retires
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
మెగ్ లానింగ్ గుడ్‌బై
మెల్బోర్న్: మహిళల క్రికెట్‌కే మకుటం లేని మహారాణి మెగ్ లానింగ్. ఆటతో, సారథ్య నైపుణ్యంతో ఆ్రస్టేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ విజయవంతమైన సారథి, 13 ఏళ్ల ఫలప్రదమైన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆ్రస్టేలియా అమ్మాయిల క్రికెట్లో ఎవర్గ్రీన్ ‘మెగాస్టార్’గా కెపె్టన్ లానింగ్‌కు పెట్టింది పేరు. 31 ఏళ్ల వన్నె తగ్గని ఈ క్రికెటర్ తన ప్రతిభా పాటవాలతో ఏకంగా ఏడు ప్రపంచకప్‌లలో భాగమైంది. ఇందులో ఐదు టైటిల్స్ ఆమె కెప్టెన్సీలోనే వచ్చాయి. గతేడాది లానింగ్ సారథ్యంలో ఆసీస్ మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపాక మళ్లీ ఆమె బరిలోకి దిగలేదు. ఆరోగ్య సమస్యలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటలనకు దూరంగా ఉంది. ఇలా అరంగేట్రం: జన్మతః సింగపూర్ అమ్మాయి అయిన మెగ్... న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కూడా ఈ ఫార్మాట్లోనే ఆడింది. అలా సంచలనం: పిన్న వయసు (21 ఏళ్లు)లోనే కెప్టెన్ అయిన ‘ఆసీస్ యంగెస్ట్ క్రికెటర్’. ఒకే ఒక్క వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు (1232) చేసిన కెపె్టన్‌గా ఘనత. టి20ల్లో అత్యధికంగా వంద మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెపె్టన్‌గానూ రికార్డు. మెగ్ లానింగ్ మొత్తం 179 మ్యాచ్‌ల్లో కెపె్టన్‌గా వ్యవహరించగా, ఆమె కెప్టెన్సీలో ఆసీస్ జట్టు 146 మ్యాచ్‌ల్లో గెలిచింది. ‘కప్’ల కహాని: రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2013, 2022), ఐదు టి20 ప్రపంచకప్ (2012, 2014, 2018, 2020, 2023)లలో విజయవంతమైన కెపె్టన్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకుంది. లానింగ్ సారథ్యంలో ఆసీస్ 2022 వన్డే వరల్డ్‌కప్‌లో, 2014, 2018, 2020, 2023 టి20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌లో సునామీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కేవలం 45 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు. కెరీర్ ప్రొఫైల్: ఆరు టెస్టులు ఆడి 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు సాధించింది. ఇందు లో 15 సెంచరీలు, 21 ఫిఫ్టీలున్నాయి. 132 టి20ల్లో 3405 పరుగులు చేసింది. 2 శతకాలు, 15 అర్ధసెంచరీలున్నాయి. ఓవరాల్‌గా 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి లానింగ్ 8,352 పరుగులు చేసింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ తన నిర్ణయాన్ని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్‌బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని సోహైల్ సృష్టం చేశాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానలకు, సహచర ఆటగాళ్లకు సోహైల్ ధన్యవాదాలు తెలిపాడు. సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతడు చివరగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ తరపున ఆడాడు. తన కెరీర్లో సోహైల్ 9 టెస్టు, 13 వన్డేలు, 5 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో సోహైల్‌కు మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్‌ల్లో 3.69 ఏకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో 5 వికెట్లు సాధించాడు. భారత్‌పై 5 వికెట్లు.. ముఖ్యంగా సోహైల్ ఖాన్ కంటే గుర్తు వచ్చేది 2015 వన్డే ప్రపంచకప్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అప్పటిలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆతర్వాత ఏడాదికే జట్టులో అతడు చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు! వీడియో చూడాల్సిందే -
అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యార్కర్ కింగ్
Lasith Malinga Retirement From All Forms of Cricket: శ్రీలంక యార్కర్ కింగ్ లసిత్ మలింగ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు ఫార్మట్ల నుంచి ఇదివరకే మలింగ తప్పుకున్నాడు. తాజా నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ పూర్తిగా తప్పుకున్నట్లు అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా మంగళవారం పేర్కొన్నాడు. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను ప్రోత్సహించిన వారందరికి ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా‘అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు . కాగా 2019లో వన్డేలనుంచి తప్పుకోగా, 2011లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రికార్డుల మలింగా.. అంతర్జాతీయ క్రికెట్లో ఐదు హ్యాట్రిక్ లు నమోదు చేసి అరుదైన ఘనత సాధించిన బౌలర్ కూడా మలింగానే. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు కూడా మలింగ పేరిటే నమోదై ఉంది. ఐపీఎల్ లో మలింగ ఇప్పటికీ అత్యధిక వికెట్ల తీసిన ఆటగాడుగా కొనసాగుతున్నాడు. శ్రీలంక తరుపున 84 టీ20 మ్యాచ్ లు ఆడిన మలింగా 107 వికెట్లు పడగొట్టాడు. 228 వన్డేల్లో 338 వికెట్లు తీసిన మలింగ, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తన అంతర్జాతీయ కేరిర్‌లో 546 వికెట్లు సాధించాడు. అంతేకాదు122 ఐపీఎల్ మ్యాచ్ లు కూడా లసిత్ మలింగ ఆడాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. చదవండి: T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు... "Today I decided I want to give 100% rest to my T20 bowling shoes." Lasith Malinga has called time on his playing career 🌟 — ICC (@ICC) September 14, 2021 -
బ్రిటిష్ రాజ కుటుంబం కంటే రెండింతల ఆస్తితో రిటైర్డ్..!
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాను స్థాపించి, పెంచి పెద్ద చేసిన అమెజాన్‌కు నేటి నుంచి గుడ్‌బై చెప్పనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చిన అమెజాన్ కంపెనీ సీఈవో పదవికి జులై 5న ఆయన పదవి విరమణ చేశారు. అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఎక్కువగా ఆన్లైన్ సేవల వైపు మొగ్గు చూపడంతో అమెజాన్ 2020లో గణనీయంగా లాభాలను గడించింది. దీంతో అమెజాన్ వ్యవస్తాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగింది.సుమారు 2020 సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా జెఫ్ బెజోస్ 1994 జూలై 5 న తొలిసారిగా అమెజాన్‌తో ఆన్లైన్లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బెజోస్ బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్దమైతున్న విషయం తెలిసిందే. జెఫ్ బెజోస్ సంపద విషయానికొస్తే.. బెజోస్ మొత్తం బ్రిటిష్ రాజకుటుంబ సంపద కంటే రెండింతలు ఎక్కువ సంపదతో పదవి విరమణ తీసుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం సంపద సుమారు 88 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 203 బిలియన్ల డాలర్లు. 2018 నుంచి 2020 వరకు బిల్ గేట్స్ నికర ఆస్తి విలువ రూ .6.12 లక్షల కోట్ల నుంచి రూ .8.58 లక్షల కోట్లకు ఏగబాకింది. ఒక నివేదిక ప్రకారం, అతని సంపద 73 శాతం పెరిగింది. బెజోస్ తన పెన్షన్‌ను కవర్ చేయడానికి సుమారు 197 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నాడు. -
