోఫీ, క్యాష్ ప్రైజ్‌లను వ్యాఖ్యాత ఎన్టీఆర్ అందజేశారు. 71రోజులు.. 60 కెమెరాల మధ్య.. 16 మంది (ఇద్దరు వైల్డ్ కార్డ్) కంటెస్టెంట్స్‌తో జూలై 16వ తేదీన షో ప్రారంభమైంది. కంటెస్టంట్ల ప్రదర్శనలతో 71 రోజుల పాటు షో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎన్టీఆర్ విన్నర్‌ని అనౌన్స్ చేయడంతో బిగ్‌బాస్ సీజన్-1కి శుభం కార్డు పడింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు వారాలబ్బాయి అని వినేవాణ్ణి. ఇప్పుడు వారం వారం వచ్చి మీతో (ప్రేక్షకులు), ‘బిగ్ బాస్’ హౌస్‌మేట్స్‌తో ప్రేమను పంచుకున్నాను. ఇది నాకు మంచి ఎమోషనల్ జర్నీ. ఆ దేవుడు ఎవర్ని ఎప్పుడు, ఎక్కడ కలుపుతాడో తెలియదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నాపై చూపించిన అభిమానానికి మాటలు రావడంలేదు. అనంతరం విన్నర్ శివబాలాజీ మాట్లాడుతూ ‘‘విన్నర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మధ్యలో ఎలిమినేట్ అయిపోతా నేమో అనుకున్నప్పటికీ చివరి వరకూ ఉంటాననే నమ్మకం కూడా ఉండేది. ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందన్నది నా నమ్మకం. నా హౌస్మేట్స్ నాకు బాగా సహకరించారు’’ అని అన్నారు. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న తొలి షో బిగ్ బాసే. షో ప్రారంభం నుంచే ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రతి వారాంతంలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున టీఆర్పీ రేట్లు నమోదయ్యాయి. ఈ ఆదివారం జరిగిన చివరి ఎపిసోడ్‌ను నిర్వాహకులు ప్రత్యేకంగా నిర్వహించారు. షోలో పాల్గొన్న కంటెస్టంట్లందరిని కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాదు స్టేజ్‌పై బిగ్‌బాస్‌ను అనుకరిస్తూ బిగ్‌బాస్ స్కిట్కూడా చేశారు. కార్యక్రమం ప్రసారం దాదాపు 5.30 గంటలకు పైగా ప్రసారం అయింది. అంతేకాదు చివరి రోజు ఎన్టీఆర్‌తో కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బిగ్‌బాస్ స్టేజ్‌పై పాటలు, డాన్స్‌తో అలరించారు. బిగ్‌బాస్‌లోని కంటెస్టంట్లందరికి ఫన్నీఅవార్డులను కూడా ప్రకటించారు. ఫన్నీ అవార్డ్స్: ఉచిత సలహా అవార్డు (మహేష్ కత్తి) అయోమయం అవార్డు (సంపూర్ణేష్ బాబు) గ్రైన్డర్ అవార్డ్ (దీక్ష) రోమియో అవార్డు (ప్రిన్స్) బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు (ధనరాజ్) గురకరాయుడు అవార్డు (సమీర్) ఫిటింగ్ మాస్టర్ అవార్డు (కత్తి కార్తీక) గుండెల్లో గోదారి అవార్డు (మధుప్రియ) -
సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు
-
సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ‘చందమామ’ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ డబ్బింగ్ పనులను పూర్తి చేశామని, ఈ సినిమా బృందం కసిగా పనిచేస్తోందని పేర్కొంటూ శివబాలాజీ పలు ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలపై ఓ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించాడు. అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైం ఏసీపీ బలరాంకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కాటమరాయుడు సెట్ లో పవన్ కళ్యాణ్ కు కత్తిని అతడు బహూకరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. -
పవన్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్!
హీరో పవన్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ ఊహించని కానుక ఇచ్చాడు. కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పవన్ కు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ అందించాడు. స్కార్ఫ్ లో చుట్టి తీసుకొచ్చిన కానుకను మోకాళ్లపై కూర్చుకుని పవన్ కు ప్రేమపూర్వకంగా అందించాడు. చిరునవ్వుతో అందుకున్న పవర్ స్టార్ దాన్ని ఓపెన్ చేయగానే అందులో బంగారపు రంగులో ఉన్న కత్తి ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని ఆసక్తిగా తిలకించారు. కత్తిపై రెండు వైపుల జనసేన పేరు తెలుగు, హిందీ భాషల్లో రాసుంది. ‘పవిత్రాయ సాధునాం... ’ అనే శ్లోకం కూడా కత్తిపై రెండు వైపులా లిఖించారు. కత్తి పిడి దగ్గర జనసేన లోగోను పొందుపరిచారు. శివబాలాజీ ఇచ్చిన కానుకను కాటమరాయుడు బృందంలోని వారంతా ఆసక్తిగా తిలకించారు. తమిళ చిత్రం ‘వీరమ్’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’లో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. నలుగురు తమ్ముళ్లలో ఒకడిగా శివబాలాజీ నటిస్తున్నాడు. కమల్కామరాజ్, చైతన్యకృష్ణ, అజయ్ తమ్ముళ్ల పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి నెలాఖరుకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పవన్ తమ్ముళ్లు వీళ్లే..!
సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్రలకు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేశాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు. అయితే ఈ పాత్రల్లో ఎవరు కనిపించనున్నారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఫైనల్‌గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ సోదరుడిగా నటించిన అజయ్ ఒక తమ్ముడిగా నటిస్తుండగా, కమల్ కామరాజు, శివబాలజీలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. -
కష్టే ఫలి!
ఇబ్రహీంపట్నం : ఏ రంగంలోనైనా కష్టపడితేనే విజయం దక్కుతుందని చందమామ సినిమా ఫేమ్ హీరో శివబాలాజీ చెప్పారు. బుధవారం ఆయన స్థానిక నోవా ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. ఆయన రాకతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఆయనతో కరచాలం చేసేందుకు పోటీపడ్డారు. కొందరైతే సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. శివబాలాజీ మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా ఎదగాలంటే బాగా శ్రమించాలని విద్యార్థులకు సూచించారు. కెరీర్ గెడైన్స్‌పై అవగాహన కల్పించారు. వచ్చిన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎం.కృష్ణారావు, డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ శ్రీనాథ్‌లు శివబాలాజీని ఘనం గా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్మాతగా శివబాలాజీ!
‘ఆర్య’, ‘సంక్రాంతి’ లాంటి హిట్ చిత్రాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ బాలాజీ ఇప్పుడు నిర్మాతగా మారారు. గగన్ మ్యాజి కల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ ఆరంభించారు. అజయ్, శివ బాలాజీ ముఖ్య పాత్రధారు లుగా ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ 23న ప్రారంభం కానుంది. మహేశ్ ఉప్పు టూరి దర్శకుడు. ‘‘1980లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఇద్దరు స్నేహి తుల మధ్య సాగే సినిమా ఇది. వైవిధ్యమైన కాన్సెప్ట్. కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్నా’’ అని శివబాలాజీ తెలిపారు. -