అంతర్జాతీయ చెస్‌కు వ్లాదిమిర్ క్రామ్నిక్ వీడ్కోలు
ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అంతర్జాతీయ చెస్‌కు వీడ్కోలు పలికాడు. 43 ఏళ్ల క్రామ్నిక్ 2000లో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. ఆ తర్వాత రెండుసార్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను చెస్‌లోని అన్ని ప్రముఖ టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిచాడు. 1996లోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న క్రామ్నిక్ ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ప్రొఫెషనల్ చెస్‌కు గుడ్‌బై చెప్పాలని రెండు నెలల ముందే నిర్ణయం తీసుకున్నాను. చెస్‌కు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికాను’ అని క్రామ్నిక్ తెలిపాడు. -
కబడ్డీకి అనూప్ వీడ్కోలు
పంచకుల (హరియాణా): భారత కబడ్డీ దిగ్గజం అనూప్ కుమార్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనూప్ కెప్టెన్సీలో భారత జట్టు 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు 2016 ప్రపంచకప్ నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. మట్టి ఆటకు విస్తృత ప్రాచుర్యం అందించిన ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరించిన 35 ఏళ్ల అనూప్ జట్టును విజేతగా నిలిపాడు. ‘కబడ్డీ ఆడటం ప్రారంభించిన తొలినాళ్లలో దేశానికి ఆడాలని కలలు కనేవాడిని. అతి కొద్ది మందే తమ స్వప్నాలను సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి అదృష్టం నాకు దక్కింది’ అని అనూప్ పేర్కొన్నాడు. జైపూర్పై గుజరాత్ గెలుపు: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 33–31తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ తరఫున ప్రపంజన్ 11, సచిన్ 8 పాయింట్లతో మెరిశారు. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. -
గంభీర్ గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం గంభీర్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను మంగళవారం ప్రకటించాడు. ఈ నెల 6 నుంచి సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లాలో ఆంధ్ర జట్టుతో జరిగే రంజీ మ్యాచ్‌లో తాను ఆఖరి సారిగా బరిలోకి దిగుతానని 37 ఏళ్ల గంభీర్ వెల్లడించాడు. 2003లో ఏప్రిల్‌లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన గంభీర్... 2016 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అతని టి20 కెరీర్ 2012లో, వన్డే కెరీర్ 2013లోనే ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన గంభీర్ తన వీడ్కోలుపై... ‘రిటైర్మెంట్ గురించి ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నాను. గంభీర్ పనైపోయిందనే వ్యాఖ్యలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. 2018 ఐపీఎల్లో వైఫల్యం తర్వాత ఈ మాటల దాడి మరింత పెరిగింది. అందుకే 15 ఏళ్ల పాటు ఆడిన తర్వాత నాకెంతో ఇష్టమైన ఆటకు గుడ్‌బై చెబుతున్నాను. నా కెరీర్ పూర్తిగా సంతృప్తినిచ్చిందని చెప్పలేను. ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని మాత్రం భావిస్తున్నా. రెండు ప్రపంచకప్‌లు, రెండు ఫైనల్స్‌లోనూ అత్యధిక స్కోరు చూస్తే కలలు నిజమైనట్లుగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించాడు. -