‘జెండాపై కపిరాజు’ స్టిల్స్
-
అప్పుడే వద్దన్నారు ఎపుడెపుడా అనుకున్నారు!
అప్పుడే వద్దన్నారు ఎపుడెపుడా అనుకున్నారు! చెన్నైలో ‘ఇంగ్లిష్కారన్’ షూటింగ్ జరుగుతోంది. నటీనటుల్లో... శివబాలాజీ, స్వప్నమాధురి. వస్తున్నారు. చేస్తున్నారు. వెళ్లిపోతున్నారు. అంతవరకే. నో పరిచయం, నో స్నేహం! (నో స్మైల్ కూడానేమో). అయితే... వీళ్లిక్కడ యాక్ట్ చేస్తున్న సమయంలో... షూటింగ్ స్పాట్లో - అబ్బాయి ‘మమ్మీ’కి, అమ్మాయి ‘మామ్’కీ పరిచయం అయింది, స్నేహం మొద లైంది! ఓ రోజు మాటల్లో ... ‘ఈడూజోడూ బాగున్నారు కదా’ అనుకున్నారు. ఆ మాటే పిల్లలతో అన్నారు. ‘ఎస్’ అనలేదు శివ, స్వప్న. టైమ్ అడిగారు. మినిమం మూడేళ్లు అన్నారు. ఆ మూడేళ్లలో ఈ జంట అనుభవాలేమిటి? పెళ్లయిన ఈ నాలుగేళ్లలో అనుభూతులేమిటి? చదవండి ఈవారం ‘మనసే జతగా...’ అబ్బాయి, అమ్మాయి పెళ్లి అయ్యేంతవరకు విభిన్న జీవనశైలుల మధ్య పెరుగుతారు. తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. తమ ఇష్టానికి తగినట్టుగా ఉంటారు. పెళ్లయ్యాక ఒకే ఇంట్లో ఒకటే అన్నట్టుగా కలిసి ఉంచే బంధంతో సహజీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అప్పటివరకు బాధ్యతారాహిత్యంగా పెరిగిన పిల్లలు పెళ్లి అవడంతోనే బాధ్యతగా ఒదిగిన విధానాన్ని చూసినవారూ అబ్బురపడుతుంటారు. పెళ్లిలో ఉండే మహిమ ఇదే సుమా అని చల్లగా నవ్వుతుంటారు. ఆ నవ్వులే ఆశీస్సులుగా అందుకుంటూ ఉంటారు కొత్తజంటలు. శివబాలాజీ, స్వప్నమాధురి వివాహబంధంతో ఒక్కటై నాలుగేళ్లు (మార్చ్ 1, 2009) దాటింది. ‘‘ఇద్దరూ సినిమా ఆర్టిస్టులే! సినిమా షూటింగ్స్ ఉంటే చాలు సొంత పనులన్నీ పక్కన పెట్టేసి సిద్ధమైపోతాం’’ అని చెప్పిన ఈ జంట హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నారు. విభిన్న నేపథ్యం శివబాలాజీ, స్వప్నమాధురిల బాల్యంలో ఎక్కడా పోలికలు లేవు. ఆ విషయాన్నే స్వప్న ప్రస్తావిస్తూ- అమ్మ, నాన్న అన్నయ్య, అక్క, నేను చెన్నై వాసులమే అయినా పుట్టిపెరిగింది అంతా హైదరాబాద్‌లోనే! పొరపాటున కూడా సినిమా రంగానికి వస్తానని అనుకోలేదు. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తమిళ టీవీ వాళ్లు చూసి యాంకరింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సినీరంగానికి పరిచయం అయ్యాను. దాదాపు పదకొండేళ్లుగా ఈ రంగంలోనే ఉన్నాను’’ అని చెప్పారు. శివబాలాజీ తన గురించి చెబుతూ - ‘‘నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్! నాన్నగారి వైపు అంతా వ్యాపారస్థులే! ఆంధ్రప్రదేశ్ వారమే అయినా పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే! చదువు పూర్తవగానే నాన్న ఫ్యాక్టరీలోనే మేనేజర్‌గా పనిచేశాను. చిన్ననాటి నుంచి సినిమా అంటే చాలా ఆసక్తి. ‘ఏదైనా ఒకటే ఫీల్డ్ ఎంపిక చేసుకో’ అని నాన్న హెచ్చరించడంతో సినిమానే ఓకే చేశాను. ‘ఇంగ్లిష్కరణ్’ అనే తమిళ సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ఆ సినిమాతో ఇద్దరం స్నేహితులమయ్యాం’’ అని వివరించారు. ఇద్దరమ్మలు కుదిర్చిన వైనం తమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వైనాన్ని వివరిస్తూ శివబాలాజీ - ‘‘సినిమా షూటింగ్ చెన్నైలో! దీంతో షూటింగ్ స్పాట్‌కి మా అమ్మ వచ్చేవారు. స్వప్న వెంట వాళ్ల అమ్మ ఉండేవారు. అలా మా అమ్మ, వీళ్లమ్మ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ముందు వారిద్దరూ మా పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. మాకు అప్పటికి పెళ్లి ఆలోచన కూడా లేదు. మేమే ‘కెరియర్ ప్రారంభదశలో ఉన్నాం. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మూడేళ్లు టైమ్ కావాలి’ అని అడిగాం. అప్పటివరకు రాబోయే అమ్మాయికి సాఫ్ట్ నేచర్ ఉంటే చాలు అనుకున్నాను. స్వప్నలో ఆ క్వాలిటీస్ బోలెడు ఉన్నాయి. అందుకే కాదని చెప్పలేదు’’ అని శివబాలాజీ చెబుతుంటే ‘‘మా ఇంట్లో యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎప్పుడూ ఒకలా ఉండదు. కష్టనష్టాలను భరించగలగాలి. కాని బాలాజీ కుటుంబం అంతా మా ఇంట్లో వారికి బాగా నచ్చారు. దాంతో ఒప్పుకున్నారు. నాకూ ‘ఇలాగే ఉండాలి’ అని ప్రత్యేకమైన నిబంధనలేవీ లేవు. దాంతో ఓకే అయిపోయింది’’ అన్నారు స్వప్న. పరిశోధనల ప్రయాణం ఇద్దరూ సినిమాలు చేస్తున్నారు. అనుకోకుండా ఇద్దరికీ యాక్టింగ్‌లో కొంత గ్యాప్ ఏర్పడటం మొదలైంది. అప్పుడే భవిష్యత్తు గురించిన ఆలోచన ఇద్దరిలోనూ మొదలైంది. ఆ ఆలోచన గురించి స్వప్న చెబుతూ- ‘‘బాబు పుట్టాక యాక్టింగ్‌లో నేను కొంత గ్యాప్ తీసుకున్నాను. కాస్త తీరిక దొరకడంతో కిందటేడాది చాలా పరిశోధన చేసి ‘ఈమూ బర్డ్స్ ఫామ్’ మొదలుపెట్టాం. ఇందుకోసం మా ఇద్దరి కుటుంబాలు చాలా సపోర్ట్నిచ్చాయి. ‘సియానా’ పేరుతో ‘ఈమూ ప్రొడక్ట్స్’ మార్కెట్ చేస్తున్నాం. ఈ ఫామ్ ఏర్పాటు కోసం మూడు నెలల పాటు అడవిలోనే గిరిజనుల మధ్య గడిపాం. అక్కడికెళితే అదో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా అక్కడికి వస్తే అంత త్వరగా వెళ్లలేరు. అంతబాగా డిజైన్ చేశాం. బాలాజీకి చిన్నప్పటి నుంచి వ్యాపార మెలకువలు తెలుసు. ఈయనా సినిమాలోకి వచ్చి పన్నెండేళ్లు అవుతోంది. దీంతో రెండురంగాల్లోనూ ఇద్దరికీ అవగాహన ఏర్పడింది. భవిష్యత్తు ఆలోచన ఏదైనా ఇద్దరం కలిసి చర్చించుకుంటాం. ‘చేయగలం’ అనిపించాక ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకుంటాం’’ అన్నారు స్వప్న. ఒకరికోసం ఒకరు మార్పు ‘‘ఎంగేజ్మెంట్ తర్వాత నాపై కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది స్వప్న. పెళ్లి తర్వాత రెండేళ్లపాటు అది కంటిన్యూ అయ్యింది. తర్వాత తప్పక ఈవిడే కంట్రోల్ అయిపోయింది’’ అన్నారు శివబాలాజీ నవ్వుతూ! తన మనస్తత్వం పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని, ఎలాంటి మార్పులు రాలేదన్నారు. బహూశా పెళ్లికి ముందు మూడేళ్ల సమయంలో మార్చుకున్న పద్ధతులే ఇప్పటికీ కంటిన్యూ అవుతుండాలి... అన్నారు. ‘‘పెళ్లికి ముందు నువ్వు కోరినట్టు ఉంటాను అని ప్రామిస్ చేశారు. కాని ఆ ప్రామిస్‌ను నిలబెట్టుకున్నది ఏమీ లేదు’’ కంప్లైంట్ చేశారు స్వప్న. తనలో వచ్చిన మార్పులనే చెబుతూ-‘‘పెళ్లికి ముందు ప్రతి చిన్నదానికి అమ్మ మీద ఆధారపడేదాన్ని. అడగ్గానే ఇంట్లో వారు అన్నీ అమర్చిపెట్టేవారు. పెళ్లి తర్వాత ఇండిపెండెంట్ అయ్యాను. ఇంటి పనులు, బయట పనులుస్వయంగా చేసుకోవడం నేర్చుకున్నాను’’ అన్నారు ఆమె! ఎప్పటికీ మరిచిపోలేని మధురిమ తమ మధ్య బంధాన్ని పటిష్టం చేసిన సంఘటన గురించి స్వప్న చెబుతూ - ‘‘మా ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకసారి సినిమా షూటింగ్ కోసం కొచ్చిన్ దగ్గర మారుమూల పల్లెకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి ఫోన్ సౌకర్యం కూడా లేదు. వెళ్లేముందు ఈయనకు ఫలానా చోటు అని