‘మాస్టర్ చెఫ్’...
సాక్షి క్రీడావిభాగం : టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానం, సెంచరీల్లో టాప్–10లో చోటు, విరామం లేకుండా వరుసగా 158 టెస్టులు ఆడిన క్రమశిక్షణ, భారత గడ్డపై, ఆస్ట్రేలియాలో కూడా ఒకే సిరీస్‌లో మూడేసి సెంచరీలు చేసిన అరుదైన ప్రదర్శన, ఎంతో మంది గొప్ప సారథులకు సాధ్యం కాని రీతిలో భారత్‌లో చారిత్రాత్మక సిరీస్ విజయం... తన ప్రొఫైల్‌లో ఇలాంటి ఘనతలు ఎన్నో ఉన్నా అలిస్టర్ కుక్కు ‘స్టార్ క్రికెటర్’గా గుర్తింపు మాత్రం దక్కలేదు. చిన్న విషయాలకే హోరెత్తిపోయే ఇంగ్లండ్ మీడియా అతను ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గూచ్ను అధిగమించినప్పుడు కూడా పెద్దగా సందడి చేయలేదు. గంటలకొద్దీ ఏకాగ్రతతో క్రీజ్‌లో పాతుకుపోవడం, అలసట అనేదే కనిపించకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ పోవడం తప్ప ఏ దశలోనూ పెద్దగా మెరుపులు కనిపించని ‘చెఫ్’ పాతతరం బ్యాటింగ్ ఆధునిక యుగంలో రికార్డులు అందించిందే తప్ప అలరించలేకపోవడం కూడా ఒక కారణం. వ్యక్తిగతంగా కూడా అందరినీ ఆకర్షించే తత్వం లేకపోవడంతో పాటు మాటకారి కాకపోవడం కూడా పరుగుల వరద పారించిన తర్వాత కుక్‌ను వెనకే ఉండిపోయేలా చేశాయి. అయితే ఇలాంటి వాటికంటే కేవలం తన ఆట, పట్టుదలతోనే అతను గొప్ప క్రికెటర్‌గా ఎదగడం విశేషం. టెస్టుల్లో కుక్ అరంగేట్రం అనూహ్యంగా జరిగింది. 2006లో భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ట్రెస్కోథిక్ వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తప్పుకోవడంతో కుక్కు ఓపెనర్‌గా పిలుపు వచ్చింది. ఆ సమయంలో ఎక్కడో వెస్టిండీస్‌లో ఉన్న అతను సుదూర ప్రయాణం చేసి తొలి టెస్టు బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 60, 104 పరుగులతో తన రాకను ఘనంగా చాటాడు. ఆ తర్వాత ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు కుక్ బ్యాట్ నుంచి జాలువారాయి. ఏడాదికి వేయి చొప్పున 12 ఏళ్ల కెరీర్లో 12 వేలకు పైగా పరుగులతో అతను ఇంగ్లండ్ క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచాడు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి కోల్‌కతాలో భారత్‌పై చేసిన 190, సిడ్నీలో ఆస్ట్రేలియాపై 189, లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై 162, గాలేలో శ్రీలంకపై 118, డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై చేసిన 118 పరుగులు కుక్ కెరీర్లో ఆణిముత్యాలు. ఏకంగా 766 పరుగులు సాధించి 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ (2010–11)ను గెలిపించడం బ్యాట్స్‌మన్‌గా కుక్ కెరీర్లో మధుర ఘట్టం. కెప్టెన్‌గా 2012లో భారత గడ్డపై 2–1తో సిరీస్‌ను సాధించడం కుక్ నాయకత్వంలో అత్యుత్తమ క్షణం కాగా... 2013–14 యాషెస్‌లో 0–5తో చిత్తుగా ఓడటం చేదు జ్ఞాపకం. సరిగ్గా 2015 వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్ సెలక్టర్లు కుక్‌ను కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా కూడా తప్పించి అతని పరిమితులను గుర్తు చేయగా... 2016లో భారత్‌లో సిరీస్ కోల్పోవడంతో కుక్ టెస్టు కెప్టెన్సీ పోయింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లోనే విఫలమై ఆటకు కూడా అతను దూరమవుతున్నా డు. గత డిసెంబర్లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్లో అజేయంగా 244 పరుగులు చేసిన అనంతరం ఫామ్ కోల్పోయిన ‘కుకీ’ మరో 9 టెస్టులకే రిటైర్ కావాల్సి రావడం దురదృష్టకరం. ఓపెనర్‌గానే 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ ప్రపంచం కుక్‌ను చిరకాలం గుర్తుంచుకుంటుంది. -