సమాచారం ఇచ్చాను. నా పుట్టిన రోజున అర్ధరాత్రి ఒక బొకే వచ్చింది. నేను నమ్మలేదు. ఎవరు పంపారో తెలుసుకున్నాక చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆరునెలల తర్వాత మా మధ్య బొకే ప్రస్తావన వచ్చింది. ఆ బొకే ఇంకా ఉందని తెలుసుకొని, తిరిగి ఇమ్మన్నారు. తర్వాత ఒక రోజు ఆ బొకేలోని పువ్వులను, గడ్డిని మోడ్రన్ ఆర్ట్‌లా డిజైన్ చేసి, ఫ్రేమ్ చేయించి తెచ్చారు. అప్పుడు ఆ ఎక్స్‌ప్రెసివ్ ధోరణి చాలా బాగా ఉండేది. ఇప్పడు ప్రేమ ఉన్నా అన్నీ మనసులోనే దాచుకుంటారు. అప్పటిలాగే ఇప్పుడూ ఎందుకుండరు అంటుంటాను’’ అని ఆమె చెబుతుంటే ‘‘అలాగే ఉంటే కాపురాలు ఉండవు మేడమ్! పెళ్లికి ముందు పీరియడ్ సినిమా ట్రైలర్స్ లాంటివి. ఆసక్తి ఎక్కువ. అదే ఫ్యామిలీ అయితే ఫుల్ సినిమా! అదే సినిమా చూశాక కదా నచ్చడం, నచ్చకపోవడం ఉండేది’’ అంటూ కాపురాన్ని సినిమాతో లింక్ చేసి చెప్పారు శివబాలాజీ! మూడేళ్ల తమ కుమారుడు ధన్విన్ తమ జీవితంలో అడుగుపెట్టాక బంధాల గొప్పతనం మరింతగా అవగాహనలోకి వచ్చిందని చెప్పింది ఈ జంట. ‘‘సినిమా షూటింగైనా, వ్యాపార లావాదేవీలైనా, కుటుంబ బాంధవ్యా లైనా.. నేటితరం మల్టీటాస్కింగ్ చేస్తోంది. అయినా ఒకదానికొకటి సమస్యగా మారకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుండాలి. పెళ్లి వయసు ఎంత అనేది ప్రామాణికం కాదు, పెళ్లిపట్ల కలిసి ఉండే వ్యక్తుల మధ్య అవగాహన ఎంతో తెలియడం ముఖ్యం’’ అని తెలిపింది ఈ జంట. ఇద్దరూ ఒకే విధంగా... మా ఇద్దరికీ వంట వచ్చు. దీంతో ఎప్పుడూ సమస్య కాలేదు. ఇద్దరికీ ఇండిపెండెంట్‌గా ఉండటమూ అలవాటే ! నటనలో ఇద్దరమూ విమర్శించుకోం. అవకాశాలు వచ్చేదాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం. స్టోరీస్ వస్తే దాన్ని బట్టి డిస్కస్ చేసుకోవడం మామూలే! ఏదైనా నచ్చని ప్రాజెక్ట్ వస్తే ఇద్దరికీ నచ్చదు. చివరగా ఎవరి నిర్ణయం వారిదే! మా కెరియర్ గురించి మాకు తెలుసు. దాన్ని బట్టి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అవగాహనకు వచ్చాం. వృత్తిపరంగా టైమ్ టు టైమ్ ప్లాన్ చేసుకుంటాం. దాన్నిబట్టి సమస్యలు రాకుండా జాగ్రత్తపడతాం ఒకరికి షూటింగ్ ఉంటే ఇంకొకరు ఇంటా బయట పనులు చూసుకుంటాం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటాం కాబట్టి ఎదుటి వారి అలసటను గుర్తిస్తాం. కావల్సినంత విశ్రాంతినిస్తాం పని ఒత్తిడి వల్ల అని మాత్రమే కాదు ఏవో చిన్న చిన్న చిరాకులు ఇద్దరికీ వస్తూనే ఉంటాయి. కాని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకొని కూల్ అయిపోతాం. స్వప్నమాధురి (తమిళంలో పేరు మధుమిత) తెలుగు: సందడే సందడి, రెండుగుండెల చప్పుడు, మన్మథుడు, నువ్వే నువ్వే, పుట్టింటికి రా చెల్లి, కీలుగుర్రం, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా? తమిళం: కుడైకుల్ మజ్హై, అముథే, బాయ్‌ఫ్రెండ్, ఇంగ్లిష్కారన్, నాలయి, ఆన్వీర్, సొల్ల సొల్ల ఇనిక్కుమ్, యోగి, తూంగానాగారం, కాథల్ మైపడ, బిర్యానీ, రుద్రమదేవి కన్నడ: నాను నేను జోడి శివబాలాజీ: తెలుగు: ఇది మా అశోక్‌గాడి లవ్ స్టోరీ, ఎలా చెప్పను, దోస్త్, సంక్రాంతి, పోతే పోనీ, గోల్డ్ స్పాట్, కుంకుమ, సరదా సరదాగా, అన్నవరం, పగలే వెన్నెల, చందమామ, శంభో శివ శంభో, టార్గెట్, ఆగంతకుడు, కోకిల, ఆర్య, జగమే మాయ. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స ప్రతినిధి -
రాజమౌళి దర్శకత్వంలో చిన్న పాత్రైనా చేయాలని ఉంది - శివబాలాజి
‘జగమే మాయ’తో ఈ ఏడాది కచ్చితంగా హిట్ కొడతా’’ అని నమ్మకంగా చెబుతున్నారు నటుడు శివబాలాజి. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ- ‘‘నా పుట్టిన రోజు, దసరా ఒకే రోజు రావడం, ఆ టైమ్‌లో నేను షూటింగ్లో బిజీగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’ సినిమా మేకింగ్‌లో ఉంది. అలాగే... ‘జగమే మాయ’ ప్రొడక్షన్లోనే మరో సినిమా చేయబోతున్నాను. ఈ ఏడాది నాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి’’ అని ఆనందం వ్యక్తం చేశారు శివబాలాజి. ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుంది? అనంటే.. ‘‘నా దగ్గరకొచ్చే స్క్రిప్టులే చాలా తక్కువ. వాటిలో మంచి కథల్ని ఎంచుకోవాలి. గతంలో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేశాను. దాని వల్ల నష్టపోయాను. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే సెలక్టివ్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నాను’’ అని చెప్పారు. 2002లో తాను హీరో అయ్యానని, ఆ టైమ్‌లో తనతో పాటు 150 మంది కొత్త హీరోలు తెలుగుతెరకు పరిచయమైనా... వారిలో నిలదొక్కుకుంది మాత్రం తాను, అల్లు అర్జున్, విష్ణు మాత్రమేనని శివబాలాజి గుర్తు చేసుకున్నారు. నటునిగా నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని, ఈ క్రమంలో విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తన భార్య స్వప్నమాధురి గురించి చెబుతూ- ‘‘తను అడుగుపెట్టగానే నా జీవితమే మారిపోయింది. తను లేకపోతే ఉండలేనేమో అనిపిస్తోంది. కెరీర్ విషయంలో తను నాకెన్నో సలహాలిస్తూ ఉంటుంది. నటిగా ప్రస్తుతం స్వప్న కూడా బిజీగా ఉండటం ఆనందంగా ఉంది. తమిళంలో సినిమాలు చేస్తోంది తను’’అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా పోషించాలని ఉందన్న ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు శివబాలాజి. -
జగమే మాయ
తన స్వార్థం కోసం మనిషి ఎలాంటి మాయలు చేస్తాడు? ఎత్తుకు పైఎత్తు వేసి ఎదుటి వ్యక్తిని ఎలా చిత్తు చేస్తాడు? అనే అంశాలతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘జగమే మాయ’. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సునీల్ కాశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభి స్తోంది. కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే యూత్‌ఫుల్ ఎంట ర్‌టైనర్ ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు. -
'జగమే మాయ' పాటలు
అవసరానికి, అత్యాశకి మధ్య జరిగిన పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. శివబాలాజీ, సిద్దూ, క్రాంతి, చిన్మయి, గజల్, సావేరి ముఖ్య తారలు. మహేష్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీకాంత్‌కి అందించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భీమనేని శ్రీనివాసరావు, సునీల్, బాలాదిత్య, వెన్నెల కిషోర్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇది తమ కలల చిత్రమని, చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. మంచి సినిమాకు సంగీతం అందించే అవకాశాన్నిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని సునీల్ కశ్యప్ అన్నారు. విజయమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాకు పనిచేశామని శివబాలాజీ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.