నేడు జస్టిస్ చలమేశ్వర్ పదవీవిరమణ
-
జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు. -
గుడ్ బై 'జాక్'
► అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు ► వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటకు గుడ్‌బై ► శరీరం సహకరించకపోవడమే కారణం బంతి కొత్తగా ఉంది... వికెట్ ఫ్లాట్‌గా ఉంది... ఏం ఫర్వాలేదు.. జహీర్ ఖాన్ స్వింగ్ చేస్తాడు. పిచ్ పచ్చికతో కళకళ్లాడుతోంది. బౌన్స్ ఎక్కువగా ఉంది... దిగుల్లేదు... జహీర్ ఖాన్ బౌన్సర్లు సంధిస్తాడు. బంతి పాతబడింది. వికెట్ నెమ్మదించింది... ఆలోచన అవసరం లేదు... జహీర్ ఖాన్ రివర్స్ స్వింగ్ చేస్తాడు. జహీర్... జహీర్... జహీర్... దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్ పలువరించిన పేరిది. పేసర్లకు ప్రాధాన్యం లేని భారత వికెట్లపై కూడా తన సంచలన బౌలింగ్‌తో జట్టుకు విజయాలు అందించిన భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సహచరులు, అభిమానులు ముద్దుగా జాక్ అని పిలుచుకునే ఈ దిగ్గజ బౌలర్ ఆటను చివరిసారి వచ్చే సీజన్ ఐపీఎల్లో చూడొచ్చు. ముంబై: భారత క్రికెట్ బౌలింగ్ బాధ్యతలను దశాబ్దానికిపైగా భుజాన మోసిన యోధుడు ఆట నుంచి నిష్ర్కమించాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలు, సంచలన విజయాలు దేశానికి అందించిన వీరుడు అస్త్రసన్యాసం చేశాడు. భారత క్రికెట్లో ఎడమచేతి వాటం పేసర్‌గా చిరకాలం గుర్తుండిపోయే బంతులు వేసిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటను వదిలేస్తానని ప్రకటించాడు. గాయాల కారణంగా తరచూ ఇబ్బంది పడుతున్న జహీర్... ఇక మీదట తన శరీరం అంతర్జాతీయ క్రికెట్‌ను తట్టుకోలేదని గ్రహించాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఇంతకాలం కష్టపడుతూ వచ్చిన ‘జాక్’... ఆకస్మికంగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. తన శరీరం ఇక పూర్తి స్థాయిలో బౌలింగ్‌కు సహకరించదని... ప్రతిరోజూ తీసుకునే శిక్షణలో భాగంగా ఈ 37 ఏళ్ల బౌలర్ స్వయంగా గ్రహించాడు. దీంతో రిటైర్మెంట్కు సంబంధించిన ప్రకటనను విడుదల చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడుతున్న జహీర్ వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే సీజన్ తర్వాత పూర్తిగా ఆటను వదిలేస్తాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం చివరిసారి భారత్ తరఫున వన్డే ఆడిన జహీర్... గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రతి క్షణం పోరాడాను ఇక నేను క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది. ఆట నుంచి తప్పుకోవడం ఏ క్రీడాకారుడికైనా కఠినమైన నిర్ణయం. దాదాపుగా రెండు దశాబ్దాలుగా బౌలింగ్ చేయడంతో నా శరీరం బాగా అలసిపోయింది. 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో అత్యంత గొప్ప క్షణం. ‘జాక్ ఈజ్ బ్యాక్’ అనే హెడ్లైన్ మరోసారి వస్తుంది. ఆట నుంచి తప్పుకుంటున్నా... ఏదో ఒక రూపంలో ఇందులో కొనసాగుతాను. శ్రీరామ్పూర్లాంటి గ్రామంలో జన్మించిన నాకు ఈ దేశం గొప్ప అవకాశం ఇచ్చింది. బీసీసీఐ, బరోడా, ముంబై క్రికెట్ సంఘాలతో పాటు ఎంతోమంది కోచ్‌లు, సహచరులు, ఫిజియోలు, అధికారులు నా ప్రయాణంలో సహకరించారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎంతోమందితో కలిసి గడిపాను. వారిలో చాలామంది నాకు ఆప్తమిత్రులుగా మారారు. ఇక నా కుటుంబసభ్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్ మేలు కోరుకునే లక్షలాది మంది అభిమానులు నన్ను ప్రోత్సహించారు. నేనెప్పుడూ ఓటమిని అంగీకరించలేను. అందుకే ప్రతిక్షణం గాయాలతో, ప్రత్యర్థులతో పోరాడాను. జీవితంలో నాకు క్రికెట్ తప్ప ఏమీ తెలియదు. జహీర్ ఖాన్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆటకు ఏదోలా రుణం తీర్చుకుంటాను. ఎన్నో జ్ఞాపకాలతో కెరీర్‌ను ముగిస్తున్నాను. -జహీర్‌ఖాన్ భారత క్రికెట్‌కు జహీర్ ఖాన్ అందించిన అద్భుత సేవలను బీసీసీఐ కొనియాడుతోంది. ఉపఖండంలో ఫాస్ట్‌బౌలర్ పాత్ర చాలా కఠినమే అయినా ఆ సవాల్‌ను స్వీకరించి జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి విజయాలు అందించాడు. జహీర్ భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా - బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ భారత్ నుంచి అత్యంత ఉత్తమ పేసర్లలో జహీర్ కూడా ఉంటాడు. గత 15 ఏళ్ల కాలంలో జట్టు సాధించిన విజయాల్లో తన పాత్ర కీలకం. దశాబ్దకాలం నుంచి పేస్ దళానికి వెన్నెముకగా ఉన్నాడు. దేశంలో రివర్స్ స్వింగ్‌కు అతడే మార్గదర్శకుడు - బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నాకు తెలిసినంత వరకు జహీర్ అత్యంత ప్రశాంతంగా ఉండే పేస్ బౌలర్. సవాళ్లకు ఎప్పుడూ ముందుంటాడు. బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని ఎల్లవేళలా ఆలోచించేవాడు. తన రెండో ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు - సచిన్ టెండూల్కర్ జహీర్కున్న అపార అనుభవం, తెలివితేటలు, భావాన్ని వ్యక్తపరిచే విధానం కారణంగా కచ్చితంగా తను అద్భుత బౌలింగ్ కోచ్ అనిపించుకుంటాడు. ఇదే జరిగితే భారత్‌లో యువ పేసర్లు మరింత మంది తయారవుతారు. ఎలాంటి సౌకర్యాలు పొందకుండానే కెరీర్ ఆరంభించి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అతడు నాకు అత్యంత సన్నిహితుడు - వీవీఎస్ లక్ష్మణ్ వెల్డన్ జహీర్. నీవు లేకుండా భారత క్రికెట్ ఇన్ని విజయాలు సాధించగలిగేది కాదు. అత్యంత తెలివైన బౌలర్‌వి. క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించగల సామర్థ్యం నీకుంది - ధోని జహీర్ భాయ్.. నాతో పాటు మరెంతో మంది ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచావు - కోహ్లి -
కమ్ బ్యాక్ కింగ్
జహీర్ 15 ఏళ్ల ఉజ్వల కెరీర్లో కోట్లాది అభిమానుల ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకుంటూ, దాటుకుంటూ జహీర్ ఖాన్... భారత్ అందించిన అత్యుత్తమ ఎడమ చేతివాటం పేసర్‌గా నిలిచాడు. కఠోర శ్రమ, పోరాటతత్వంతో గాయాలను వెనక్కి తోసి పడ్డ ప్రతీసారి పైకి లేచి తనేంటో నిరూపించుకున్నాడు. కొత్త మిలీనియంలో విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన అత్యుత్తమ విజయాల్లో అతనిదే సింహభాగం. జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన కొత్తలో ‘పాకిస్తాన్ వసీం అక్రమ్‌కు భారత్ సమాధానం’ అని బ్యానర్లు కనిపించాయి. ధోని అయితే ఒక సారి ‘బౌలింగ్ సచిన్’ అంటూ తన ప్రశంసలతో ముంచెత్తాడు. సరిగ్గా ఈ ఉపమానాలే అన్వయించకపోయినా...భారత క్రికెట్‌కు సంబంధించి జహీర్ కచ్చితంగా దిగ్గజ ఆటగాడు. నిస్సందేహంగా గత రెండు దశాబ్దాల్లో భారత బెస్ట్ పేస్ బౌలర్ అయిన ఖాన్... ఇప్పటి యువ పేసర్లందరికీ మార్గదర్శి, గురుతుల్యుడు. బౌలింగ్‌లో పాక్ పేసర్లను స్ఫూర్తిగా తీసుకున్నా... ప్రవర్తనలో ఎన్నడూ వివాదాలకు అవకాశం ఇవ్వని అతను జెంటిల్మెన్ క్రికెటర్. సాధారణ నేపథ్యం చెరకు పంటకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ జహీర్ స్వస్థలం. ఫోటోగ్రాఫర్ అయిన తండ్రి, టీచర్ తల్లి అతడిని చదువు వైపు ప్రోత్సహించారు. ఇంటర్లో 85 శాతం మార్కులు తెచ్చుకున్న తర్వాత జహీర్ సైనికుడిగా జాతీయ డిఫెన్స్ అకాడమీలో చేరాలనే కోరికతో ఎంట్రన్స్‌కు హాజరయ్యాడు. అయితే దాని ఫలితం రాక ముందే జహీర్లోని బౌలింగ్ ప్రతిభను గుర్తించిన తండ్రి అడ్డు చెప్పలేదు. దాంతో 17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి పెట్టి సాధన చేసిన అతను కోటి ఆశలతో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నేషనల్ క్రికెట్ క్లబ్, క్రాస్ మైదాన్‌లో రెగ్యులర్‌గా ఆడటం మొదలు పెట్టాడు. స్థానిక పురుషోత్తం షీల్డ్ టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేరడంతో జహీర్ బౌలింగ్ పదును తేలింది. ముంబై రంజీ జట్టులో చోటు దక్కకపోయినా... ఎంఆర్ఎఫ్ కోచ్ శేఖర్ సిఫారసుతో బరోడా టీమ్‌లో అవకాశం దక్కింది. కేవలం ఒక్క ఏడాది ఫస్ట్ క్లాస్ సీజన్‌కే అతను భారత జట్టులోకి ఎంపిక కావడం విశేషం. స్టార్ బౌలర్‌గా... ‘2000 సంవత్సరంలో నాకంటే అతను ఎంతో అత్యుత్తమ బౌలర్‌గా కనిపించాడు. నేను చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ చందూబోర్డేకు చెప్పి జహీర్‌ను ఎంపిక చేయమన్నాను’... ఇదీ నాటి మన నంబర్‌వన్ పేసర్ శ్రీనాథ్ చెప్పిన మాట. కనీసం 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే లెఫ్టార్మ్ పేసర్ లభించడం భారత్ అదృష్టమని అప్పట్లో చాలా చర్చ జరిగింది. జహీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడేళ్ల పాటు టెస్టు, వన్డే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2001లో కాండీ టెస్టులో లంకపై 7 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించడం కీలక మలుపు. 2002లో ఇంగ్లండ్‌లో చారిత్రక నాట్‌వెస్ట్ సిరీస్ విజయంలో 14 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు. గాయాల బెడద ఒకటి కాదు రెండు కాదు...ఎన్నో సార్లు జహీర్ గాయంతో జట్టుకు దూరం కావడం, మళ్లీ ఫిట్ అయి తిరిగి రావడం రొటీన్‌గా మారింది. మరో బౌలర్‌నైతే భారత్ భరించలేకపోయేదేమో గానీ జహీర్ స్థాయికి అతను ఎప్పుడు వచ్చినా జట్టులో చోటు సిద్ధంగా ఉండేది. ముఖ్యంగా 2006 వార్సెష్టర్‌షైర్ కౌంటీకి ఆడిన తర్వాత రనప్ తగ్గించిన అతను అత్యంత ఫిట్‌గా మారి మళ్లీ టీమిండియా ప్రధాన అస్త్రంగా మారాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించిన జహీర్ కెరీర్లో 2007 ఇంగ్లండ్ సిరీస్ మేలిమలుపు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో 9/134 సహా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి భారత్‌కు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం అందించాడు. గాయాలు ఇబ్బంది పెట్టినా మైదానంలో దిగినప్పుడు మాత్రం అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకారిగా మారాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... వేదిక ఏదైనా భారత బౌలింగ్ ప్రధానాస్త్రంగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన జహీర్ రికార్డులు చరిత్రలో నిలిచి ఉంటాయి. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ జహీర్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), హర్భజన్ (417) మాత్రమే జహీర్ కంటే ముందున్నారు. - సాక్షి క్రీడావిభాగం -
టెస్ట్‌లకు గుడ్‌బై